Latest

    గోపిచంద్ “చాణక్య” FIRST LOOK ..అదిరింది..

    CHANAKYA

    Teluguwonders: యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ అయిన గోపీచంద్ ప్రస్తుతం తమిళ దర్శకుడు తిరు డైరెక్షన్లో ఒక స్పై థ్రిల్లర్లో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి ‘చాణక్య’ అనే టైటిల్ ను నిన్నే ఫిలిం మేకర్స్ ప్రకటించారు. ఇందులో గోపీచంద్ ఇండియన్ స్పై గా చేస్తున్నారు. ఈ మూవీ కి సంబంధించిన ఓ లుక్ ను ఈరోజు రిలీజ్ చేశారు.. ఈ రోజు గోపీచంద్ పుట్టిన రోజు జరుపుకుంటున్న సందర్భంగా అభిమానులకు కానుకగా ‘చాణక్య’ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు నిర్మాతలు . ఈ పోస్టర్లోనే గోపీచంద్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు మూవీ టీం.

    👉First look గురించి : ఈ పోస్టర్ లో ఓల్డ్ సిటీలో.. ఇసుక వేస్తే రాలనంతమంది జనాలున్న రోడ్ పై నడుస్తున్నాడు.ముస్లిం కమ్యూనిటీ మధ్యలో గోపిచంద్ ను ఫోటో హైలైట్ చేస్తుంది. గోపిచంద్ ఇంటెన్స్ లుక్ చూడగానే ఆకట్టుకునేలా ఉంది. ఫుల్ గా గడ్డం పెంచి గోపిచంద్ కొత్త గెటప్ లో ఉన్నాడు. బ్లాక్ టీషర్ట్ ధరించి దానిపై చిరుగులు ఉండే మరో వైట్ టీషర్ట్ ధరించి.. స్టైలిష్ గా ఒక స్టోల్ ను మెడకు చుట్టుకొని డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు.

    🔸ఆయన నుండి inspire అయ్యారా : ఈ ఫోటో చూస్తుంటే పాకిస్తాన్ లో అప్పట్లో ఇండియన్ రా ఏజెంట్ గా చేసిన అనిల్ దోవల్ స్టోరీ గుర్తుకు వస్తుంది. అయన కథ నుంచి ఇన్స్పిర్ అయ్యి సినిమా తీసి ఉండొచ్చు సినిమా టైటిల్.. గోపీచంద్ లుక్ ను చూస్తే ఏదో సీక్రెట్ మిషన్ లో ఉన్నాడనిపిస్తోంది. .

    ఈ సినిమాలో గోపీచంద్ సరసన మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తోంది. విశాల్ చంద్రశేఖర్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమాను అనిల్ సుంకర నిర్మిస్తున్నారు.

    💚Hope for success : గోపీచంద్ ఈమధ్య నటించిన ఆక్సిజన్,పంతం మొదలయిన సినిమాలు పెద్దగా విజయం సాధించలేదు. అందుకే ఈ సినిమాపై గోపీచంద్ భారీ ఆశలు పెట్టుకున్నారు. 👉మరి ఈ ‘చాణక్య’ మూవీ అయినా గోపిచంద్ కు విజయాన్ని అందించాలని కోరుకుందాం.


    Discover more from Telugu Wonders

    Subscribe to get the latest posts sent to your email.

    Leave a Reply

    Discover more from Telugu Wonders

    Subscribe now to keep reading and get access to the full archive.

    Continue reading