అనుష్క ‘నిశ్శబ్ధం’ !!!

Anushka's NISHABDHAM
Spread the love

Teluguwonders:

తమ అందాల దేవసేన ఎప్పుడు వెండి తెరపై కనిపిస్తుందని ఎంతగానో ఎదురు చూస్తున్నన్నారు ఫ్యాన్స్. అదేనండీ బాహుబలి లో మూవీలో దేవసేనగా నటించి అందరి మన్ననలు అందుకున్న అనుష్క శెట్టి ‘భాతమతి ‘ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకుంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘సూపర్’ సినిమాతో వెండి తెరకు పరిచయం అయిన అనుష్క అచిరకాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి మెప్పించిన అనుష్క తాజాగా నిశ్శబ్ధం అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే.

బాహుబలి 2 తర్వాత వెంటనే బాగమతి సినిమాలో నటించిన అనుష్క తర్వాత వెండి తెరపై కనిపించడానికి చాలా సమయం తీసుకుంది. వాస్తవానికి అనుష్కకు వరుస ఛాన్సులు వచ్చినా..ఫిజిక్ విషయంలో కొన్ని ఇబ్బందులు తలెత్తాయి.

దాంతో ఆమె నేచర్ కేర్ వైద్యం తీసుకొని తన బరువు తగ్గించుకునే ప్రయత్నం చేసింది. ఇదే సమయంలో హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ‘నిశ్శబ్దం’ సినిమాలో నటించింది. ఈ మూవీని టి.జి.విశ్వప్రసాద్, కోన వెంకట్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అమెరికాలో ఎక్కువ భాగం చిత్రీకరణ జరుపుకున్న ఈ మూవీ తెలుగు, తమిళ, ఇంగ్లీష్, హిందీ, మలయాళ భాషల్లో ఈ సంవత్సరాంతంలో భారీస్థాయిలో విడుదల కానుంది.

గత కొంత కాలంగా ఎన్నో ప్రయోగాత్మక పాత్రల్లో నటిస్తున్న అనుష్క ఈసారి కూడా మరో అద్భుతమైన ప్రయోగానికి నాంధి పలకబోతుందట. అనుష్క పాత్ర చిత్రణ మునుపెన్నడూ లేని విధంగా వైవిధ్యంగా ఉంటుంది అని నిర్మాతలు తెలిపారు. ఆర్.మాధవన్, అంజలి, మైఖేల్‌మ్యాడ్‌సన్, షాలినిపాండే, శ్రీనివాస్ అవసరాల తదితరులు నటిస్తున్న ఈ మూవీకి గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా అనుష్క ఫస్ట్ లుక్ విడుదల చేశారు మేకర్స్. ఇప్పటి వరకు అనుష్క ఫస్ట్ లుక్ ఎలా ఉండబోతుందని ఆశగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పేశారు. తాజాగా అనుష్క ఫస్ట్ లుక్ విడుదల చేశారు మేకర్స్ . ఇందులో అనుష్క పెయింటింగ్ వేస్తున్నట్టుగా ఉంది. టైటిల్‌కి సాక్షి.. మ్యూట్ ఆర్టిస్ట్ అనే క్యాప్షన్ జత చేశారు. అనుష్క పెయింటింగ్ ద్వారానే మనసులోని మాటలని చెబుతుందని చెప్పుకుంటున్నారు.


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading