Teluguwonders:
💥సాహొ ప్రీ రిలీజ్ ఈవెంట్ -భారత సినీ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో ఈ ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు ఇంత పెద్ద ఈవెంట్ బాలీవుడ్‌లో కూడా జరగలేదు. మొత్తం లక్ష మంది ప్రేక్షకులు పాల్గొనే విధంగా ఏర్పాట్లు చేశారు. అయితే, రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అంతకు మించి రెబల్ స్టార్ అభిమానులు వచ్చినట్లు అంచనా వేస్తున్నారు. ఫిలిం సిటీ పరిసర ప్రాంతమంతా జనసంద్రమైంది. ఇక వేదిక వద్ద అభిమానులను కట్టడి చేయడం పోలీసుల వల్ల కూడా కాలేదు.
🔴‘సాహో’ప్రీ రిలీజ్ వేడుక :
రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ జంటగా నటించిన ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ ‘సాహో’. ఈనెల 30న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కాబోతోంది. తెలుగుతో పాటు మొత్తం నాలుగు భాషల్లో (తమిళం, మలయాళం, హిందీ) ‘సాహో’ విడుదలవుతోంది. ఇప్పటికే ఈ సినిమాపై ఇటు ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు.. అటు సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ అంచనాలను మరింతగా పెంచేలా చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహిస్తున్నారు.
🎙వ్యాఖ్యాత..గా సుమ :
యాంకర్ సుమ పంచ్‌లు మామూలుగానే తట్టుకోలేం. అలాంటిది, ‘సాహో’ లాంటి భారీ ప్రీ రిలీజ్ వేడుకలో ఆమె వాక్‌చాతుర్యాన్ని ఆపడం ఎవరి తరమైనా అవుతుందా? అది ప్రభాస్ ఫ్యాన్స్ అయినా సరే..!!.
👉వివరాల్లోకి వెళ్తే :
ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీ వేదికగా ‘సాహో’ ప్రీ రిలీజ్ వేడుక చాలా సందడి గా మొదలైంది. ఇంత సందడి ని కూడా ఆవిడ తన టైమింగ్ తో అలవోకగా మేనేజ్ చేసింది .
👉ప్రభాస్ ఫాన్స్ తో ప్రమాణం :
ఈ ప్రీ రిలీజ్ వేడుకను అందరూ వీక్షించేలా వేదిక వద్ద పెద్ద పెద్ద ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఈ స్క్రీన్లపైకి ఫ్యాన్స్ ఎక్కేసారు. బారికేడ్లను తోసేసారు. వీళ్లను ఉద్దేశించి యాంకర్ సుమ అదిరిపోయే పంచ్ విసిరారు.
‘‘పొగ తాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి ఎంత హానికరమో.. ఎల్‌ఈడీలు ఎక్కడం, బారికేడ్లను తొక్కడం, ఫెన్స్‌లు తెంపడం మీ ఆరోగ్యానికి, పక్కవాళ్ల ఆరోగ్యానికి కూడా అంతే హానికరం. మీరందరూ ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్స్ అయినట్టయితే మీరు కచ్చితంగా క్రమశిక్షణతో ఉంటారని మాకు తెలుసు. మీరు, మీ పక్కన ఉండేవాళ్లు జాగ్రత్తగా ఉండేలా, బాధ్యత తీసుకుంటారా?’’ అని ప్రశ్నిస్తూ రెబల్ స్టార్ ఫ్యాన్స్‌తో సుమ ప్రమాణం చేయించారు.
‘‘ప్రభాస్ ఫ్యాన్స్ అనే మేము ఈరోజు కార్యక్రమం సజావుగా జరిగేలా, బాగుండేలా చూసుకుంటామని ప్రభాస్‌కి ప్రామిస్ చేస్తున్నాము’’ అని సుమ ప్రమాణం చేయించారు. అలాగే, ఇంత పెద్ద ఈవెంట్ నిర్వహణకు ఎంతగానో సహకరించిన పోలీసు శాఖకు సుమ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ‘‘మనందరం ఈరోజు ఎంటర్‌టైన్‌మెంట్ కోసం వచ్చాం. కానీ, డ్యూటీ మీద ఉండి మనకు సేవ చేస్తోన్న పోలీసువారికి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేద్దాం’ అంటూ ప్రేక్షకులకు సూచించి తన యాంకరింగ్ ప్రతిభను మరోసారి సుమ చాటుకున్నారు.