Teluguwonders:
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న కొత్త సినిమా ‘అల.. వైకుంఠపురములో’. బన్నీ కెరీర్‌లో ‘నా పేరు సూర్య’ డిసాస్టర్ తరువాత వస్తున్న సినిమా కావడంతో అల్లు అర్జున్, త్రివిక్రమ్ ఈ సినిమాపై ప్రత్యేక శ్రద్ద తీసుకొని రూపొందిస్తున్నారు. ఇటీవలే స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఈ సినిమా టైటిల్ రివీల్ చేస్తూ స్మాల్ వీడియో రిలీజ్ చేసిన చిత్రయూనిట్.. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసింది.
వావ్ యమ స్టైల్.. బొమ్మ అదిరింది:
అల్లు అర్జున్ అలా కూర్చోని ఉండగా సెక్యూరిటీ గార్డ్ సిగరెట్ వెలిగిస్తుండటం ఈ లుక్ లో గమనించవచ్చు.చూడటానికి చాలా అట్రాక్ట్ చేస్తూ చాలా స్టైలిష్ గా ఉన్న ఈ పోస్టర్ నెట్టింట ఇట్టే వైరల్ అయింది. బొమ్మ అదిరింది అంటూ ఈ పోస్టర్ పై కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.
ఈ చిత్రంలో అల్లు అర్జున్ రెండు డిఫెరెంట్ షేడ్స్‌లో కనిపించనున్నాడని, ఆయన డ్యూయల్ రోల్ పోషిస్తున్నాడనే వార్త ప్రచారంలో ఉంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా విడుదల కానుంది. అల్లు అర్జున్ కెరీర్‌లో 19వ సినిమాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
‘అల.. వైకుంఠపురములో’ సీనియర్ హీరోయిన్ టబు కీలక పాత్రలో నటిస్తోంది. ఒకప్పుడు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా కీర్తించబడిన టబు గత కొన్నేళ్లుగా వెండితెరకు దూరంగా ఉంటోంది. త్రివిక్రమ్ కోరిక మేరకు ఈ సినిమాలో నటించేందుకు టబు ఓకే చేసిందని సమాచారం. చిత్రంలో జయరాంకి జోడీగా టబు నటిస్తోంది.
గీతా ఆర్ట్స్ బ్యానర్, హారిక & హాసిని క్రియేషన్స్ సంయుక్త సమర్పణలో తెరకెక్కుతోంది ‘అల.. వైకుంఠపురములో’ సినిమా. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. సుశాంత్, నివేదా పేతురాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాపై ఇటు త్రివిక్రమ్ అభిమానులు, అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.