Teluguwonders:
🕉 విశ్వకర్మ :
సకల వేదముల ప్రకారం విశ్వకర్మయే సృష్టికర్త.
కాని కొన్ని పురాణాలు చతుర్ముఖ బ్రహ్మను సృష్టికర్తగా వేద విరుద్ధంగా పేర్కొన్నాయి. అంతేగాక విశ్వకర్మను చతుర్ముఖ బ్రహ్మ కుమారుడిగా చెప్తాయి,ఇది వాస్తవం కాదు.
అన్ని దిక్కులను చూసే దృష్టి కలిగిన అమిత శక్తి కలవాడు అని ఋగ్వేదము ఈయనను భగవంతునిగా పరిగణించింది.మహాభారతము ఈయనను వేయికళలకు అధినేతగా అభివర్ణించింది.సృష్టి తొలినాళ్ళ నుంచి సుప్రసిద్దులైన శిల్పకారులు ఐదు మంది ఉన్నారు.వారు విశ్వకర్మకు జన్మించారు.
భూమి – నీరు – అగ్ని – వాయువు – ఆకాశము, మరియు బ్రహ్మ – విష్ణు – మహేశ్వర – ఇంద్ర -సూర్య – నక్షత్రములు పుట్టక ముందే విశ్వకర్మ తనంతట తాను స్వయంభు రూపమై అవతరించినాడు.ఐదు ముఖాలతో పంచ తత్వాలతో, పంచరంగులతో , పంచకృత్యములతో వెలసిన విశ్వకర్మ దేవుడు విశ్వబ్రాహ్మణులకు కులగురువైనాడు.
✡విశ్వకర్మ పంచ ముఖాలు:
పంచ ముఖాలతో విశ్వకర్మ పరాత్పరుని యొక్క తూర్పు ముఖమైన సద్యోజాతములో సానగ బ్రహ్మర్షి మను బ్రహ్మగా, దక్షిణ ముఖమైన వసుదేవములో సనాతన మహర్షి యను మయబ్రహ్మగా, పశ్చిమ ముఖమైన అఘేరియునందు అహభూవ మహర్షి యను త్వష్ట బ్రహ్మగా, ఉత్తర ముఖమైన తత్పురుషములో ప్రత్న మహర్షి యను శిల్పి బ్రహ్మగా, ఊర్ధ్వ ముఖమైన ఈశానములో సువర్ణ మహర్షియను విశ్వజ్ఞ బ్రహ్మగా చెప్పబడినది. అందరికీ సుపరిచితమైన పురుష సూక్తం కూడా విశ్వకర్మను విరాట్ పురుషునిగా వర్ణించింది.
ఈ విశ్వకర్మల గురించి వేద, పురాణ, ఇతిహాసలో,ప్రాచీన సాహిత్యంలో,ఆధునిక సాహిత్యంలో వీరి గురించి ప్రస్తావించబడినది . ఇదే విధముగా విశ్వకర్మ గురించి నన్నయ,తిక్కన,ఎర్రన,గోనబుద్దారెడ్డి,హూళక్కి భాస్కరుడు,కంకటి పాపరాజు,మారన,పోతన,శ్రీనాధుడు,చేమకూర వేంకటకవి,పుష్పగిరి తిమ్మన,ధూర్జటి,బద్దేన,వేమన,తరిగొండ వెంగమాంబ,మట్ల అనంతరాజు,దొంతిరెడ్డి పట్టాభి రామదాస కవి మొదలగువారెందరో వారి వారి రచనలలో ప్రస్తావించారు.
