వరుస ఆత్మ హత్యలు:ఆ క్యాంపస్ లో అసలు ఏమవుతుంది..!!?

Spread the love

Teluguwonders:

ఆ క్యాంపస్‌కు ఏమైంది? :

వరంగల్ నగరంలోని ప్రతిష్టాత్మక జాతీయ విద్యా సంస్థ నిట్‌లో విద్యార్థుల ఆత్మహత్యల ఘటనలు కలవరానికి గురిచేస్తున్నాయి. నిట్ క్యాంపస్‌లో ఉరేసుకొని మరో విద్యార్థి బలవన్మరణం చెందాడు.

నిట్, వరంగల్:

వరంగల్‌ నిట్‌లో ఆత్మహత్యల ఘటనలు కలకలం రేపుతున్నాయి. బీటెక్‌ విద్యార్థి ఆత్మహత్య ఘటన బుధవారం (ఆగస్టు 7) కలకలం రేపింది. బీటెక్‌ థర్డ్ ఇయర్ చదువుతున్న కౌశిక్‌ పాండే (20) అనే విద్యార్థి హాస్టల్‌లోని తన గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కౌశిక్ పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రానికి చెందినవాడిగా పోలీసులు గుర్తించారు. అతడు తన అడ్మిషన్‌ రెన్యువల్‌ చేసుకునేందుకు ఇటీవలే తన తండ్రితో కలిసి నిట్‌కు వచ్చాడు. బుధవారం తన గదిలోనే విగతజీవిగా కనిపించడంతో విద్యార్థులు షాక్‌కు గురయ్యారు.

కౌశిక్ గత కొంత కాలంగా ఒత్తిడికి లోనవుతున్నట్లు తెలుస్తోంది. కుంగుబాటుకు గురవడం వల్లే ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు. తోటి విద్యార్థి మృతి చెందడంతో నిట్‌లో విషాద ఛాయలు అలముకున్నాయి. ఘటనపై కాజీపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కౌశిక్‌ ఆత్మహత్యకు గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.

తెలంగాణలో హైదరాబాద్ తర్వాత రెండో అతిపెద్ద నగరం వరంగల్‌లోని ప్రతిష్ఠాత్మక జాతీయ సాంకేతిక విద్యా సంస్థ (ఎన్‌ఐటీ)లో తరచూ విద్యార్థుల ఆత్మహత్య చర్చనీయాంశంగా మారింది.

🔴వరుస ఆత్మ హత్యలు :

గతేడాది ఎంటెక్‌ విద్యార్థి అమిత్‌ కుమార్‌ ఆత్మహత్యతో క్యాంపస్‌లో మృత్యు గంట మోగింది.

⚫అమిత్‌ ఆత్మహత్య చేసుకున్న హాస్టల్ భవనంలోనే అంతకుముందు హర్యాణాకు చెందిన శిరీష్ భరద్వాజ్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. జీవితంపై విరక్తి చెందానని లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

⚫మరో విద్యార్థి పట్టపగలే హాస్టల్ భవనం నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

⚫ఆ తర్వాత విమెన్ హాస్టల్‌లో మాధురి అనే విద్యార్థిని హాస్టల్‌ భవనం నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఇలా ఏడాదికి ఒకటి, రెండు ఆత్మహత్యలు నిట్‌ను వెంటాడుతున్నాయి. దీనిపై శాస్త్రీయ కోణంలో అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. 👉నిట్ క్యాంపస్‌లో ఏటా ఇద్దరు, ముగ్గురు విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడుతుండటం నిట్‌ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తోంది.


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading