Teluguwonders:
డబుల్ హ్యాట్రిక్ పరాజయాల తో డీలా పడ్డ సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ఎట్టకేలకు చిత్ర లహరితో ప్రేక్షకులకు ముందుకు వచ్చి హిట్ కొట్టాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రొమాంటిక్ ఎంటర్టైనర్ గా కిషోర్ తిరుమల తెరకెక్కించిన ఈ చిత్రం ఈ ఏడాది సమ్మర్ లో విడుదలై డీసెంట్ హిట్ అనిపించుకుంది.
ఇక ఈ సినిమా తరువాత కొంచెం గ్యాప్ తీసుకున్న సాయి ధరమ్ ప్రస్తుతం మారుతీ డైరెక్షన్ లో నటిస్తున్నాడు. ‘ప్రతి రోజు పండగే, అనే టైటిల్ తో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. కాగా ఈసినిమా కు సంబందించి ఎలాంటి అప్డేట్స్ ;లీక్ కాకుండా చూసుకుంటుంది చిత్ర బృందం.
గీతా ఆర్ట్స్ 2 , యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఈఏడాది చివర్లో విడుదలకానుంది. ఈచిత్రంలో సాయి ధరమ్ కు జోడిగా రాశిఖన్నా నటిస్తుంది. కాగా వీరిద్దరు కలిసి నటించడంఇది రెండో సారి. ఇంతకుముందు వీరి కలయికలో అనిల్ రావిపూడి తెరకెక్కించిన సుప్రీమ్ సినిమా సూపర్ హిట్ అయ్యింది. మరి ఈసారి కూడా ప్రతి రోజు పండగే తో అదే మ్యాజిక్ ను రిపీట్ చేసి తేజూ , రాశి హిట్ పెయిర్ అనిపించుకుంటారో లేదో చూడాలి.
ఇకఇదిలా ఉంటే తేజూ తాజాగా మరో సినిమాకు సైన్ చేశాడట. ఉయ్యాలా జంపాల అనే సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసినా సుబ్బు చెప్పిన కథ సాయి ధరమ్ కు బాగా నచ్చడం తో వెంటనే సినిమాకు ఓకే చెప్పాడట. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని ఎస్ వి సి సి క్రియేషన్స్ పతాకం ఫై ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించనున్నాడు. త్వరలోనే ఈసినిమా అధికారికంగా లాంచ్ కానుంది.