Teluguwonders:
యాంకర్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనదైన మార్క్ ని వేసి, ఇప్పుడు హీరోయిన్ గా లేడీ ఓరియెండెట్ సినిమాల్లో సైతం నటిస్తూ ఆశ్చర్యపరుస్తోంది అనసూయ. మంచి మంచి క్యారెక్టర్స్ ని ఎంచుకుంటూ వెండితెరపై తన మార్క్ ని చూపిస్తున్న అనసూయ నటించిన తాజా చిత్రం ‘కథనం’. ఈ సినిమాతో అనసూయ హిట్ కొట్టిందా? ఆడియన్స్ అంచనాలని ఈ సినిమా అందుకుందా లేదా తెలియాలంటే మనం రివ్యూలోకి వెళ్లాల్సిందే.
కథ
అను (అనసూయ) సినిమాలలో పని చేస్తుంటుంది. ఎప్పటికైనా డైరెక్షన్ చేయాలన్నది ఆమె ఆశ. ఆమె ఫ్రెండ్ ధన (ధనరాజ్) హీరోగా ట్రై చేస్తుంటాడు. ఒకసారి అనుకి ఒక సినిమా ఛాన్స్ వస్తుంది
మంచి కథని రాసిమ్మని అడుగుతారు. దీంతో ఒక కథని రాస్తుంది అను. అనుకోకుండా ఆ కథ తన కళ్లముందే జరుగుతూ ఉంటుంది. అసలు ఇలా ఎలా జరుగుతోంది..? చివరకి దీనివల్ల అనుకి వచ్చిన కష్టాలేంటి..? డైరెక్టర్ గా తను విజయం సాధించిందా లేదా అనేది వెండితెరపై చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్..
సినిమాకి ఎంచుకున్న ప్లాట్ సినిమాకి బలాన్ని ఇచ్చిందని చెప్పాలి. రాసుకున్న కథలో దర్సకుడు కొన్ని సీన్స్ చాలా ఆసక్తికరంగా మలిచాడు దర్శకుడు. అనసూయ పెర్ఫామెన్స్, ధనరాజ్ యాక్టింగ్, ఫృధ్వీ ఇలా అందరూ తమ క్యారెక్టర్స్ ని న్యాయం చేసారు. ఫస్ట్ హాఫ్ కంటే కూడా సెకండ్ హాఫ్ సినిమాపై పట్టు సాధించాడు డైరెక్టర్. ఇదే సినిమాని నిలబెట్టింది.
మైనస్ పాయింట్స్..
ఎంచుకున్న కథ బాగున్నా కూడా స్క్రీన్ ప్లే రాసుకోవడంలో దర్శకుడు కాస్త తడబడ్డాడు. దాంతో ప్రేక్షకులు ల్యాగ్ సీన్స్ తో కాస్త ఇబ్బంది పడ్డారు. ఎడిటింగ్ మరికాస్త క్రిస్పీగా ఉంటే బాగుండేది. ఇలాంటి సినిమాలకి స్పీడ్ స్క్రీన్ ప్లే ఉండాలి అది మిస్ అయ్యింది. అంతే కాదు , బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సీన్ డెప్త్ ని కిల్ చేసిందనే చెప్పాలి. ఇక అక్కడక్కడా కొన్ని లాజిక్స్ మిస్ అయ్యాడు డైరెక్టర్. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మరింత గ్రిప్పింగ్ గా చెప్పి ఉంటే బాగుండేది. ఇంకా అవసరాల శ్రీనివాస్ ని సినిమాలో సరిగ్గా వాడుకోలేదనిపిస్తుంది.
ఓవర్ ఆల్ గా చెప్పాలంటే సస్పెన్స్ సినిమాలు ఇష్టపడే వారు ఈ సినిమాని ఒక్కసారి చూడచ్చు.
నటీనటులు : అనసూయ,శ్రీనివాస్ అవసరాల, ధన్ రాజ్, వెన్నెల కిషోర్,రణధీర్ తదితరులు.
సంగీతం : సునీల్ కశ్యప్
కెమెరా: సతీష్ ముత్యాల
దర్శకత్వం : రాజేష్ నాదెండ్ల
నిర్మాతలు : బి.నరేంద్రా రెడ్డి, శర్మ చుక్కా
రన్ టైం: 126 నిముషాలు
రేటింగ్: 2/5
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.