Teluguwonders:
ఈ ఏడాది ఇప్పటికే తేజ దర్శకత్వంలో సీత.. శర్వానంద్ రణరంగం సినిమాలు చేసింది కాజల్. ఇందులో సీత డిజాస్టర్ కాగా.. రణరంగం పర్లేదు అనిపించింది. ఇక ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోలందరితోనూ జోడీకట్టిన ఈ బ్యూటీ.. ఇప్పుడు విష్ణుకు సోదరిగా నటిస్తుండటం విశేషం. అసలు హీరోయిన్ కాస్త చెల్లి ఎందుకు అయిందబ్బా అనుకోవచ్చు..
👉 కారణం ఏదైనా కథానాయిక కాజల్ హీరో మంచు విష్ణుకు సోదరిగా మారారు. వీరిద్దరు ప్రధాన పాత్రల్లో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా సెట్‌లో విష్ణుతో కలిసి స్నాక్స్ తింటున్న ఫొటోను రక్షాబంధన్ సందర్భంగా కాజల్ ట్విటర్‌లో షేర్ చేశారు. ‘హ్యాపీ రాఖీ అర్జున్!’ అంటూ మంచు విష్ణును ట్యాగ్ చేశారు. దీనికి ఆయన ప్రతి స్పందించారు. ‘హాహాహా.. థాంక్స్ అను. చేతుల్లో ఫుడ్ లేకుండా మనం కలిసి ఉన్న ఒక్క ఫొటో కూడా లేదనుకుంటా’ అంటూ కాజల్‌ను ట్యాగ్ చేశారు. దీన్ని బట్టి ఈ సినిమాలో విష్ణు అర్జున్ పాత్రలో, కాజల్ అను పాత్రలో నటిస్తున్నట్లు తెలిసింది.
🔴అది హాలీవుడ్ సినిమా నా..!? :
క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అన్నా చెల్లెల్ల పాత్రలు హైలైట్. అందుకే విష్ణుకు చెల్లిగా కాజల్ నటిస్తుంది. రాఖీ పండగ సందర్భంగా హ్యాపీ రాఖీ అర్జున్ అంటూ షూటింగ్ లొకేషన్ నుంచి ఫోటోను షేర్ చేసింది కాజల్. విష్ణు ఓ హాలీవుడ్ సినిమా తీస్తున్నారని, ఇది ఏకకాలంలో తెలుగులోనూ విడుదల కాబోతోందని ప్రచారం జరుగుతోంది. ఓ హాలీవుడ్ దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. క్రైమ్ థ్రిల్లర్‌గా దీన్ని రూపొందిస్తున్నారట. చాలా రోజులుగా విష్ణును ఓ కథ వెంటాడుతుంది.అందులో చెల్లి పాత్ర కోసం చాలా మంది హీరోయిన్లను అనుకున్నా కూడా చివరికి కాజల్ వచ్చి చేరింది.
🔴నాలుగు ప్రాజెక్టులను ప్లాన్ చేస్తున్న విష్ణు :
నాలుగు ప్రాజెక్టులను ప్రారంభించినట్లు ఇటీవల మంచు విష్ణు ట్వీట్ చేశారు. అందులో ఒకటి వెబ్‌సిరీస్ అని, శ్రీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారని తెలిపారు. ఈ వెబ్‌సిరీస్ షూటింగ్‌కు మోహన్‌బాబు క్లాప్ కొట్టిన ఫొటోను కూడా షేర్ చేశారు.
💥కాజల్ కు ఏమయ్యింది :
హీరోయిన్లు.. అందులోనూ స్టార్ హీరోయిన్లను తీసుకొచ్చి చెల్లి పాత్రలు చేయమంటే నో అంటారు. అసలు తమకేం తక్కువ.. చెల్లి పాత్రలో ఎందుకు నటిస్తాం అంటూ మొహం మీదే నో చెప్పేస్తుంటారు.
🔴కాజల్ అగర్వాల్‌కు అప్పుడే చెల్లి ఎందుకు అయిపోయింది..?– కాజల్ అగర్వాల్ భిన్నంగా ఆలోచిస్తుంది. డబ్బులు ఎక్కువిస్తున్నారని చేస్తుందో.. లేదంటే నిజంగానే కథకు కనెక్ట్ అవుతుందో తెలియదు కానీ ఇప్పుడు మంచు విష్ణుకు చెల్లి అయిపోయింది ఈ భామ. అయినా కాజల్ లాంటి హీరోయిన్‌ను చెల్లి అనాలంటే ఎవరికైనా కాస్త కష్టమే. కానీ కథ డిమాండ్ చేసింది కాబట్టి విష్ణుకు తప్పడం లేదు. 👉అయితే కాజల్‌తో ప్రాజెక్టు వివరాల్ని విష్ణు వెల్లడించలేదు. త్వరలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాల్ని వెల్లడించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.