Teluguwonders:
😃నటీనటులు:
సంపూర్ణేష్ బాబు, ఇషికా సింగ్, మహేష్ కత్తి తదితరులు..
దర్శకత్వం: రూపక్ రొనాల్డ్ సన్ కథ, మాటలు,
స్క్రీన్ ప్లే: స్టీవెన్ శంకర్
నిర్మాత: సాయి రాజేష్ నీలం (స్టీవెన్ శంకర్)
సంగీతం: సయ్యద్ కమ్రాన్
సినిమాటోగ్రఫి: ముజీర్ మాలిక్
ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్
బ్యానర్: అమృత ప్రొడక్షన్స్
రిలీజ్ డేట్: 2019-08-10
దర్శకుడు రూపక్ రోనాల్డ్ సన్, బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం కొబ్బరిమట్ట. సాయి రాజేష్ నిర్మాణ సారథ్యంలో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకువచ్చింది . ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కొన్ని అనుకోని కారణాల వల్ల ఆగిపోయింది. 2015 నుంచి ఈ మూవీ విడుదలపై ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. అప్పుడప్పుడు కొన్ని పాటలు, ట్రైలర్లతో హడావిడి కనిపించింది. అయితే ఇన్నాళ్ల తర్వాత ‘కొబ్బరిమట్ట’ సినిమా విడుదలకు అడ్డంకులు తొలగడంతో విడుదలకు రెడీ అయ్యింది. ఈ చిత్రం ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
🤩కథ :
ఇదో సరదా కథ.. పాపారాయుడు (సంపూర్ణేష్ బాబు) కుటుంబం తర తరాలుగా ఊరికి పెద్దగా ఉంటుంది. ఊరి కోసం పాపారాయుడు చనిపోతూ.. తన కొడుకు పెదరాయుడ్ని కుటుంబానికి ఊరికి వారసుడ్ని చేస్తాడు. పెదరాయుడుకి ముగ్గరు తమ్మళ్లు, ముగ్గురు చెల్లెల్లు. అలాగే ముగ్గురు భార్యలు కూడా. ఈ కుటుంబాన్ని అంతా ‘కొబ్బరి మట్ట’కు ఉండే ఆకుల్లా కాపాడుకుంటూ ఉంటాడు. ఈ కథలోకి ఆండ్రాయిడ్ (సంపూర్ణేష్ బాబు) అనే కొత్త పాత్ర చేరుతాడు. ఇంతకీ ఈ ఆండ్రాయిడ్ ఎవరు? అతనికి పెదరాయుడుకి సంబంధం ఏంటి? అతను పెదరాయుడు పోలికలతో ఎందుకు పుడతాడు? అన్నదే కామెడీ కథలో కీలకం.
😎విశ్లేషణ :
ఈ సినిమా ఎలా ఉందన్న విషయం చెప్పడానికి మచ్చుకి ఓ రెండు అరాచకమైన సన్నివేశాలు .😳 పాపారాయుడు (సంపూర్ణేష్ బాబు) కత్తిపోటుకు గురై చావుబతుకుల మధ్య ఉంటాడు.పెదరాయుడు (సంపూర్ణేష్ బాబు-పాపారాయుడు కొడుకు) తన తండ్రిని ఒడిలో పెట్టుకుని కడుపులో దిగిన కత్తిని బయటకు తీస్తాడు. వెంటనే పాపారాయుడు చాలా నొప్పిగా ఉందిరా అని అనడంతో వెంటనే అదే కత్తిని తండ్రి కడుపులో దించేస్తాడు పెదరాయుడు. ఇక పాపారాయుడు చనిపోతుంటే పక్కనే ఉన్న భార్య నేను ఉండలేనండీ అని ఏడుస్తుంది. అయితే రా.. నేను చనిపోతే నువ్ ఒంటరి దానివి అయిపోతావ్ కాదా అని తన కడుపులో ఉన్న కత్తిని భార్య కడుపులో దించేసి ఇద్దరూ కలిసి చనిపోతారు.
ఇక పాపారాయుడు చనిపోతున్న సందర్భంలో నీకు ఏ కష్టం వచ్చినా నన్ను నాన్నా అని పిలువు అని సమాధిలో నుండి అయినా వచ్చేస్తా అని చెప్పి చనిపోతాడు. సినిమా క్లైమాక్స్‌లో పెదరాయుడ్ని విలన్‌లు కొడుతుంటే.. తండ్రి పాపారాయుడు మాట గుర్తుకు వచ్చి నాన్నా అని పిలివడంతో సమాధిని చీల్చుకుంటూ వచ్చి విలన్‌లను ఉతికి ఆరేసి.. మళ్లీ సమాధిలోకి వెళిపోతాడు పాపారాయుడు. ఇలాంటి భయంకరమైన, అరాచకమైన సన్నివేశాలు ఈ సినిమాలో ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపిస్తాయి ప్రేక్షకుల్ని నవ్విస్తాయి.
🔴నటీ నటుల పని తీరు :🤣సంపూర్ణేష్ బాబు :
పాపారాయుడు, పెదరాయుడు, ఆండ్రాయుడు పాత్రల్లో సంపూర్ణేష్ బాబు ఓ పెద్ద అరాచకమే చేశారు. వన్ మేన్ షోతో పొట్టచెక్కలు చేశాడు. సీన్ సీన్‌లో పంచ్.. ఆ పంచ్‌లో ఫన్.. ఆ ఫన్‌లో వల్గారిటీ ఉన్నా ప్రేక్షకులతో చప్పట్లు కొట్టించాడు. డాన్స్, ఫైట్లతో సహా కడుపుబ్బా నవ్వించారు.
