ఆ కేరళ ప్రయాణికులు ఏమయ్యారు…!!!??

Spread the love

Teluguwonders: విదేశీ మోజు తో ,అక్రమంగా బయలుదేరిన వ్యక్తుల చిన్న క్లూ కూడా దొరకని వైనం ఇది ..

243 మంది వ్యక్తులు ఓవైపు విదేశీ మోజు తో , మరోవైపు అధిక వేతనాలు లభిస్తాయన్న ఆశ తో విదేశాలకు అక్రమంగా బయలుదేరారు.వారి దురాశ వారిని అక్రమ దారిలో విదేశీ బాటపట్టించింది.

🔴ఆచూకీ మాయం : అయితే, కేరళ నుంచి ఓ బోటులో బయల్దేరిన వారు నెలలు గడుస్తున్నా తమవారికి ఫోన్లు చేయకపోవడంతో ఇప్పుడు వారి ఆచూకీ మిస్టరీగా మారింది.

👉వివరాల్లోకి వెళ్తే..

🔴జనవరి 12న బయల్దేరిన బోటు : జనవరి 12న కేరళలోని ఎర్నాకుళం తీరం నుంచి ఓ ఫిషింగ్ బోటులో బయల్దేరిన వ్యక్తుల నుంచి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు.

👉 కొచ్చిలో భారీ సంఖ్యలో బ్యాగులు లభ్యం :
జనవరి 12న బోటు బయల్దేరగా, కోచి తీరం సమీపంలో కేరళ పోలీసులకు కొంత లగేజి దొరికింది. దాదాపు 50 బ్యాగులు, కొన్ని ఐడెంటిటీ కార్డులు లభ్యమయ్యాయి.

👉అంచనా ప్రకారం పోలీసుల భావన : బోటులో స్థలం సరిపోక తీరంలోనే లగేజి వదిలేసి వెళ్లిపోయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కాగా, ఆ బోటు ఎక్కినవాళ్ల లక్ష్యం న్యూజిలాండ్ వెళ్లడమేనని తెలుస్తోంది. కానీ ఆ బోటు ఆస్ట్రేలియా అధీనంలోని క్రిస్మస్ ఐలాండ్ చేరుకుని ఉండొచ్చని, అల్జీరియా భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకుందని భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.

వీళ్లందరినీ ఢిల్లీ, కేరళకు చెందిన కొందరు బ్రోకర్లు అక్రమంగా విదేశాలకు పంపిస్తున్నట్టు గుర్తించి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. అటు, భారత ఇంటర్ పోల్ కార్యాలయం కూడా బ్లూకార్నర్ నోటీసులు జారీచేసింది.

🔴కేరళ హైకోర్టు స్పందన : కాగా, దీనిపై కేరళ హైకోర్టు కూడా స్పందిస్తూ, ఇది తేలిగ్గా తీసుకునే వ్యవహారం కాదని, దేశభద్రతకు సంబంధించిన విషయం అని వ్యాఖ్యానించింది.

👉అయితే, దీనిపై ఇంతవరకు చిన్న క్లూ కూడా లభించకపోవడం బాధితుల కుటుంబాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఆ బోటులో ఉన్నవాళ్లు సురక్షితంగా ఉన్నారా లేక ఏదైనా ప్రమాదానికి గురయ్యారా అనేది ఇప్పుడు సందేహాస్పదంగా మారింది.


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading