Teluguwonders:
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీ టైటిల్‌ను రివీల్ చేస్తూ వీడియో విడుదల చేసింది చిత్ర యూనిట్.
🔷‘అల వైకుంఠపురములో’..;అనే టైటిల్ తో :
‘జులాయి’, ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ చిత్రాల తరువాత బన్నీ, త్రివిక్రమ్ కాంబోలో ముచ్చటగా మూడో చిత్రం కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి.
‘అల వైకుంఠపురములో’.. అంటూ సందడి మొదలు పెట్టారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ 19వ మూవీ టైటిల్‌ను విడుదల చేశారు.
బన్నీ సొంత బ్యానర్ గీతా ఆర్ట్స్‌లో అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బన్నీకి జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. నివేతా పేతురాజ్ మరో హీరోయిన్. టబు, జయరాం, సుశాంత్, మురళీ శర్మ, హర్షవర్థన్, నవదీప్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గీతా ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్లపై అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు) సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి ఇప్పటి వరకూ చాలా టైటిల్స్ ప్రచారంలో ఉన్నప్పటికీ.. త్రివిక్రమ్ మార్క్‌కి తగ్గట్టుగా ‘అల వైకుంఠపురములో’ అనే టైటిల్‌ని ఫిక్స్ చేస్తూ ఓ వీడియో విడుదల చేశారు.
40 సెకన్ల నిడివితో ఉన్న ఈ వీడియోలో టైటిల్‌ను అనౌన్స్ చేయడంతో పాటు బన్నీ, మురళీశర్మల మధ్య సరదా సన్నివేశాన్ని రివీల్ చేశారు. .
💥 స్వాతంత్ర్యదినోత్సవ కానుకగా…స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ ‘అల వైకుంఠపురములో…’ అనే సినిమా టైటిల్ లోగో తో పాటు రిలీజ్ అయిన టీజర్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.
🔴తన మీద తానే సెటైర్ :
బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో సుశాంత్, నివేదా పేతురాజ్, సీనియర్ నటి టబులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమన్ సంగీతమందిస్తుండగా గీతా ఆర్ట్స్, హారికా అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.
👉ఈ టీజర్‌లో సెటైర్ :
మురళీ శర్మ ‘ఏరా గ్యాప్ ఇచ్చావ్’ అంటే.. బన్నీ సమాధానంగా ‘ఇవ్వలేదు.. వచ్చింది’ అంటాడు. ‘నా పేరు సూర్య’ తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న బన్నీ ఈ సినిమాలో నటిస్తున్నాడు. ఈ గ్యాప్‌కు సంబంధించే టీజర్‌లో ఆ డైలాగ్‌ను చెప్పినట్టుగా ఉంది. బన్నీ చెప్పిన డైలాగ్ తన మీద తానే సెటైర్ వేసుకున్నట్టుగా ఉందంటున్నారు ఫ్యాన్స్.2020 సంక్రాంతి కానుకగా జనవరిలో థియేటర్స్‌లో సందడి చేయనుంది ఈ సినిమా.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.