Teluguwonders:
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయ లలిత జీవితాధారంగా హిందీలో ఓ బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సినిమాకు తలైవి అనే టైటిల్‌ను కన్‌ఫర్మ్ చేశారు. ఇందులో జయ లలిత పాత్రలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నటిస్తున్నారు.దాదాపు 14 ఏళ్ల పాటు జయ లలిత తమిళనాడుకు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. 2016లో అనారోగ్య సమస్యలతో జయలలిత చనిపోయారు. ఆ తర్వాత తమిళనాడులో ఎన్నో రాజకీయాలు చోటుచేసుకున్నాయి. వాటన్నింటినీ ఒక్కో విధంగా చూపించేందుకు మరో ఇద్దరు దర్శకులు జయ లలిత బయోపిక్‌లు తీస్తున్నారు
🌟Talaivi జయ లలిత :
దివంగత ముఖ్యమంత్రి జయ లలిత బయోపిక్‌కు బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సిద్ధమవుతున్నారు. కంగన ఫొటోలు చూసి పలువురు ఫ్యాన్స్ షాకయ్యారు.
💥 ‘ఓ మై గాడ్ ఊపిరి ఆడుతోందా?’ :
ప్రస్తుతం కంగన అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో ఉన్నారు. ప్రాస్తెటిక్స్ చేయించుకోవడానికి హాలీవుడ్ ఫేమస్ ఆర్టిస్ట్ జేసన్ కోలిన్స్‌ను సంప్రదించారు. ఆయన స్టూడియోలో కంగనకు ప్రాస్తెటిక్ ట్రీట్‌మెంట్ స్టార్ట్ చేశారు. కంగనను కుర్చీలో కూర్చోపెట్టి ముఖం నిండా లైట్ గ్రీన్, బ్లూ కలర్ లిక్విడ్ పోశారు. ఆ సమయంలో తీసిన ఫొటోలను కంగన సోషల్ మీడియా సిబ్బంది ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ‘తలైవి సినిమా కోసం లాస్ ఏంజెల్స్‌లోని జేసన్ కాలిన్స్ స్టూడియోలో కంగన ప్రాస్తెటిక్ మెజర్‌మెంట్స్ తీయించుకుంటున్నారు. జేసన్ గతంలో కెప్టెన్ మార్వెల్ సినిమా కోసం పనిచేవారు. జయలలిత బయోపిక్ మైండ్ బ్లోయింగ్‌గా ఉండబోతోందని చెప్పాల్సిన అవసరం లేదు’ అని పేర్కొంది.
🔴24 కోట్ల పారితోషికం :
కంగన పుట్టినరోజున తలైవి బయోపిక్‌ను ప్రకటించారు. సినిమాకు ప్రముఖ తమిళ దర్శకుడు ఏ.ఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను హిందీలో జయ టైటిల్‌తో తమిళం, తెలుగులో తలైవి టైటిల్‌తో విడుదల చేయనున్నారు. సినిమా కోసం కంగన రూ.24 కోట్ల పారితోషికం తీసుకున్నారు. ఇప్పటివరకు ఏ హీరోయిన్ ఇంతటి స్థాయిలో రెమ్యునరేషన్ డిమాండ్ చేయలేదు. అంత పారితోషికం తీసుకోవడానికి కంగన అర్హురాలేనని గతంలో విజయ్ వెల్లడించారు. ‘ఈ శతాబ్దంలో సక్సెస్‌ఫుల్ మహిళల్లో ఎవరైనా ఉన్నారంటే జయ లలితనే. ఆమె ఐకానిక్ పొలిటీషియన్‌గా మారక ముందు ఓ సూపర్ స్టార్. ఈ మెగా ప్రాజెక్ట్‌లో నేను నటిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. జయలలిత బయోపిక్ స్టోరీ వినక ముందు నేను నా బయోపిక్ తీయాలనుకున్నాను. కానీ జయలలిత స్టోరీ విన్నాక మా ఇద్దరి జీవితాలకు దగ్గరి పోలికలు ఉన్నాయనిపించింది. కాబట్టి నేను నా బయోపిక్ తీయాలా? లేక జయలలిత బయోపిక్‌లో నటించాలా? అని ఆలోచిస్తున్నప్పుడు జయలలిత బయోపిక్‌లోనే నటించడం మంచిదనిపించింది’ అని కంగన వెల్లడించారు.
సినిమాకు విష్ణు వర్ధన్ ఇందూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు ఎస్.ఎస్ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్, ‘ది డర్టీ పిక్చర్’ రచయిత రజత్ అరోరా కంబైన్డ్‌గా కథను రూపొందించారు. .
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.