Teluguwonders:
జీవితంలో ఎన్నో కష్టాలు సమస్యలతో సతమతమయ్యే ప్రజలు వాటి నుండి రిలాక్స్ అవ్వడానికి సినిమాలను చూస్తుంటారు. ఆ రెండు గంటలైనా వారి సమస్యలను మర్చిపోతుంటారు .అదే వారు చూసే సినిమా అద్భుత ఊహ లోకం లోకి విహారింప చేసేది అయితే ఆ సినిమాలు వారి సమస్యలనే కాదు వాళ్ళని వాళ్లే మర్చిపోయేలా చేస్తాయి.
అటువంటి అద్భుతమైన సినిమాల్లో “జగదేకవీరుడు అతిలోకసుందరి “ సినిమా ప్రత్యేకంగా చెప్పుకోతగ్గది కె. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో చిరంజీవి హీరోగా మే. 9.1990 న రిలీజ్ అయిన సోషియో ఫాంటసీ చిత్రం జగదేకవీరుడు అతిలోకసుందరి . ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించి అప్పటి వరకు ఉన్న అన్నిరికార్డులను ఈజీగా క్రాస్ చేసింది. . జగదేకవీరుడు గా చిరంజీవి హీరోయిజం డాన్స్ ఇంద్రుడి కుమార్తె ఇంద్రజగా శ్రీదేవి అందం.. నటనతో యావత్ ప్రేక్షకలోకాన్ని ఫిదా చేసేశారు.
💚 ఈ సినిమా స్టోరీ విషయానికొస్తే:
పోగుట్టుకొన్న ఉంగరం కోసం ఓ దేవకన్య దేవలోకం నుంచి భూలోకానికి వస్తోంది. ఇది నిర్మాత అశ్వనీదత్‌కు చక్రవర్తి అనే రచయత చెప్పిన స్టోరీ లైన్. దీని ఆధారంగా సినిమా కథను జంధ్యాల తనదైన స్టైల్‌లో రెడీ చేసి కే.రాఘవేంద్రరావు చేతిలో పెట్టారు. ఈ సినిమాకు జంధ్యాల మాటలు కూడా రాయడం విశేషం.
🌟ఫస్ట్ సీన్ కోసం :
అప్పటికే ప్రేక్షకుల్లో చిరంజీవి,శ్రీదేవి అంటే విపరీతమైన క్రేజ్ ఉంది. దానికి తగ్గట్టు సీన్స్ ఉండాలి. అనుకుని ఆలోచించి స్వర్గం, అమరావతి ,ఇంద్రుడి కూతురు ,మానస సరోవరం ,ఉంగరం పోగొట్టుకోవడం ,దానికోసం అది దొరికిన చిరంజీవిని కలవడం ఇలాంటి పాయింట్స్ తో ముఖ్యంగా హీరో, హీరోయిన్లు కలిసే ఫస్ట్ సీన్ పై ఎన్నో తర్జన భర్జనలు పడింది చిత్ర యూనిట్. అలా ఆ సినిమాలో వీళ్లిద్దరు మానస సరోవరంలో కలుసుకున్నట్టు అద్భుతంగా చూపించారు. కానీ
🔴మొదట అనుకున్న స్టోరీ వేరు :
ఆ స్టోరీ ప్రకారం.. ‘ చిరంజీవి పెంచుకునే ఒక పాపకు ప్రమాదవశాత్తు అనుకోకుండా ఒక ప్రమాదం సంభవిస్తుంది ఆ ప్రమాదంలో గాయపడిన పాపకు చికిత్స కోసం లక్షలు ఖర్చవుతాయి అదే సమయంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్త చంద్రుడి పైకి ఒక మిషన్ నిర్వహించాలనుకుంటోంది. స్పేస్ షిప్‌లో చంద్రుడిపైకి వెళ్లి వచ్చిన వారికి కోట్లలో డబ్బులు ఇస్తామని చెబుతుంది. ఈ ప్రకటన చూసి చిరంజీవి స్పేస్ షిప్‌లో చంద్రుడిపైకి వెళతాడు. అక్కడ విహారానికి వచ్చిన ఇంద్రుడి కుమార్తె ఉంగరం పోగోట్టుకుంటోంది. అది చిరుకు దొరకడంతో దాన్ని వెతుక్కుంటూ శ్రీదేవి భూమి మీదికి వస్తుంది. ఇది అప్పటికి అనుకున్న కథ.
ఐతే.. ఈ కథలో సహజత్వం లేదని చంద్రుడు, స్పేస్ షిప్ ఇవన్నీ సహజంగా ఉండవని దర్శకుడు రాఘవేంద్రరావు, చిత్ర యూనిట్ భావించిందట.
💚 ‘మానస సరోవరం’ కలిసొచ్చింది :
కథపై టీం తర్జనభర్జనలు పడుతుండగాచిరంజీవి ‘మానస సరోవరం’ బ్యాక్ డ్రాప్ అయితే ఎలా ఉంటుంది అని చెప్పడంతో .. అందరికీ అది నచ్చి, కథను ఆ దిశగా రెడీ చేసారు రచయతలు.
🌟 కథ మారింది ,చరిత్ర సృష్టించింది :
అలా రాకెట్ కి బదులు చిరంజీవి మూలిక కోసం మానస సరోవరానికి వెళ్లడం.. అక్కడ విహారించడానికి వచ్చిన శ్రీదేవి ఉంగరం పోగోట్టుకోవడం..దాని కోసం కథానాయిక భూమి మీదికి రావడం అనే లైన్ తో కథ అద్భుతంగా తయారయ్యింది ఇలా తయారైన అద్భుతమైన కథను దర్శకేంద్రుడు మరింత అత్యంత రమణీయంగా తెరకెక్కించడంతో ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు.
🌟ప్రత్యేకతలు :
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో అద్భుతమైన చిత్రాలున్నాయి. అందులో వైజయంతి మూవీస్ బ్యానర్‌లో సి.అశ్వనీదత్ నిర్మించిన జగదేకవీరుడు అతిలోకసుందరి ఒక దృశ్య కావ్యం 💚జగదేకవీరుడుగా చిరంజీవి నటనతో పాటు ఇంద్రుడి కుమార్తె ఇంద్రజగా శ్రీదేవిని తప్పించి మరోకరిని ఊహించుకోలేము.ఆ జంటటైటిల్ కి పూర్తి జస్టిఫికేషన్ ఇచ్చి మైమరిపించారు.
👉హైదరాబాద్‌లోని ‘ఓడియన్ 70 MM’ థియేటర్‌లో ఏకధాటిగా ఒక యేడాది పాటు నాలుగు షోలతో రఫ్పాడించింది.
👉ఈ చిత్రం విడుదలకు ముందు రాష్ట్రాన్ని వరదలు అతలాకుతలం చేస్తున్నాఈ చిత్రం అఖండ విజయాన్ని నమోదు చేసుకోవడం ఇప్పటికీ ఒక విశేషమే…
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.