Teluguwonders: హృతిక్ రోషన్ ముందునుంచే ఏ సినిమా చేసిన చరిత్రలో నిలిచిపోవాలని ప్రయత్నం చేస్తున్నారు .ఆయన నటించిన సినిమాలు చూస్తేనే ఆ విషయం అర్థమవుతుంది’ ఆయన నటిస్తున్న తాజా సినిమా ‘సూపర్ 30’.
🔴’సూపర్ 30′ : Super 30 ప్రొగ్రామ్ పేరుతో ఐఐటీలో శిక్షణ ఇచ్చే బిహార్‌కి చెందిన గణితవేత్త ఆనంద్ కుమార్ జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది.
వికాస్ భల్ దర్శకత్వం వహిస్తున్నారు.
🔴ఆనంద్ కుమార్ పాత్రలో : ఈ సినిమా లో ఆనంద్ కుమార్ పాత్రలో డీగ్లామర్ లుక్‌లో హృతిక్ పరకాయ ప్రవేశం చేశారు.ఆనంద్ కుమార్ పాత్రలో హృతిక్ రోషన్ నటిస్తున్నారు. 👉తాజాగా మంగళవారం ఈ చిత్ర ట్రైలర్‌ని ట్విట్టర్ ద్వారా హృతిక్ విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ “భారత్‌ని ఓ చీప్ లేబర్ దేశం అంటుంటారు. మరి పెప్సికో కంపెనీకి అధినేత యూనిలివర్ సంస్థ లను నడిపిస్తున్నదెవరు? ఈ విషయాలు ఎవ్వరికీ తెలియకపోతే గూగుల్‌లో వెతకండి. ఆ గూగుల్‌ని శాసిస్తోంది ఎవరో కూడా అందులోనే తెలుసుకోండి. వీరందరూ మన భారతీయులే కదా’ అని అన్నారు హృతిక్ రోషన్. . .
🔴ట్రైలర్ కంటెంట్ ని బట్టి : ట్రైలర్ పరంగా చూస్తే.. హృతిక్ (ఆనంద్ కుమార్) ఓ విద్యా సంస్థలో ఐఐటీ ప్రొఫెసర్‌గా పనిచేస్తుంటారు. కానీ పలు కారణాలతో ఆ ఉద్యోగం మానేసి బయటకు వచ్చేసి కొత్తగా ఐఐటీ కోచింగ్ సెంటర్ పెడతారు. 👉ప్రతి ఏడాది 30 మంది పేద ఉత్తమ విద్యార్థులకు ఉచితంగా కోచింగ్ ఇస్తుంటారు. అయితే దాన్ని నడిపించేందుకు ఆయన ఎలాంటి ఇబ్బందులు పడ్డారు?, దేశం గర్వించేలా వారిని ఎలా తయారు చేశారనే అంశాలు ట్రైలర్‌లో ప్రతిబింబిస్తున్నాయి. ‘ఈ సినిమా చదువు, టీచర్ల పవర్‌ని, విలువలని తెలుపుతుంది. టీచర్లని గౌరవించే విషయంలో చైనా, భారత్‌కి దగ్గరి పోలికలున్నాయి. ఈ రెండు దేశాల్లో ఉపాధ్యాయులను బాగా గౌరవిస్తారు. ఈ సమాజంలో టీచర్ల స్థానమే అగ్ర భాగంలో ఉంటుంది’ అని హృతిక్ రోషన్ తెలిపారు. ఈ సినిమాలో మృణాల్ ఠకూర్, నందిష్ సింగ్, అమిత్ సాద్, పంకజ్ త్రిపాఠి, విజరు వర్మ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.