Teluguwonders:
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆ ఫ్యామిలీకి ఓ పేరుంది. టాలీవుడ్ బడా ఫ్యామిలీలో ఆ ఫామిలీ ఒకటి. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. అదే అక్కినేని ఫామిలీ. నిజానికి అక్కినేని ఫామిలీ అంటేనే ఎంజాయ్ కి పెట్టింది పేరు. ఎంత వయసొచ్చిన కొంచెం కూడా తగ్గని గ్లామర్ నాగార్జున సొంతం. ఇక కొడుకులు చైతు,అఖిల్ ఎవరికి వారు సినిమాలతో బిజీగా ఉంటున్నారు. అయితే ఆగష్టు 29 నాగార్జున పుట్టినరోజు సందర్బంగా అక్కినేని ఫామిలీ అంత స్పెయిన్ లో సందడి చేస్తుంది. నాగ్ ఇప్పటికే బిగ్ బాస్ హోస్టుగా వ్యవహరిస్తున్నప్పటికీ హాలీడే పెట్టి మరీ కుటుంబంతో విదేశాల్లో తన పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నాడు. అయితే ఇదంతా ఒక ఎతైతే ఆ ఎంజాయింగ్ మూమెంట్లో సమంత చైతు ఫెయిర్ అందర్నీ ఆకట్టుకుంటుంది.
కింగ్ నాగార్జున పుట్టినరోజు వేడుకల కోసం వెకేషన్ కి వెళ్లిన అక్కినేని ఫ్యామిలీ స్పెయిన్ ఇబిజలో జోష్ తో సెలబ్రేషన్స్ లో మునిగి తేలింది. అయితే కొన్ని రోజుల నుంచి సమంత, నాగచైతన్య విదేశాల్లోనే ఉన్నారు. అక్కడే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు నాగ్, అమల, అఖిల్ తోడవ్వడంతో ఇక వాళ్ళ ఎంజాయ్ ఎలా ఉంటుందో వేరే చెప్పాల్సిన పని లేదు. మామ పుట్టిన రోజు వేడుకల్లో పింక్ డ్రెస్‌లో మెరిసింది కోడలు పిల్ల సమంత.
ఇక ఇబిజ పార్టీలో వియ్ విల్ రాక్ యు.. వియ్ విల్ రాక్ యు అంటూ లౌడర్ సౌండ్ తో వస్తున్న పాటకు సామ్ అదిరిపోయే స్టెప్పులు వేసింది. ఇక సామ్ జోష్ కి నాగచైతన్య అంతే జోష్ ని చూపించారు. మరోవైపు సామ్ చైతన్య ఓ పబ్‌లో మైమరిచిపోయారు. భర్తని గాఢంగా కిస్ చేసిన ఓ ఫోటో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి..మై రే ఆఫ్ లైట్ చైతూ” అనే క్యాప్షన్ జోడించింది
సమంత ప్రస్తుతం.. దిల్ రాజు నిర్మాణంలో శర్వానంద్ జోడిగా 96 రీమేక్ లో నటిస్తోంది. కాగా మజిలీ, ఓ బేబి చిత్రాలతో సామ్ మంచి జోష్ లో ఉంది. అయితే ఆ రెండు చిత్రాల్లోనూ చైతు ఉండటం విశేషం
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.