Teluguwonders:
ఇండిపెండెన్స్ డే రోజున సినిమా రిలీజ్ చేయడమమనేది అక్షయ్ కుమార్‌కు అక్షయ పాత్రలా మారిందనే చెప్పాలి.
💥Mission mangal :
మిషన్ మంగళ్‌యాన్.. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చరిత్రలోనే ఓ అద్భుత ఘట్టం. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధన కేంద్ర నుంచి 2013 నవంబర్ 5న పీఎస్‌ఎల్‌వీ సి-25సి ఉపగ్రహాన్ని అంగారకుడి కక్ష్యలోకి ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. చైనా, జపాన్ దేశాలకు కూడా సాధ్యం కాని అంగారక యాత్రను భారత్ విజయవంతంగా పూర్తిచేసి కొత్త చరిత్రను లిఖించింది. మార్స్ మిషన్‌ను తొలి ప్రయత్నంలోనే కక్ష్యలోకి పంపిన తొలిదేశంగా భారత్ రికార్డుకెక్కింది. ఇది ప్రతి భారతీయుడికి గర్వకారణం.
ఇలాంటి గొప్ప ప్రయోగం గురించి, దాని కోసం ఇస్రో శాస్త్రవేత్తలు పడిన కష్టం గురించి దేశ ప్రజలు తెలుసుకోవాలనే సంకల్పంతో దర్శకుడు జగన్ శక్తి ‘మిషన్ మంగళ్’ను తెరకెక్కించారు. భారత చరిత్రలో అద్భుతమైన ఈ అధ్యాయాన్ని పున:సృష్టి చేశారు. స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఈ చిత్రం గురువారం విడుదల అయింది.
🔴రికార్డు స్థాయి కలెక్షన్స్ :
ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుసగా సక్సెస్‌లు అందుకుంటున్న హీరో ఎవరంటే అక్షయ్ కుమార్ అనే చెప్పాలి . తాజాగా ఈ కథానాయకుడు ‘మిషన్ మంగళ్’ చిత్రంతో మరో హిట్టును అందుకున్నాడు. స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ డే రికార్డు స్థాయి కలెక్షన్స్ రాబడుతూ చరిత్ర సృష్టిస్తోన్నది.
👉ఆ వివరాల్లోకి వెళితే :
స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ డే రూ.29.16 కోట్లు వసూలు చేసినట్టు బాలీవుడ్ ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ ట్విట్టర్‌లో వెల్లడించారు. విడుదలైన అన్ని చోట్ల ‘మిషన్ మంగళ్’ సినిమా అద్భుతమైన రెస్పాన్స్‌తో దూసుకుపోతుంది. రెండో రోజుతో పాటు శని, ఆదివారాల్లో ఈ సినిమా రూ.100 కోట్లను క్రాస్ చేసే అవకాశం ఉంది.
💥అక్షయ్ కుమార్ –
ఆగష్టు 15 :
గతేడాది ఆగష్టు 15 న 👉అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘గోల్డ్’ మూవీ రూ.25.15 కోట్లు వసూలు చేస్తే.. 👉‘టాయిలెట్..ఏక్ ప్రేమ్ కథ’ మాత్రం రూ.13.10 కోట్లను వసూలు చేసింది. అంతకు ముందు… 👉2016లో విడుదలైన ‘రుస్తుం’ సినిమా రూ.14.11 కోట్లు వసూలు చేసింది.
ఇలా గత కొన్ని సంవత్సరాల నుంచి అక్షయ్ కుమార్ నటించిన సినిమాలు ఆగష్టు 15 కానుకగా విడుదలవుతున్నాయి.రికార్డ్స్ నూ సృష్టిస్తున్నాయి.
🌟ప్రస్తుతం అక్షయ్ కుమార్ కెరీర్‌లోనే అత్యధిక ఎక్కువ వసూళ్లు సాధించిన సినిమాగా ‘మిషన్ మంగళ్’ రికార్డు క్రియేట్ చేసింది.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.