Latest

    సినిమా తీస్తే చంపేస్తాం !!

    ఔను ఆర్ నారాయణ మూర్తి ని సినిమాలు తీస్తే చంపేస్తామని బెదిరించారట. 🔴పీపుల్స్ స్టార్ .ఆర్. నారాయణ మూర్తి : ఆర్. నారాయణ మూర్తి సినిమాలు గురించి తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఎవరూ ఉండరు .పేద వారి కష్టాల గురించి, పెద్దవారి ఆగడాల గురించి ఉన్నది ఉన్నట్టుగా తన సినిమాలో చూపించడం నారాయణమూర్తి స్పెషాలిటీ .ఆయన సినిమాలన్నీ పేదవారికి ఫేవర్ గానే ఉంటాయి పేద వారి ప్రాబ్లమ్స్ కోసం ప్రభుత్వం తో పోరాడు తోనే ఉంటాయి.అందుకే ఆయనకు పీపుల్ స్టార్ అనే బిరుదు వచ్చింది ఆయన సినిమాలు ప్రజలపై ఎంతో ప్రబావితం చూపిస్తాయి.. ఆయన తీసే విప్లవాత్మక సినిమాలు ప్రజలను ఉత్తేజ పరుస్తాయి. ఆలోచింపజేస్తాయి. అందుకే ఆయన తీసే ఎర్ర సినిమాలంటే.. అధికారంలో ఉన్న పాలకులకు కూడా ఇబ్బందే.

    🔴ఇటీవల ఓ ఇంటర్వ్యూలో :1990ల నాటి రోజులు..లో ఆయన ఎదుర్కున్న సెన్సార్ ఇబ్బందులు చెప్పుకొచ్చారు. అప్పట్లో ఆర్. నారాయణమూర్తి సినిమాలంటే సూపర్ హిట్లే.. దండోరా, చీమల దండు వంటి సినిమాలతో మాంచి జోరు మీద ఉన్నారు. 🔅అయితే చీకటి సూర్యులు అనే సినిమా షూటింగ్‌ కి అసలు అనుమతే దొరకలేదట. ఆ తర్వాత చంద్రబాబు పర్మిషన్ ఇప్పించారట.

    🔴లాల్ సలామ్ సినిమా కి బెదిరింపులు: అప్పుడు తీసిన లాల్ సలామ్ సినిమాకు చాలా అడ్డంకులు వచ్చాయట. అప్పటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దనరెడ్డి సభలో ఇలాంటి సినిమాలు తీస్తావేంటి నారాయణమూర్తి అని ఆర్. నారాయణమూర్తిని తిట్టారట. అప్పటి ఇంటెలిజెన్స్‌ ఐజీ అయితే.. ఏకంగా చంపేస్తామని బెదిరించారట. ఇలాంటి సినిమాలు తీస్తే మిమ్మల్ని ఎన్‌కౌంటర్‌ చేయాల్సి వస్తుంది అని వార్నింగ్ ఇచ్చారట. అలా సినిమాల విషయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారట ఆర్. నారాయణమూర్తి..కానీ ఆయన మాత్రం ఎక్కడా తగ్గింది లేదు.


    Discover more from Telugu Wonders

    Subscribe to get the latest posts sent to your email.

    Leave a Reply

    Discover more from Telugu Wonders

    Subscribe now to keep reading and get access to the full archive.

    Continue reading