బ్యాక్ టు బ్యాక్ మాస్ అంటున్న ఇస్మార్ట్

Back to back mass Ismart
Spread the love

Teluguwonders:

హిట్ కొడితే అంతేనా. నాలుగైదు సినిమాలు వరసగా ఫ్లాప్స్. ఇక ఇండస్ట్రీలో నిలబడగలనా అనుకున్నాడట రామ్. రామ్ పోతినేని ఎనర్జిటిక్ స్టార్. ఆయన పాత్రకు మించి ఎనర్జీ లెవెల్స్ చూపిస్తాడు. రామ్ దేవదాస్ మూవీతో లవర్ బాయ్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఆ మూవీ సూపర్ డూపర్ హిట్. బంగారం అంటూ ఇలియానాతో రామ్ చేసిన రొమాన్స్ అప్పట్లో అదుర్స్. రామ్ 2007లో దేవదాస్ అయితే మరో పన్నెండేళ్ళకు ఇస్మార్ట్ శంకర్ అయ్యాడు. యాప్ట్ టైటిల్ తో కుమ్మేశాడు రామ్ . తన ఎనర్జీకి సరిపడే క్యారక్టర్ ఇస్తే అల్టిమేట్ పర్మాఫార్మెన్స్ ఇలాగే ఇస్తానని చెప్పి మరీ గూబ గుయ్యిమనే హిట్ కొట్టాడు.

దాదాపుగా ఎనభయి కోట్లు కలెక్షన్లు వసూల్ చేసింది ఇస్మార్ట్ శంకర్.

దెబ్బకు రామ్ కు హిట్ల కరువు తీరిపోయింది. రామ్ దేవదాస్ టైం కి మరీ యంగ్, ఇపుడు ఇస్మార్ట్ శంకర్ తో కరెక్ట్ పొజిషన్లోకి వచ్చాడు. ఇపుడు ఆయనకు మాస్ కార్యక్టర్లే బెటర్ అంటున్నారంతా. రామ్ కూడ బాక్ టు బాక్ మాస్ అంటున్నాడు. తనకు మాస్ స్టోరీలే చెప్పాలని అడుగుతున్నారుట. తన వద్దకు వచ్చే డైరెక్టర్లకు ఇకపై మాస్ అయితేనే తేన రండి అంటూ కండిషన్ కూడా పెట్టాడట.

రామ్ తో రెండు సినిమాలు తీసిన కిషోర్ తిరుమల ఓ తమిళ్ రిమేక్ స్టోరీ పట్టుకొచ్చాడట. ఇది ఫుల్ క్లాస్ స్టోరీ. దాంతో రామ్ మాస్ ఉండాలి మనకు. ఇది వద్దు అంటూ కిషోర్ ని వెనక్కు పంపేశాడట. కిషోర్ తిరుమలరామ్ తో చేసిన నేనూ శైలజ, ఉన్నది ఒకటే జిందగీ రెండూ క్లాస్ మూవీస్. దాంతో ఈ క్లాస్ డైరెక్టర్ మాస్ స్టోరీ ఎలాగా అని తల పట్టుకుంటున్నాడుట.

ఇక రామ్ ఫుల్ గా మాస్ హీరో అవతారం ఎత్తాలని అనుకుంటున్నాడుట. అలా అయితే లాంగ్ రన్ ఉంటుందని, దెబ్బకు హిట్ కొడితే కలెక్షన్ల వరద పారుతుందని కూడా ఎక్స్ పెక్ట్ చేస్తున్నాడుట. రామ్ ని పక్కా మాస్ ఇమేజ్ హీరోగా చేసింది పూరీ జగన్నాధ్ అని చెప్పాలి. రామ్ లో ఎనెర్జీ లెవెల్స్ కి ఈ పాటికి ఫక్త్ మాస్ మూవీస్ చేస్తూ టాప్ రేంజిలో ఉండాలి. అయితే రామ్ మాత్రం ట్రాక్ తప్పి రొమాంటిక్ స్టొరీస్ , క్లాస్ మూవీస్ చేస్తూ వరస ఫ్లాప్స్ ఎదుర్కొన్నాడు. ఇస్మార్ట్ దెబ్బకు రొమాంటిక్ కరెక్ట్ ట్రాక్ లోకి వచ్చాడని అంటున్నారు. చూడాలి ఇక వీర లెవెల్లో రామ్ మాస్ కుమ్మరిస్తాడన్నమాట.


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading