TeluguWonders:
💚 జూనియర్ ఎన్టీఆర్ ఈ మధ్యన ఏం చేసిన ఒక సెన్సేషనే అవుతుంది. టెంపర్ తో మొదలు పెట్టిన ఈ సంచలనాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి . టెంపర్ సినిమా లో ఫ్రాడ్ పోలీస్ ఆఫీసర్ గా కనబడినా, నాన్నకు ప్రేమతో సినిమా సినిమాలో డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో, పొడవాటి గడ్డంతో కనబడినా, జనతా గ్యారేజ్ సినిమా లో సీనియర్ నటుడు మోహన్ లాల్ తో నటించి మెప్పించినా, జై లవకుశ సినిమాలో మూడు విభిన్న రకాల పాత్రలను పోషించనా అది జూనియర్ ఎన్టీఆర్ కే చెల్లింది . కథల విషయంలో ఆయన తీసుకుంటున్న జాగ్రత్త ప్లానింగ్ అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది . అందరూ ఆయన్ని ఫాలో ఎలా చేస్తుంది . ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆర్ఆర్ఆర్’ మల్టీస్టారర్ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అసలు ఈ ‘ఆర్ఆర్ఆర్’సినిమానే అన్నిటికంటే పెద్ద సెన్సేషన్ అయితే ఈ సంచలనాల లిస్టులోకి తారక్ ఇప్పుడు మరో సినిమాని యాడ్ చేయబోతున్నాడు .
💚 ప్రత్యేక పాత్రలో తారక్ ; ఇప్పుడు వరుస సినిమాలతో మంచి జోష్‌లో ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. తాజాగా ఓ సినిమాలో గెస్ట్ రోల్ చేయడానికి కూడా సిద్ధమయ్యారట. డిఫెరెంట్ కథలు ఎంచుకుంటూ కేవలం నటనా ప్రతిభతో అంచెలంచెలుగా పైకొచ్చిన ఎన్టీఆర్ ఓ గెస్ట్ రోల్ కోసం సిద్ధం కావడమంటే ఆ రోల్ ఎంత స్ట్రాంగ్‌గా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
💚 కీర్తి సురేష్ సినిమా లో : కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నాగేంద్ర అనే దర్శకుడు రూపొందిస్తున్న చిత్రంలో ఓ కీలకమైన పాత్ర కోసం ఎన్టీఆర్‌ని సంప్రదించగా ఆయన ఓకే చెప్పినట్లు సమాచారం. అయితే ఈ గెస్ట్ రోల్ లో చేయమని ఎన్టీఆర్‌కి సూచించింది ఆయన అత్యంత సన్నిహితుడైన మహేష్ కోనేరు అని తెలుస్తోంది.
💚 సినిమా వివరాలు:సఖి అనే టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమాను మహేష్ కోనేరు నిర్మిస్తున్నాడు. ఇప్పటికే హైదరాబాద్‌లో కొంత భాగం షూటింగ్ ఫినిష్ చేసిన చిత్రయూనిట్..త్వరలోనే ఓ భారీ షెడ్యూల్ కోసం యూరప్ వెళ్లనుందని సమాచారం. కేవలం 10 నిముషాలు మాత్రమే ఉండే ఈ రోల్‌లో నటించేందుకు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. ఈ కామియోకు సంభందించిన లైన్ విన్న ఎన్టీఆర్.. ఫైనల్ గా ఓ సారి మొత్తం స్క్రిప్ట్ విని, అది తను మాత్రమే చేయగలిగే ప్రత్యేకమైన పాత్ర అయితే తప్పకుండా చేస్తానని మాట ఇచ్చారట.
💚 వెండితెర హీరో దగ్గరి నుంచి బుల్లితెర హోస్ట్ వరకూ అన్నింటా ఆకట్టుకున్న ఎన్టీఆర్.. ఇప్పుడు గెస్ట్ రోల్‌పై ఇంట్రెస్ట్ చూపుతుండటం తెలుగు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. హీరో ప్రాధాన్యమున్న సినిమాలో గెస్ట్ గా కనిపించటం కంటే.. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలో గెస్ట్ రోల్ చేయడం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుందని భావించిన ఎన్టీఆర్ ఇందుకు సుముఖంగా ఉన్నారని తెలుస్తోంది.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.