Teluguwonders:
బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానాఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ‘అంధాధున్’ సినిమాకు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును అందుకున్నారు. ఇప్పుడు ఈ సినిమాను తమిళంలో రీమేక్ చేయబోతున్నారు. అక్కడ సిద్ధార్థ్ ఆయుష్మాన్ పాత్రలో నటిస్తున్నారు. ‘విక్కీ డోనర్’ సినిమాతో ఆయుష్మాన్ బాలీవుడ్‌లో అడుగుపెట్టారు. ఓ విభిన్నమైన కాన్సెప్ట్‌ను ఎంచుకుని కెరీర్ తొలినాళ్లలోనే రిస్క్ తీసుకున్నారు ఆయుష్మాన్. ఈ సినిమా అనూహ్యంగా విజయం సాధించింది. దీనిని తెలుగులో ప్రముఖ నటుడు సుమంత్ ‘నరుడా డోనరుడా’ టైటిల్‌తో రీమేక్ చేశారు. ప్రస్తుతం ఆయన ‘బాలా’, ‘గులాబో సితాబో’, ‘శుభ్ మంగళ్ జ్యాదా సావధాన్’ సినిమాలతో బిజీగా ఉన్నారు.
🔴రూ.180 కోట్లు పక్కా :
ఆయన నటించిన ‘డ్రీమ్ గర్ల్’ సినిమా కచ్చితంగా రూ.180 కోట్లు రాబడుతుందని అంటున్నారు సీనియర్ నటుడు అన్నూ కపూర్. రాజ్ శాండిల్య దర్శకత్వం వహించిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
💥 సినిమా మొత్తం చీర కట్టుకుని నటించిన హీరో :
కథానాయికా ప్రాధాన్యం ఉన్న సినిమాల్లో నటించడానికే హీరోలు ఒప్పుకోరు. అలాంటిది ఓ స్టార్ హీరో సినిమా మొత్తంలో చీర కట్టుకుని అమ్మాయిలా నటించారు. ఆయనే టాలెంటెడ్ యంగ్ హీరో ఆయుష్మాన్ ఖురానా. ఆయన ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘డ్రీమ్ గర్ల్’. రాజ్ శాండిల్య దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సీనియర్ నటుడు అన్నూ కపూర్ కీలక పాత్రను పోషించారు.ఇందులో నుష్రత్ బరూచా కథానాయికగా నటించారు. సినిమా పోస్టర్‌తోనే సగం మార్కులు కొట్టేసింది. సెప్టెంబర్ 13న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో ఆయుష్మాన్ మూడు రకాలుగా ప్రవర్తిస్తూ కడుపుబ్బా నవ్విస్తుంటారు. 👉ఈ సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా అన్నూ కపూర్ సినిమా గురించి మాట్లాడారు.
‘ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందన్న నమ్మకం నాకుంది. బాక్సాఫీస్ వద్ద రూ.180 కోట్ల కంటే ఎక్కువ వసూళ్లు రాబడుతుందన్న నమ్మకం ఉంది. మంచి సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూ వచ్చారు. ఈ సినిమాను కూడా అంతే ఆదరిస్తారన్న నమ్మకం ఉంది. 2012లో నేను ఆయుష్మాన్‌తో కలిసి విక్కీ డోనర్ సినిమా చేశాను. కొన్నేళ్ల క్రితం నేను ఓ సూపర్ స్టార్‌తో కలిసి సినిమా చేస్తున్నాను. అప్పుడు ఆయన ‘ఆయుష్మాన్ టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నాడండీ’ అని నాతో అన్నారు. అప్పుడు నేను.. ‘మీరు అనేది నటన గురించా’ అని అడిగాను. ఇందుకు ఆ సూపర్ స్టార్ స్పందిస్తూ.. ‘కాదు రెమ్యునరేషన్ విషయంలో..’ అని చెప్పారు. దీనిని బట్టే మీరు అర్థంచేసుకోవచ్చు ఆయుష్మాన్‌కు హీరోగా ఎంత మంచి కెరీర్ ఉందో. ’ అన్నారు.