Teluguwonders:
💥తమిళ్ రాకర్స్ సైట్ నిషేధం:
థియేటర్లో సినిమా విడుదలకు ముందే ఆన్‌లైన్‌లో లీక్ చేసే తమిళ్ రాకర్స్ వెబ్ సైట్లతో పాటు మరికొన్ని వెబ్ సైట్లను నిషేధించాలని ఢిల్లీ హైకోర్టు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్‌ను ఆదేశించింది.
తమిళ్ రాకర్స్ ఇప్పటి వరకు మూవీ ఇండస్ట్రీకి కంటి మీద కునుకు లేకుండా చేసింది.విదేశాల సంస్థలకు పైరసీ వెబ్‌సైట్లునష్టం కలిగించాయి.దానితో దీనిపై ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది .ఇప్పటికే పలు సినిమా ఇండస్ట్రీల నిర్మాతలు నష్టపోయిన సందర్భంగా పైరసీ వెబ్‌సైట్లను నిషేధించాలని ఉత్తర్వులు జారీ చేసింది.
💥తమిళ్ రాకర్స్ కి షాక్:
సినిమా ఇండస్ట్రీని భూతంలా పట్టి పీడిస్తున్నతమిళ్ రాకర్స్ వెబ్‌సైట్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తమిళ్ రాకర్స్ వెబ్‌సైట్‌ను బ్లాక్ చేయాలని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ (ఐఎస్‌పీ)ను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఈ వెబ్‌సైట్‌తో పాటు ఈజెడ్‌టీవీ, క్యాట్ మూవీస్, లైమ్ టోరెట్ వెబ్‌సైట్‌ల యూఆర్‌ఎల్స్ (లింకులు), ఐపీ అడ్రస్‌ను బ్లాక్ చేయాలని జస్టిస్ సంజీవ్ నరులా ఐఎస్‌పీలకు ఆదేశాలు జారీ చేశారు. ఇంటర్నెట్‌లో వీటి లింక్స్ కనిపించకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలలో పేర్కొన్నారు. 👉వార్నర్ బ్రదర్స్, యూనివర్సల్ అండ్ నెట్ ఫ్లిక్స్ సంస్థలకు సంబంధించిన సినిమాలు, టెలివిజన్ సిరీస్‌లను ఎలాంటి హక్కులు లేకున్నా కొన్ని వెబ్‌సైట్స్ అక్రమంగా ప్రసారం చేస్తున్నాయి.
ప్రైవసీని ప్రొత్సహిస్తూ, వేరే సంస్థల సమాచారాన్ని కాపీ రైట్ హక్కులకు భంగం కలిగిస్తున్నట్లు అలాంటి వెబ్‌సైట్ల రిజిస్ట్రేషన్ డొమైన్ పేరును నిషేధించాలని టెలీకమ్యూనికేషన్స్ (డీఓటీ), ఐటీ శాఖలకు మార్గదర్శకాలు జారీ చేశారు. అమెరికాకు చెందిన వార్నర్ బ్రదర్స్ సంస్థ దాఖలు చేసిన వ్యాజ్యంపై వాదనలు విన్న అనంతరం ఢిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు వెల్లడించింది.
👉వార్నర్ బ్రదర్స్ సంస్థ కాపీరైట్స్ కలిగి ఉన్న ఏ ప్రొగ్రాంను ఇతర వెబ్‌సైట్స్, ఛానెళ్లు ప్రసారం చేయకూడదని హెచ్చరికలు జారీ చేశారు.ఆ కంపెనీ వాదనలు విన్న తర్వాత.. ప్రాథమికంగా కేసు నమోదు చేయాలని ఢిల్లీ హైకోర్టు పోలీసులకు సూచించింది. మధ్యంతర ఉత్తర్వులు త్వరగా అమలు చేయకపోతే వార్నర్ బ్రదర్స్‌కు నష్టం వాటిల్లుతుందని వారి తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించుకున్నారు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.