Teluguwonders:
వితికా షెరు.. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో టైటిల్ ఫేవరేట్‌గా ఉన్న వితికా మిగిలిన కంటెస్టెంట్స్‌కు గట్టిపోటీనే ఇస్తుంది. భర్తతో కలిసి గేమ్ ఆడుతుంది.బిగ్ బాస్ సీజన్ 3లో భర్త వరుణ్‌తో కలిసి ఎంట్రీ ఇచ్చిన వితికా షెరు టైటిల్ ఫేవరేట్‌గా సేఫ్ గేమ్ ఆడుతోంది. 👉ఏడో వారంలోనూ భర్తతో కలిసి ఆడుతూ, పాడుతూ, నవ్వుతూ, నవ్విస్తూ, గొడవపడుతూ హాట్ టాపిక్ అవుతోంది.
💚వితికా షేరు :
బిగ్ బాస్ షోతో క్రేజ్ సంపాదించిన వితికా.. ఒకప్పుడు గ్లామర్ బ్యూటీగా సెగలు రేపింది. తెలుగు, కన్నడ, తమిళ్ చిత్రాల్లో నటించినా పెద్దగా పాపులారిటీ సంపాదించలేకపోయిన వితిక బిగ్ బాస్ తో పాపులారిటీ సంపాదించుకుంది .దాంతో అప్పటి హాట్ ఫొటోలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తున్నాయి.
బిగ్ బాస్ హౌస్‌లో భర్త వరుణ్ సందేశ్‌తో కలిసి అడుగుపెట్టిన భీమవరం బ్యూటీ వితికా షెరు అసలు పేరు జీడిగుంట వితిక. పుట్టింది భీమవరంలో అయినా పెరిగింది ముంబైలో. 11వ ఏట బాల నటిగా ఎంట్రీ ఇచ్చిన వితికా.. 2008లో ‘అంతు ఇంతు ప్రీతి బందు’ అనే కన్నడ చిత్రంలో నటించింది.
తన అత్త కూడా సినిమా నటే కావడంతో అత్తతో కలిసి సినిమా షూటింగ్‌లకు వెళ్లేది వితికా. అలా ఇండస్ట్రీతో అనుబంధం ఏర్పరుకున్నది వితికా షెరు. తెలుగులో ‘ఆడవారి మాటలకు అర్దాలే వేరులే’ సినిమాలో కలర్స్ స్వాతి చేసిన పాత్రను కన్నడలో వితికా చేసి పాపులర్ అయ్యింది. 2009లో ‘ఉల్లాస ఉత్సాహ’ కన్నడ సినిమాలో నటించింది. అదే ఏడాది ‘ప్రేమించు రోజుల్లో’ చిత్రంతో తెలుగు తెరకూ పరిచయమైంది.
ఆ తరువాత సందడి, జుమ్మంది నాథం, భీమిలి కబడ్డీ జట్టు, ప్రేమ ఇస్క్ కాదల్, పడ్డానండి ప్రేమలో మరీ తదితర తెలుగు చిత్రాల్లో నటించి తమిళ్‌లోనూ మహాబలిపురం అనే చిత్రంలో నటించింది. 💚వరుణ్‌తో‘పడ్డానండి ప్రేమలో మరీ’ ; వరుణ్‌తో కలిసి నటించిన ‘పడ్డానండి ప్రేమలో మరీ’ చిత్రంతో ఇద్దరి మధ్య స్నేహం చిగురించి ప్రేమగా మారింది. దీంతో 2016 ఆగస్టు 18 వివాహ బంధంతో ఒక్కటయ్యారు వితికా వరుణ్‌లు.
గేమ్ స్టార్టింగ్‌లో ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ ఇద్దరూ ఇప్పుడు దూషించుకుంటూ ఒకర్నొకరు ఎలిమినేట్ చేసుకునే వరకూ వెళ్లారు. ఆరో వారం ఎలిమినేషన్‌లో వరుణ్‌ని ఎలిమినేట్ చేసింది వితికా. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో టైటిల్ ఫేవరెట్‌గా ఉన్న ఈ ఇద్దరి మధ్య ఫిటింగ్‌లు పెడుతున్నాడు బిగ్ బాస్. 👉మరి ఈ ఇద్దరి గొడవ ఎందాకా వెళ్తుందో చూడాలి…
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.