Latest

    భారత క్రికెటర్ల కి కోహ్లీ ఎందుకు వార్నింగ్ ఇచ్చాడు !?

    Why Kohli warns Indian cricketers

    Teluguwonders:

    ఈ ఏడాది పేలవ ఫామ్‌తో కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్ నిరాశపరుస్తున్నారు .
    ఇటీవల వెస్టిండీస్.. తాజాగా దక్షిణాఫ్రికాతో సిరీస్‌ కోసం యువ క్రికెటర్లకి చోటు దక్కింది.
    ఇప్పటికే శ్రేయాస్ అయ్యర్, నవదీప్ షైనీ సత్తా నిరూపించుకున్నారు . విండీస్ పర్యటనలో దీపక్ , చాహర్, ఖలీల్ అహ్మద్ తేలిపోయారు .ప్రతి క్రికెటర్‌కీ కనీసం మూడు నుంచి ఐదు అవకాశాలివ్వనున్నట్లు కోహ్లీ వెల్లడి చేశారు.

    💥భారత క్రికెటర్లకి కెప్టెన్ విరాట్ కోహ్లీ వార్నింగ్ :

    భారత జట్టులో ఫామ్‌ కోసం తంటాలు పడుతున్న క్రికెటర్లకి కెప్టెన్ విరాట్ కోహ్లీ గట్టి వార్నింగ్ ఇచ్చాడు. వరల్డ్‌కప్ నేపథ్యంలో.. కనీసం మూడు నుంచి ఐదు మ్యాచ్‌ల్లోపు ఫామ్ నిరూపించుకోవాలని లేదంటే.. వేటు తప్పదని పరోక్షంగా హెచ్చరించాడు.

    🔴కోహ్లీ మాట్లాడుతూ :

    ‘టీమిండియా మేనేజ్‌మెంట్ చాలా స్పష్టతతో ఉంది. టీ20 వరల్డ్‌కప్‌లోపు టీమ్‌లోని ఎవరికీ 30 మ్యాచ్‌లు ఆడే అవకాశం రాబోదు. నేను జట్టులోకి వచ్చిన కొత్తలో కూడా.. నాకు 15-20 మ్యాచ్‌ల్లో అవకాశాలు ఇస్తారని ఆశించలేదు. అప్పుడు ఉన్న పోటీ ప్రకారం.. గరిష్టంగా ఐదు ఛాన్స్‌లు మాత్రమే ఇవ్వనున్నారని తెలిసింది. దీంతో.. వేగంగా సత్తా నిరూపించుకున్నా. వరల్డ్‌కప్‌లోపు ఓ 30 మ్యాచ్‌ల్ని మాత్రమే టీమిండియా ఆడే అవకాశం ఉండటంతో.. ఆటగాళ్లు తమకి ఎన్ని అవకాశాలు వస్తాయో..? లెక్కించుకోవచ్చు’ అని విరాట్ కోహ్లీ ఘాటుగా సూచించాడు.

    💥కఠిన నిర్ణయాలు తీసుకోబోతున్న కెప్టెన్ :

    ఆస్ట్రేలియా గడ్డపై వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో టీమిండియా మేనేజ్‌మెంట్ ఇక కఠిన నిర్ణయాలు తీసుకోబోతోందని కెప్టెన్ విరాట్ కోహ్లీ వెల్లడించాడు. మునుపటిలా ఆటగాళ్లకి టీమ్‌లో విరివిగా అవకాశాలివ్వడం కుదరదని తేల్చిచెప్పిన విరాట్ కోహ్లీ.. నిరూపించుకునేందుకు కనీసం మూడు నుంచి ఐదు మ్యాచ్‌ ఛాన్స్‌లు మాత్రమే ఇస్తామని స్పష్టం చేశాడు. వరల్డ్‌కప్‌కి ముందు టీమిండియాకి కేవలం 30 మ్యాచ్‌లు మాత్రమే ఆడే అవకాశం ఉండటంతో.. ఫామ్‌ కోల్పోయిన క్రికెటర్లకి అంతకు మించి అవకాశాలివ్వలేమని కోహ్లీ తేల్చి చెప్పేశాడు.

    🔴ఫెయిలవుతున్న ఆటగాళ్లు :

    భారత టీ20 జట్టులో ప్రస్తుతం ఉన్న ఓపెనర్ శిఖర్ ధావన్ ఈ ఏడాది ఏడు టీ20 మ్యాచ్‌లాడి చేసింది 105 పరుగులు. ఇదే తరహాలో మరో ఓపెనర్ కేఎల్ రాహుల్‌ కూడా విఫలమవుతున్నాడు. ఇక బౌలింగ్ విభాగంలో యువ స్పిన్నర్ దీపక్ చాహర్‌, ఫాస్ట్ బౌలర్ ఖలీల్ అహ్మద్‌లకి ఇటీవల వెస్టిండీస్ పర్యటనలో అవకాశం ఇచ్చినా.. ఫెయిలయ్యారు.


    Discover more from Telugu Wonders

    Subscribe to get the latest posts sent to your email.

    Leave a Reply

    Discover more from Telugu Wonders

    Subscribe now to keep reading and get access to the full archive.

    Continue reading