Teluguwonders:
🔴పవన్ కళ్యాణ్ కి సంబంధం లేదు :
గొడవ జరిగింది నాకు, బన్నీ వాస్‌కి. మధ్యలో జనసేన, పవన్ కళ్యాణ్‌ని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు. నేను సూసైడ్ చేసుకుంటా.. ఆ ఛానల్ వాళ్లు కావాలనే పవన్‌ని..లాగుతున్నారు అంటుంది ఆవిడ. జనసేనను ఇందులోకి లాగొద్దు. ఒకవేళ నాకు సినిమాల్లో అవకాశం రాకపోతే జనసేన ఆఫీసులో పనిమనిషిగా నైనా చేస్తా తప్ప ఎట్టి పరిస్థితిలోనూ పార్టీని వదలను. నేను అందరిలా కాదు ఆ పార్టీకి అన్యాయం చేయను అంటుంది.
👉వివరాల్లొకి వెళ్తే :
Tollywood Casting Couch: తనను మెగా ప్రొడ్యుసర్ వేధింపులకు గురిచేశారడని అందుకే చనిపోవాలనుకున్నా అన్నారు జూనియర్ ఆర్టిస్ట్ సునీత. ఫిల్మ్ చాంబర్ వద్ద నిరసనకు దిగిన ఆమెను పోలీసులు అరెస్ట్ చేసి కొద్ది సేపటికి విడుదల చేశారు.
🔴గొలుసులతో కట్టుకుని నిరసన :
మెగా ప్రొడ్యుసర్ బన్నీ వాసు వేధింపుల కారణంగానే తాను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని.. అందుకే ఫిల్మ్ ఛాంబర్ వద్ద గొలుసులతో కట్టుకుని నిరసన చెపట్టా అన్నారు జూనియర్ ఆర్టిస్ట్ సునీత బోయ. తనను గీతా ఆర్ట్స్ వాళ్లు సినిమా ఆఫర్ ఇస్తానని మోసం చేశారని మంగళవారం రాత్రి నుండి ఫిల్మ్ చాంబర్ వద్ద నిరసనకు దిగిన సునీతను జూబ్లీ హిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి పోలిస్ స్టేషన్‌కి తరలించిన విషయం తెలిసిందే. అయితే ఆమెకు కౌల్సిలింగ్ ఇచ్చి విడిచిపెట్టారు పోలీసులు. కాగా పోలీస్ స్టేషన్ విడుదలైన అనంతరం ఫేస్ బుక్ లైవ్‌లో ఈ ఇష్యూకి సంబంధించిన వివరాలను తెలియజేశారుసునీత. ఆమె మాట్లాడుతూ..
💥ఏబీఎన్ తప్పుడు ప్రచారం..:
‘నేను ఇప్పుడు పోలీస్ స్టేషన్ నుండి డైరెక్ట్‌గా ఏబీఎన్ ఛానల్‌కి వచ్చా. ఎందుకుంటే.. నేను గీతా ఆర్ట్స్‌కి సంబంధించిన బన్నీ వాసు నాకు అన్యాయం చేశారని నిరసనకు దిగితే.. ఏబీఎన్ ఛానల్ వాళ్లు జనసేనను పవన్ కళ్యాణ్‌ని ఇందులోకి లాగారు. ఆ ఛానల్ వాళ్లు తప్పుడు ప్రచారం చేశారు. దయచేసి ఈ ఇష్యూలో జనసేనను ఇన్వాల్వ్ చేయొద్దని ఈ ఛానల్ వాళ్లకు చెప్పా.
అందుకే సూసైడ్ చేసుకుందాం అనుకున్నా..
నేను గొలుసులు కట్టుకుని ఫిల్మ్ ఛాంబర్ వద్ద గదిలో నిర్భందం అయ్యింది ఆత్మహత్య చేసుకోవాలనే. నా మీద తప్పుడు ప్రచారం చేసిన గీతా ఆర్ట్స్ 2 దగ్గరకు వెళ్లి.. అక్కడ ఆత్మహత్యకు ప్రయత్నించా. రూమ్‌లోకి వెళ్లి డోర్ వేసుకున్నా. కాని ఆరోజు పోలీసుల్ని పిలిపించి నన్ను అరెస్ట్ చేపించారు.
🔴నాకు ప్రాణహాని ఉంది..:
నేను పిచ్చిదాన్ని కాదు.. కావాలనే నన్ను హింసిస్తున్నారు.. నేను ఈరోజు ఇలా రోడ్డు మీదికి వచ్చి పలానా వ్యక్తి నాకు అన్యాయం చేశాడంటే.. ఒక్కరైనా నాకు అండగా వచ్చారా? నన్ను పిచ్చిదాన్ని చేస్తారా? నాకు మానసిక స్థితి బాలేదంటారా? అసలు మీరు మనుషులేనా? నాకు హెల్త్ బాగుంది. కేవలం మెగా ప్రొడ్యుసర్ బన్నీ వాసు వల్లే నేను డిప్రెషన్‌లోకి వెళ్లా.
నాకు ప్రాణహాని ఉంది.. నాకు న్యాయం చేయండని ఇప్పటి వరకూ చాలా మంది దగ్గరకు వెళ్లా. ఎవరూ న్యాయం చేయలేదు. బన్నీ వాసు, అల్లు అరవింద్ వీళ్లు అసలు పట్టించుకోవడం లేదు. నాకు న్యాయం జరుగుతుందనే నిరసనకు దిగా. నాకు ప్రాణహాని ఉందని రోజు ఫేస్ బుక్‌లో ఏడుస్తున్నా. ఎన్నిసార్లు ఏడ్చినా లాభం లేదు. అందుకే ఈ పని చేశా అంటుంది ఆమె.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.