పరీక్షల్లో కాపీలు కొట్టకుండా.. ఇదేం పధ్దతి బాబోయ్ !

Spread the love

Teluguwonders:

మెక్సికోలో ఓ స్కూలు టీచర్ పరీక్షల్లో విద్యార్థులు కాపీలు కొట్టకుండా వెరైటీ మెథడ్ ఫాలో అయ్యాడు. వాళ్ళ తలల మీద కార్డ్ బోర్డు బాక్సులు బోర్లించాడు. వాళ్ళు అటు,ఇటు దిక్కులు చూడకుండా..కేవలం టేబుల్ మీది కాగితం పైనే దృష్టి నిలపడానికి ఈ ఏర్పాటట. దీంతో ఈ బాక్సులే పెద్ద ‘ తలకాయలు ‘గా పాపం స్టూడెంట్స్ అంతా వాటిని ధరించి ఎగ్జామ్స్ రాయక తప్పలేదు. ఇది తెలిసిన ఆ విద్యార్థుల తలిదండ్రులు కోపంతో రగిలిపోయారు. ఆ ఉపాధ్యాయుడిని డిస్మిస్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ పధ్దతి తమ పిల్లలను హింసించడమేనని ఫైరయ్యారు. తమ పిల్లల హక్కులను పరిరక్షించాలని స్కూలు యాజమాన్యాన్ని కోరారు. అయితే ఆ స్కూలు మేనేజ్ మెంట్ మాత్రం విద్యార్థుల సైకోమోటార్ డెవలప్ మెంట్ కి ఇది ఎంతగానో దోహదపడుతుందని అంటున్నారు.

అంటే ఇలా చేస్తే వారు కాపీ కొట్టడాన్ని మానుకోవడమే కాదు.. వారి మేధాశక్తికి ఇది సహాయపడుతుందట. పైగా తమ పాఠశాల విద్యార్థులు కూడా ఇందుకు అంగీకారం తెలిపారని ఆ స్కూలు యాజమాన్యం చెబుతోంది. తాము మానవతా విలువలను, వ్యక్తుల హక్కులను గౌరవిస్తామని బిల్డప్ కూడా ఇచ్చుకుంది.

అయితే ఈ ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారా అన్నది తెలియలేదు. కాగా-బ్యాంకాక్ లో ఓ యూనివర్సిటీ విద్యార్థులకు కూడా ఇలాంటి ‘ పరీక్షే ‘ పెట్టారు. వాళ్ళు ఎగ్జామ్స్ లో చీటింగ్ చేయకుండా టీచర్లు స్పెషల్ ‘బ్లింకర్లను ‘ వారి నెత్తిమీద పెట్టారు.. మరి ఇలాంటి పోకడలకు ప్రభుత్వ లేదా అధికారుల ఆమోదం గానీ, పర్మిషన్ గానీ ఉందా అన్నది తెలియడంలేదు. ఏమైనా.. ఈ విధమైన నావెల్ మెథడ్ ఇండియాలో కూడా అనుసరిస్తే ఇంకేమైనా ఉందా !!


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading