Teluguwonders:
సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన ఏ ఫొటోలు బయటికి వచ్చినా అవి వైరల్‌గా మారుతుంటాయి. వారిని వెండితెరపై చూడటం వేరు.. రియల్ లైఫ్ వేరు.
❤ఐశ్వర్య రాయ్ బచ్చన్ సీమంతం :
తాజాగా ఐశ్వర్య రాయ్ బచ్చన్ సీమంతం ఫొటోలు బయటికి వచ్చాయి. బచ్చన్ కుటుంబంలో ఏ కార్యక్రమం జరిగినా అంగరంగ వైభవంగా ఉంటుంది. ఐష్ ఎరుపు రంగు చీర కట్టుకుని కుర్చీలో కూర్చుని ఉంటే.. పక్కనే భర్త అభిషేక్ బచ్చన్ నిలబడి వచ్చీ పోయే వారిని పలకరిస్తూ వారికి కుంకుమ ఇస్తూ కనిపించారు. ఈ ఫొటోలు నెటిజన్లు చాలా ఆకట్టుకుంటున్నాయి. బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ సీమంతం ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఐష్ సిగ్గుపడుతూ కుర్చీలో కూర్చుని ఉండగా.. పక్కనే అభిషేక్ బచ్చన్ నిలబడి అందరికీ కుంకుమ అందిస్తున్నట్లుగా ఉన్న ఆ ఫొటోలు ముచ్చటగొల్పుతున్నాయి.
💞ఐశ్వర్య, అభిషేక్ బచ్చన్ :
‘ధూమ్ 2’ సినిమా చిత్రీకరణ సమయంలో ఐశ్వర్య, అభిషేక్ బచ్చన్ ప్రేమించుకున్నారు. ఆ తర్వాత 2007 జనవరి 14న వీరికి నిశ్చితార్థం జరిగింది. 2007 ఏప్రిల్ 20న ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్‌లు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఆ తర్వాత 2011 నవంబర్ 16న ఐష్ ఆరాధ్యకు జన్మనిచ్చారు. ఇప్పుడు ఆరాధ్య కూడా సెలబ్రిటీ స్టార్ కిడ్ అయిపోయింది. తన తల్లితో కలిసి ప్రతిష్ఠాత్మక కేన్స్ వేడుకలకు హాజరవుతూ ఉంటుంది. ఆరాధ్య ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదువుతోంది.
🔴‘ఫ్యాన్నే ఖాన్’ నిరాశ :
ఐశ్వర్య వర్క్ విషయానికొస్తే.. ఆమె చివరగా ‘ఫ్యాన్నే ఖాన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇందులో అనిల్ కపూర్, రాజ్ కుమార్‌రావు ప్రధాన పాత్రల్లో నటించారు. అయితే ఈ సినిమా ఆశించినంత స్థాయిలో విజయం సాధించలేకపోయింది.
⭐మణిరత్నం సినిమా లో మహారాణి గా :
ఐష్ తన కెరీర్‌ను మణిరత్నం తెరకెక్కించిన ‘ఇరువర్’ సినిమాతో మొదలుపెట్టారు. మణిరత్నంను ఐష్ తన గురువుగా భావిస్తారు. చాలాకాలం తర్వాత ఇప్పుడు మళ్లీ తన గురువుతో కలిసి నటిస్తుండడంపై ఐష్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమా గురించి సర్ అధికారికంగా ప్రకటించకపోయినా నేను ఆయనతో కలిసి పనిచేస్తున్న మాట నిజమే. ఎటూ విషయం అందరికీ తెలిసిపోయింది. కాబట్టి నేనూ అధికారికంగా ప్రకటిస్తున్నాను. నా గురూజీతో కలిసి మళ్లీ నటించబోతున్నాను. నాకు మళ్లీ స్కూల్‌కు వెళుతున్నట్లుగా ఉంది’ అని పేర్కొన్నారు . కొంతకాలం విరామం తీసుకున్నాక.. ఐష్ ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించబోతున్న ‘పొన్నియిన్ సెల్వన్’ అనే తమిళ చిత్రానికి సంతకం చేశారు. ఇందులో ఐశ్వర్య చోళా వంశానికి చెందిన మహారాణి నందిని పాత్రలో నటిస్తున్నారు. ఇందులో ఐష్‌ది నెగిటివ్ పాత్ర అని తెలుస్తోంది. ఇందులో ఐశ్వర్య భర్త పాత్రలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబును ఎంపికచేసుకోబోతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.
.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.