🔯విశ్వకర్మీయుల కులవృత్తులు :
లోకంలో మానవ జీవనానికి విశ్వకర్మీయుల కులవృత్తులు ప్రధాన ఆధారంగా ఉండేవి,ఉన్నాయి. విశ్వబ్రాహ్మణుల వృత్తుల ద్వార సమాజ నిర్మాణంలో ప్రధానపాత్ర పోషిస్తూ వస్తున్నారు. వీరిని ఈ సమాజంలో ఆచార్య, దైవజ్ఞ ,ఆచారి అనే పేర్లతో పిలుస్తుంటారు.దేవాలయాలలో విగ్రహాలు తయారు చేయువారు విశ్వకర్మలే,వాటిని ప్రతిష్టించుటకు ప్రధానమైన వారు విశ్వకర్మీయులే,అలాగే రధోత్సవంలో విశ్వబ్రాహ్మణుడు లేనిదే దేవకార్యక్రమాలు జరగవు.ఇంతటి ప్రత్యేకతలు కలిగిన వీరు పూర్వం యంత్ర పరికరాలు రాక ముందు పనులన్ని మానవ శ్రమతోనే ముడిపడి ఉండేవి.
🌟 అనేక రంగాలలో విశ్వబ్రాహ్మణులు :
కుల వృత్తులనేకాకజ్యోతిష, పౌరోహిత, యంత్ర, గృహవస్తునిర్మాతలుగా, విద్యావేత్తలుగా, వైద్యులుగా, ప్రకృతి వైద్యులుగా,శాసన లేఖకులుగా, ఆర్కిటేక్చర్లుగా, సివిల్ ఇంజనీయర్లుగా,రచయితలుగా,కవులుగా,కవయిత్రులుగా,పత్రికా రంగాలలో,రాజకీయ,సినిమా,టీవి మొదలగు అనేక రంగాలలో నాటి నుండి నేటి వరకు సకల కళల యందు వీరి ప్రావీణ్యతను నిరూపిస్తూ ఈ విశ్వం నందు నిష్ణాతులై విరాజిల్లుతున్నారు.
👉ఈ విశ్వకర్మ కులంలో జన్మించిన వారే శ్రీ శ్రీ శ్రీ జగద్గురువు ఆది శంకారాచార్యుల వారు, శ్రీమద్విరాట్ శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు ఈయన కుల వృత్తులను చేస్తూనే కాలజ్ఞానాన్ని చెప్పాడు.
✡విశ్వకర్మ : విశ్వకర్మ లలో ఒక విశ్వకర్మఇతడు .ఇతడు ఒక దేవశిల్పి. అష్టావసువులలో ఒకడైన ప్రభావసు, యోగసిద్ధిల కుమారుడు. ఇతని భార్య ప్రహ్లాదిని.వీరి కుమార్తె సంజ్ఞ. ఈమె సూర్యుని భార్య. ఇతనికి నలుడను వానరుడు, విశ్వరూపుడు అను కుమారులు కలరు.
✡వృత్తాంతం : ఘృతాచి అనే అప్సరస అందంగా అలంకరించుకొని ప్రియుని వద్దకు వెళ్లుచున్న ఆమెను చూసి కామించగా ఆమె కోపంతో ఇతనిని భూలోకమునందు జన్మించమని శపించింది. ఇతడు కూడాఆమెను శూద్ర యోనియందు
జన్మిం చమని ప్రతి శాపమిచ్చాడు. ఆమె . శాపవశాత్తు ఇతడు బ్రాహ్మణుడుగా ప్రయాగలో జన్మించాడు. ఘృతాచి ఒక గోపకాంతగా పుట్టెను. ఒకసారి వీరిద్దరూ ఎదురుపడి తమ తమ పూర్వ జన్మవృత్తాంతము తెలిసికొని ఒకరికొకరు ఇష్టపడి
వివాహం చేసుకొన్నారు. ఆవిధంగా వీరికి జన్మించిన సంతతే కంచరులు, వడ్రంగులు, కంసాలులుగా వృద్ధి చెందారు.
ఇతడు ఇంద్రుని సభలో వుండేవాడు. యముని సభను, వరుణుని భవనాన్ని నిర్మించాడు. తరువాత బ్రహ్మ కొలువులో వుండి అతడ్ని పూజించాడు. . పుష్పక విమానాన్ని తయారు చేసిందితడే.