Teluguwonders:
నాచురల్ స్టార్ నాని జెర్సీ తో ఇయర్ ని అద్బుతంగా ఆరంభించ గా ఇప్పుడు ఇయర్ లో రెండో సారి గ్యాంగ్ లీడర్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. ముందు గా ఓవర్సీస్ లో ప్రీమియర్ షోల ను పూర్తీ చేసుకుని అక్కడ నుండి ఎబో యావరేజ్ రేంజ్ కి పైగా టాక్ ని సొంతం చేసు కున్న ఈ సినిమా ఇప్పుడు రెగ్యులర్ షోల ఫైనల్ టాక్ ఎలా ఉందో తెలుసుకుందాం పదండీ..
ముందుగా కథ విషయానికి వస్తే.. 6 గురు కలిసి ఒక బ్యాంక్ రాబరీ చేస్తారు, కానీ అందులో ఒకరు మిగిలిన వాళ్ళని చంపి డబ్బు తో ఎస్ కేప్ అవుతారు. కట్ చేస్తే ఇయర్ తర్వాత 5 గురు లేడిస్ రివేంజ్ కోసం ఒక రివేంజ్ స్క్రిప్ట్ రైటర్ దగ్గరకు వస్తారు. మరి ఆ రైటర్ ఎలా హెల్ప్ చేశాడు.
అసలు ఆ లేడిస్ కి ఆ చనిపోయిన వాళ్ళ కి సంభందం ఏంటి అనేది మెయిన్ పాయింట్:
పాటలు ఎంత బాగున్నాయో బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా అదే రేంజ్ లో ఇచ్చి అనిరుద్ అద్బుతమైన మార్క్ చూపెట్టాడు. చాలా సీన్స్ లో బ్యాగ్రౌండ్ స్కోర్ ఓ రేంజ్ లో ఉంటుంది. ఇక ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే విషయం లో కొంచం వీక్ గా ఉందని చెప్పాలి. కొన్ని సీన్స్ ని ఎడిట్ చేయాల్సి ఉండేది. లెంత్ కూడా కొంచం ఎక్కువ అయిన ఫీలింగ్ కలుగుతుంది.
ఇక డైరెక్షన్ పరంగా విక్రం కుమార్ మరీ డిఫికల్ట్ కథ ను ఎంచుకోక పోయినా కానీ సీరియస్ కథ ని సింపుల్ గా ఎక్కువగా ఎంటర్ టైన్ మెంట్ వే లో చెప్పి తన మార్క్ స్క్రీన్ ప్లే తో కొన్ని సీన్స్ తో మెప్పించగా కొన్ని సీన్స్ లో కొంచం తడబడ్డాడు, సినిమా ఓపెనింగ్ అండ్ ఎండింగ్ సీన్స్ కొంచం డ్రాగ్ అయిన ఫీలింగ్ కలిగినా ఓవరాల్ గా డైరెక్షన్ బాగుంది.
ఇక సినిమా లో ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే..
నాని నటన – కామిక్ టైమింగ్
లేడీస్ కామెడీ సీన్స్
సంగీతం – బ్యాగ్రౌండ్ స్కోర్
ఇంటర్వెల్
సెకెండ్ ఆఫ్ లో కొన్ని సీన్స్ మేజర్ ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి అని చెప్పాలి. ఇక సినిమా కి నెగటివ్ పాయింట్స్ విషయానికి వస్తే.
సినిమా ఓపెనింగ్ అండ్ ఎండింగ్ ప్రిడిక్ట్ చేసేలా ఉండటం
సెకెండ్ ఆఫ్ స్లో అయిన ఫీలింగ్ అక్కడక్కడా కలగడం
లెంత్ కొంచం ఎక్కువ అయిన ఫీలింగ్ కలగడం అని చెప్పాలి.
ఇవి తప్పితే సినిమా ఈజీగా ఒకసారి చూసి ఎంజాయ్ చేసే విధంగా ఉందని చెప్పొచ్చు. సినిమా కి మొత్తం మీద మా రేటింగ్ 2.75 స్టార్స్.. ఫ్యామిలీ ఆడియన్స్ అండ్ రెగ్యులర్ ఆడియన్స్ కూడా ఈజీగా ఒకసారి చూసి ఎంజాయ్ చేసే విధంగా సినిమా ఉంది. అది లాంగ్ రన్ లో హెల్ప్ అయ్యే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పొచ్చు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.