Teluguwonders:
మాతృత్వంలో ఉన్న మాధుర్యం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అయితే ఈ మాతృత్వాన్ని కూడా పబ్లిసిటీ స్టంట్‌గా మార్చేస్తున్నారు బాలీవుడ్ తారలు. ఇటీవల సమీరా రెడ్డి నిండు గర్భిణిగా అండర్ వాటర్‌లో జలాకాలు ఆడుతూ ఫొటో షూట్ చేసింది. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యారు. నిశ్చితార్ధం కంటే మందే గర్భం దాల్చి.. తన ప్రియుడితో కలిసి ప్రెగ్నెంట్‌గా ఉన్న ఫొటోలను షేర్ చేసి సంచలనం రేపిన బాలీవుడ్ సుందరి.. 2.o మూవీ హీరోయిన్ అమీ జాక్సన్ మరోసారి వార్తల్లో నిలిచింది.
తాజాగా రోబో బ్యూటీ అమీ జాక్సన్ నిండు గర్భంతో నగ్నంగా దర్శనం ఇచ్చి అందర్నీ షాక్‌లోకి నెట్టింది.
💥వెల్లువెత్తుతున్న విమర్శలు :
మాతృత్వంలోని మాధుర్యాన్ని జీవితాంతం గుర్తుకుండేలా ప్రతిక్షణాన్ని పదిలపరుచుకోవాలనే అమీ ఆలోచన బాగానే ఉన్నా.. తన బేబీ బంప్‌ని ఇలా బహిర్గతం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నిశ్చితార్ధంకి ముందే ప్రెగ్నెంట్ అయిన అమీ జాక్సన్.. తాను గర్భంతో ఉన్నట్టుగా బ్రిటన్ ప్రియుడుతో కలిసి ఫొటోలను షేర్ చేసి అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది. ప్రెగ్నెంట్ అయిన తరువాత తన బ్రిటన్ ప్రియుడు జార్జ్‌తో నిశ్చితార్ధం చేసుకున్న ఈ రోబో భామ.. తన గర్భానికి సంబంధించి ఫొటోలను ఎప్పటి కప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంది.
తాజాగా తాను 33 వారాల ప్రెగ్నెంట్‌తో ఉన్నట్టుగా ఉన్న న్యూడ్ ఫొటోని షేర్ చేసింది. ఈ సందర్భంగా మాతృత్వంలో ఉన్న మాధుర్యాన్ని నెటిజన్లతో పంచుకుంది. ‘నాలోని మాతృత్వానికి మధుర జ్ఞాపకం ఈ ఫొటో. గర్భం ధరించినప్పటి నుండి నా శరీరంలో చాలా మార్పులువస్తున్నాయి. బరువు పెరుగుతున్నా.. చర్మం సాగుతుంది.. వీటన్నింటినీ తట్టుకుంటున్న నా శరీర సామర్ధ్యానికి గర్విస్తున్నా’ అంటూ తన అనుభవాలను పంచుకున్నారు అమీ జాక్సన్. కాగా అమీ జాక్సన్ షేర్ చేసిన ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.