Teluguwonders:
బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ తనపై వస్తున్న రూమర్స్‌కు ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఇండియా టుడే కాంక్లేవ్‌లో విక్కీ పాల్గొన్నారు. తన సినిమాలు, వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
బాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీకి చెందిన మోస్ట్ సక్సెస్‌ఫుల్ యాక్టర్స్‌లో విక్కీ కౌశల్ ఒకరు. ఇంజినీరింగ్ చదివి, టాప్ ఐటీ కంపెనీలో ఉద్యోగం తెచ్చుకుని అపాయింట్‌మెంట్ లెటర్ చింపి మరీ సినిమా రంగంలోకి అడుగుపెట్టారు విక్కీ కౌశల్. ‘మసాన్’ చిత్రంతో బాలీవుడ్‌కు పరిచయమైన విక్కీ కెరీర్ తొలినాళ్లలోనే జాతీయ అవార్డును అందుకున్నారు. అయితే తన జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
🔴కత్రినాతో లింకప్ రూమర్స్ పై :
‘కొన్ని నెలలుగా నేను, కత్రినా కైఫ్ ప్రేమించుకుంటున్నాం అని రూమర్స్ వస్తున్నాయి. నేను ఆవిడ ప్రేమించుకోవడం ఏంటండీ? మేమిద్దరం కేవలం స్నేహితులం. కొన్ని రోజుల తర్వాత మరో అందమైన అమ్మాయితో నాకు లింక్ పెట్టేస్తారు. ఓ రోజు నేను పేపర్ చదువుతుంటే నేను కత్రినా కైఫ్ ప్రేమించుకుంటున్నామని వార్త వచ్చింది. అది చూసి మా అమ్మానాన్న నవ్వుకున్నారు. ‘మీ ప్రేమాయణం ఎంత వరకు వచ్చింది’ అని అప్పుడప్పుడూ నన్ను ఆటపట్టి్స్తుంటారు’ అన్నారు విక్కీ.
💥సినీ పరిశ్రమలో :
‘2004 నుంచి 2009 వరకు నేను ఇంజినీరింగ్ చేశాను. ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నప్పుడే క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ వచ్చింది. నాకు ఎటూ సినిమాలంటే ఆసక్తి. సినీ పరిశ్రమలో ఇంటర్వ్యూలు ఉండవు కాబట్టి జీవితంలో ఒకసారైనా టై కట్టుకుని ఇంటర్వ్యూకి వెళ్లాలని ఉండేది. అలా అన్ని రౌండ్లు పూర్తి చేయడం, ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడం సెలెక్ట్ అవ్వడం అన్నీ జరిగిపోయాయి. అపాయింట్‌మెంట్ లెటర్ కూడా వచ్చింది. కానీ దానిని నేను చించేసి మరీ సినిమాల్లోకి వచ్చాను’ అని తెలిపారు.
అనంతరం తనపై వచ్చిన డ్రగ్స్ ఆరోపణల గురించి మాట్లాడుతూ.. ‘కరణ్ జోహార్ మమ్మల్ని పార్టీకి పిలిచారు. అప్పటికే నేను మూడు రోజులుగా డెంగ్యూతో బాధపడుతున్నాను. పది రోజుల పాటు ఇంట్లోనే ఉన్నాను. కాస్త కోలుకున్నాక కరణ్ పార్టీకి పిలిచారు కదా అని వెళ్లాను. మొదట మమ్మల్ని వీడియో తీసినప్పుడు మేమంతా చాలా ఉత్సాహంగా ఉన్నాం. ఆ తర్వాత బాగా ఎంజాయ్ చేసి నీరసించిపోయాం. వీడియోను నేను ముక్కు తుడుచుకుంటూ కనిపించాను. దాంతో నేనేదో డ్రగ్స్ తీసుకున్నాననుకుని ప్రచారం చేశారు’ అని పేర్కొన్నారు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.