Teluguwonders:
మెగా స్టార్ చిరంజీవి “ఖైదీ నెంబర్ 150″తో వెండితెర రీ ఎంట్రీ ఇచ్చి మంచి హిట్ ను అందుకున్నారు. తాజాగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 151వ చిత్రం “సైరా నరసింహా రెడ్డి”. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్‌చరణ్ 200 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. బ్రిటీష్ వారిని ఎదిరించిన తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితగాథను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే.
అమితాబ్ బచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతిబాబు, రవికిషన్, తమన్నా, నిహారిక తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అక్టోబర్ 2న ఈ చిత్రం భారీ స్థాయిలో విడుదల కానుంది. ఇక చిరు 152వ చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనుండగా, ఈ చిత్రానికి సంబంధించి కొన్నాళ్ళుగా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. చిరు 152వ చిత్రంలో నటించే కథానాయికకి సంబంధించి గాసిప్ రాయుళ్లు కొన్నాళ్లుగా పలు రూమర్స్ పుట్టిస్తున్నారు. ముందుగా నయనతార ఆ తర్వాత అనుష్క , శృతి హాసన్ , ఐశ్వర్యరాయ్ ఇలా పలువురు తెరపైకి వచ్చాయి. తాజాగా గోవా బ్యూటీ ఇలియానా చిరుతో జోడీ కడుతుందని చెప్పుకొస్తున్నారు. దీనిపై క్లారిటీ రావలసి ఉంది. ఒకప్పుడు టాలీవుడ్‌లో వరుస చిత్రాలు చేసిన ఇలియానా కొన్నాళ్లు గ్యాప్ తీసుకుంది. రవితేజ చిత్రం “అమర్ అక్బర్ ఆంటోని”తో తెలుగు తెరకి రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇటీవలే ఈ బ్యూటీ బాయ్ ఫ్రెండ్ కు బ్రేకప్ చెప్పేసినట్టుగా వార్తలు విన్పించాయి. ఇప్పుడు ఇలియానా సినిమాలపై దృష్టి సారించి, అందుకు తగిన ఫిట్నెస్ కోసం జిమ్ లో వర్కౌట్స్ తో బిజీగా ఉందట.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.