అతనికి భార్యలుగా నటించిన ముగ్గురూ.. గాయత్రి గుప్తా, ఇషికా సింగ్, గీతాంజలి కామెడీలో భాగం అయ్యారు. ఈ చిత్రంలో ముఖ్యంగా చెప్పుకోవల్సింది షకీలా (పండు), కాముడు (కత్తి మహేష్) పాత్ర గురించి. ఈ ఇద్దరూ భార్య భర్తలుగా నటించి కామెడీ పీక్స్ చేరేలా చేశారు. చాలా రోజుల తరువాత షకీలాకు తెలుగులో ఓ మంచి పాత్ర పడింది. ఆండ్రాయిడ్ ఎంట్రీ తరువాత ఈ రెండు పాత్రలకు ప్రాధాన్యత పెరిగింది. కత్తి మహేష్ ఫుల్ లెంగ్త్ రోల్ చేశారు. అతని వ్యక్తిగత జీవితాన్ని కూడా కామెడీగా వాడేశాడు దర్శకుడు రొనాల్డ్ సన్.
😎కథనం, మాటలు :
ఈ సినిమాలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది.. కథనం, మాటలు గురించి. ‘హృదయకాలేయం’ సృష్టికర్త స్టీవెన్ శంకర్ ఈ చిత్రాన్ని ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొని సుమారు ఐదేళ్ల పాటు ఈ సినిమాను సొంతంగా నిర్మించారు. వాస్తవానికి ఈ ఐదేళ్లలో కొబ్బరి మట్ట షూటింగ్ జరిగింది 39 రోజులే. అంటే 39 రోజుల్లోనే కొబ్బరి మట్ట చిత్రాన్ని కంప్లీట్ చేశారు. చిన్న సినిమా కథలు రాసేటప్పుడు పాత్రలు ఎంపిక పెద్ద ఛాలెంజ్ లాంటిది. ఎన్ని ఎక్కువ పాత్రలు ఉంటే.. అంత బడ్జెట్ భారం. పైగా షూటింగ్‌కి కూడా కష్టం. అయితే చిత్ర కథకుడు స్టీవెన్ సన్.. ఈ చిన్న చిత్రం ద్వారా పెద్ద ప్రయోగమే చేశారు.
ముజీర్ మాలిక్ కెమెరా పనితనం బాగుంది. కోనసీమ అందాలు దర్శనం ఇస్తాయి. రియలిస్టిక్ లొకేషన్స్‌లో సీన్స్ నేచురల్‌గా అనిపిస్తాయి. సయ్యద్ కమ్రాన్ సాంగ్స్ సందర్భాను సారంగా బాగున్నాయి. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ పర్వలేదు. ఎడిటింగ్ వర్క్ బాగుంది.
😎ఫస్టాఫ్ అనాలిసిస్ :
కొబ్బరి మట్ట తెలుగు సినిమాలోని కథలు, సన్నివేశాలపై విసిరిన విమర్శనాస్త్రం. పెద్దరాయుడు జీవితంలోని ప్రేమానురాగాలు, ఆప్యాయతలను ప్రధాైన అంశంగా కథ సాగుతుంది. బలమైన సన్నివేశాలు, వాటికి తగినట్టుగా డైలాగ్స్ తోడవ్వడంతో హ్యాస్యం తెర మీద బ్రహ్మండంగా పేలిందని చెప్పవచ్చు. సంపూ కోసం రాసిన డైలాగ్స్ ఆలోచింప జేసే విధంగా కాకుండా హాస్యాన్ని పుట్టించడంతో సినిమా సరదాగా సాగిపోతుంది. ప్రతీ ఫ్రేములో కామెడీని భారీగా జోప్పించడంతో సైటరికల్ సినిమాపై ప్రేక్షకులకు మంచి ఫీల్ కలుగజేస్తుంది. ఆండ్రాయిడ్ ఎంట్రీతో మూడున్నర నిమిషాల ఏకధాటి డైలాగ్స్ కేక పుట్టిస్తూ ఇంటెర్వెల్ పడుతుంది.
😎 సెకండాఫ్ అనాలిసిస్ :
ఇక రెండో భాగంలో అండ్రాయుడు పాత్ర, పాపారాయుడు పాత్రలు హైలెట్ కావడంతో సినిమా మరింత రంజుగా సాగుతుంది. ఇక పాపారాయుడు ఫ్లాష్ బాక్ మరింత ఆసక్తిగా సాగుతుంది. చివర్లో వ్యగ్యంగా తీసిన క్లైమాక్స్ కడుపుబ్బా నవ్విస్తుంది. సెకండాఫ్‌లో కూడా డైలాగ్స్ బ్రహ్మండంగా పేలాయి. సెటైరికల్ సెంటిమెంట్ కూడా ఎబ్బెట్టుగా లేకుండా ఆమోదించే విధంగా ఉండటం సినిమాకు ప్రధాన ఆకర్షణగా మారిందని చెప్పవచ్చు. 🔴బలం, బలహీనత
👉పాజిటివ్ పాయింట్స్:
సంపూర్ణేష్ బాబు, కథ, మాటలు, స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫి
👉నెగిటివ్ పాయింట్స్ ; రొటీన్, ఫార్ములాతో ఉండటం.
😎Rating: 3.0/5
🔴చివరి గా :
రెండు గంటల పాటు లాజిక్, మ్యాజిక్ ఆశించకుండా ఇది సంపూర్ణేష్ బాబు సినిమా అని ప్రిపేర్ అయితే హాయిగా ఎంజాయ్ చేయొచ్చు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.