Teluguwonders:
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి సినిమా టీజర్ ఇప్పటికే యూట్యూబ్ లో రిలీజ్ అయి మంచి వ్యూస్ సాధించగా, నేడు ఈ సినిమా అధికారిక ట్రైలర్ ని రిలీజ్ చేసింది సినిమా యూనిట్. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించగా, మెగాస్టార్ సరసన నయనతార హీరోయిన్ గా నటించింది. ఇక కాసేపటి క్రితం యూట్యూబ్ లో రిలీజ్ అయిన ఈ ట్రైలర్ కు వీక్షకులు విపరీతంగా బ్రహ్మరధం పడుతున్నారు. మెగాస్టార్ అదరగొట్టే డైలాగ్స్, భారీ యాక్షన్ సీన్స్, విజువల్ ఎఫెక్ట్స్, ఫైట్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో అదరగొట్టిన ఈ ట్రైలర్, సినిమాపై అమాంతం అంచనాలు పెంచేసిందనే చెప్పాలి.
ఇక ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కార్యక్రమాన్ని హైదరాబాద్ లో కాసేపటి క్రితం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎల్ వి ప్రసాద్ తనయుడు రమేష్ ప్రసాద్ ప్రత్యేక అతిథిగా విచ్చేసి ట్రైలర్ ని అఫీషియల్ గా రిలీజ్ చేయడం జరిగింది. మెగాస్టార్ హీరోగా మరియు రామ్ చరణ్ నిర్మాతగా కలిసి ఎంతో కసిగా చేసిన ఈ ప్రాజెక్ట్, తప్పకుండా మంచి సక్సెస్ సాధించాలని ఈ సందర్భంగా రమేష్ ప్రసాద్ మాట్లాడుతూ చెప్పారు. ఇక ట్రైలర్ రిలీజ్ అనంతరం నిర్మాత రామ్ చరణ్, దర్శకుడు సురేందర్ రెడ్డి మీడియాతో కాసేపు ముచ్చటించారు. అయితే అందులో ఒక విలేఖరి మాట్లాడుతూ,
ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ సమయంలో పవర్ స్టార్ గారు వాయిస్ ఓవర్ అందించారు కదా, అది కేవలం అంతవరకు పరిమితమేనా లేక ఆయన సినిమాకు కూడా వాయిస్ ఓవర్ ఇచ్చారా అని అడగ్గా, అవును ఆయన ఈ సినిమాలో కూడా చాలా సీన్స్ కు వాయిస్ ఓవర్ ఇవ్వడం జరిగింది అని చరణ్ చెప్పగానే, ఆ హాల్ మొత్తం ఒక్కసారిగా విపరీతమైన హర్షద్వానాలతో మారుమ్రోగింది. దీనిని బట్టి రేపు సైరా సినిమాకు వెళ్లిన మెగాఫ్యాన్స్ కు మెగాస్టార్ స్క్రీన్ పై కనపడడంతో పాటు బ్యాక్ గ్రౌండ్ లో పవర్ స్టార్ వినపడతారన్నమాట. ఈ వార్త నిజంగా మెగా ఫ్యాన్స్ లో ఎంతో జోష్ నింపగా, ముఖ్యంగా పవర్ స్టార్ ఫ్యాన్స్ ని మరింత ఖుషి చేస్తోంది…..!!
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.