కొత్తగా ఆ హీరోయిన్ తో రొమాన్స్ చేస్తున్న హాట్ హీరోయిన్ తమ్ముడు

Hot heroine younger brother romance with the new heroine
Spread the love

Teluguwonders:

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా.. అమెరికన్ గాయకుడు నిక్ జొనాస్‌ను పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయిపోయారు. మరో పక్క ప్రియాంక చోప్రా సోదరుడు సిద్ధార్థ్ చోప్రా నిశ్చితార్థం క్యాన్సిల్ అయ్యింది . కొన్ని కారణాల వల్ల పెళ్లి రద్దు చేసుకోవాల్సి వచ్చిందని వారు వెల్లడించారు. ఇప్పుడు సిద్ధార్థ్ దక్షిణాది నటితో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది.

👉వివరాల్లోకి వెళ్తే :

ఏప్రిల్‌లో ప్రియాంక చోప్రా సోదరుడు సిద్ధార్థ్ చోప్రాకు ఇషితా అనే యువతితో నిశ్చితార్థం జరిగింది. కొన్ని రోజుల తర్వాత ఇషిత నిశ్చితార్ధానికి సంబంధించిన ఫొటోలన్నీ డిలీట్ చేసేశారు. దాంతో వీరిద్దరి నిశ్చితార్ధం రద్దయినట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత తామిద్దరం పెళ్లికి సిద్ధంగా లేమని కూడా వారు మీడియా ముందు బయటపెట్టారు. అలా ఎవరి దారి వారు చూసుకున్నారు.

🔴మెడికల్ ఎమర్జెన్సీ :

ఇషితతో సిద్ధార్థ్ పెళ్లి రద్దు అవ్వడానికి మెడికల్ ఎమర్జెన్సీ కారణమని తల్లి మధు చోప్రా అన్నారు. నిశ్చితార్థమయ్యాక ఇషితకు సర్జరీ జరిగింది. ఆమె హాస్పిటల్‌లో ఉన్నప్పుడే ఎంగేజ్‌మెంట్ ఫొటోలన్నీ డిలీట్ చేశారు. ‘పాత పుస్తకం మూసేశా. కొత్త కథ రాస్తున్నా’ అని క్యాప్షన్ ఇచ్చారు. బహుశా ఇషితాకు ఏదన్నా అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఉండొచ్చు. ఈ విషయం ఆమె నిశ్చితార్థానికి ముందు దాచి ఉంచారేమో. అందుకే మెడికల్ ఎమర్జెనీ పేరుతో పెళ్లిని రద్దు చేసి ఉంటారు.

ఏ కారణం లేకపోతే ఇషిత పూర్తిగా కోలుకున్నాక పెళ్లి పెట్టుకుని ఉండొచ్చు కదా. పైగా ఇషిత హాస్పిటల్‌లో ఉన్నప్పుడు సిద్ధార్థ్ ఒక్కసారి కూడా ఆమెను చూడటానికి వెళ్లింది లేదు.

🔴ఆ హీరోయిన్ తో ప్రేమాయణం :

ఇప్పుడు సిద్ధార్థ్ మళ్ళీ ప్రేమలో పడ్డట్లు తెలుస్తోంది. తమిళ నటి నీలమ్ ఉపాధ్యాయతో ఆయన ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ నివాసంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు సిద్ధార్థ్ నీలమ్‌తో కలిసి హాజరయ్యారు. వేడుకలో ఉన్నంత సేపు సిద్ధార్థ్ నీలమ్ చెయ్యి వదలకుండా పట్టుకున్నారు. దాంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు వదంతులు మొదలయ్యాయి. తెలుగులో 2012లో వచ్చిన ‘మిస్టర్ 7’ సినిమాలో నీలమ్ నటించారు. తమిళంలో ‘ఉన్నోడు ఒరు నాల్’ అనే సినిమాలో కథానాయిక పాత్ర పోషించారు. మరి సిద్ధార్థ్, నీలమ్ వివాహ బంధంతో ఒక్కటవుతారో లేదో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *