Teluguwonders:
స్పెయిన్ ప్రభుత్వం ప్రకటన చేసింది. ఈ మందు వాడటం వల్ల 16మంది చిన్నారులకు ‘వేర్‌వుల్ఫ్ సిండ్రోమ్'(తోడేలు వ్యాధి) సోకిందని తెలిపింది. పిల్లల్లో అరుగుదల కోసం ఉపయోగించే ఓమెప్రజోల్ ఔషధం భారత్ నుంచి స్పెయిన్‌కు దిగుమతయింది. అలా దిగుమతైన వాటిలో ఓ బ్యాచ్‌లోని మెడిసిన్ మాత్రమే దీనికి కారణమని స్పెయిన్ ఆరోగ్యశాఖ అధికారులు తేల్చారు. ఆ మెడిసిన్ మినోక్సిడిల్ అనే రసాయనంతో కలిసిందని, దీని వల్ల చిన్నారుల్లో ‘హైపర్‌ట్రికోసిస్’ లక్షణాలు కనిపించాయని వెల్లడించారు. ఈ వ్యాధి సోకిన చిన్నారుల శరీరం మొత్తం వెంట్రుకలు వచ్చేస్తాయని, అందుకే దీన్ని ‘వేర్‌వుల్ఫ్ సిండ్రోమ్’ అనికూడా అంటారని చెప్పారు.
ఈ ఔషధం వల్ల పెద్దవారికి ఎలాంటి హానీ జరగదని, కేవలం చిన్నారులపైనే దీని ప్రభావం ఉంటుందని వివరించారు. మార్కెట్లో విడుదలైన ఈ మెడిసిన్‌ను వెనక్కు రప్పిస్తున్నామని, ఇప్పటికే చాలా వరకు వెనక్కి తెప్పించేశామని తెలిపారు. ఈ ఔషధం విషయంలో తల్లిదండ్రులు అప్పమత్తంగా ఉండాలని, పిల్లల్లో వ్యాధి లక్షణాలు కనిపించగానే ఆస్పత్రికి తరలించాలని సూచించారు. సాధ్యమైనంత వరకు ఈ మందు వాడొద్దని సలహా ఇచ్చారు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.