Teluguwonders:
రెండు రోజుల క్రితం హైదరాబాద్ శివారు ప్రాంతమైన నార్సింగి పరిధిలోని అల్కాపూర్ వద్ద రాజ్ తరుణ్ కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అదే సమయంలో సీసీ టీవీ పుటేజ్ కూడా బయటకు వచ్చింది. అందులో కారు దిగి రాజ్ తరణ్ పారిపోతున్నట్లుగా స్పష్టం కావడంతో ఇది పెద్ద దుమారం క్రియేట్ చేసింది. రాజ్ తరుణ్ ఎందుకలా పారిపోయాడు. అంత అవసరం ఏమొచ్చింది? అనే విషయమై చర్చలు నడిచాయి. ఇంతలో తాజాగా రాజ్ తరుణ్ యాక్సిడెంట్ కేసులో కొత్త ట్విస్ట్ బయటపడింది.
సెల్ ఫోన్లో రికార్డ్.. వెంటపడి పట్టుకున్నాడు రాజ్ తరుణ్ కారు ప్రమాదానికి గురైన సమయంలో కార్తీక్ అనే ఓ వ్యక్తి ఆ దృశ్యాలను తన సెల్ ఫోన్లో రికార్డ్ చేశాడు. అంతేకాదు రాజ్ తరుణ్ కారు దిగి పారిపోతుండగా అతన్ని వెంటాడి పట్టుకున్నాడు కార్తీక్. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య చర్చలు కూడా సాగాయి.
మొదట కార్తీక్ తో వాదనకు దిగిన రాజ్ తరుణ్.. ఆ కారు తనది కాదని, తాను దమ్ము కొట్టడానికి ఇలా బయటకు వస్తే నన్నెందుకు ప్రశ్నిస్తున్నారని అడిగాడు. కానీ కార్తీక్ తన దగ్గర స్పష్టమైన విజువల్స్ ఉన్నాయని గట్టిగా చెప్పడంతో చివరకు కార్తీక్, రాజ్ తరుణ్ ఇద్దరూ తమ తమ సెల్ ఫోన్ నెంబర్స్ ఇచ్చుకోవడం జరిగింది. అయితే ఆ సమయంలో కార్తీక్‌ని రాజ్ తరుణ్ తాను మద్యం సేవించానని, తనను వదిలేయమని బ్రతిమిలాడినట్లుగా తెలుస్తోంది.
తన సెల్ ఫోన్ నెంబర్ తీసుకున్న రాజ్ తరుణ్.. తన యాక్సిడెంట్ తాలూకు వీడియోలు ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడుతున్నాడని అంటున్నాడు కార్తీక్. రాజ్ తరుణ్ మేనేజర్ నటుడు రాజా రవీంద్రతో పాటు మరో మహిళ అతనికి ఫోన్ చేసి బెదిరిస్తునట్లుగా మీడియా పేర్కొంటోంది. ఈ కోణంలో అతనికి డబ్బు ఆశ కూడా చూపారని వార్తలు వస్తున్నాయి.
ఇక రాజ్ తరుణ్ ట్విట్టర్‌లో అభిమానులతో చిట్ చాట్ చేసిన రాజ్ తరుణ్.. ‘ప్రమాదం జరిగినప్పుడు మద్యం సేవించి ఉన్నారా’ అని చాలా మంది అడిగిన ప్రశ్నలకు ‘నో’ అని సమాధానం ఇచ్చాడు. మధ్యలో ఓ నెటిజన్ ‘డ్రింక్ చేస్తే మాత్రం చేసాం అని చెప్తారా ఏంటి’ అని వ్యంగ్యంగా అన్నాడు. దీనికి ‘యాక్సిడెంట్ అయ్యి బాధ పడితే.. గోరు చుట్టు మీద రోకలి పోటు ఏంటి భయ్యా’ అంటూ రాజ్ తరుణ్ రిప్లై ఇచ్చాడు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.