Teluguwonders:
తమిళ సినీ పరిశ్రమ నుంచి వచ్చి తెలుగులో మంచి గుర్తింపు సాధించిన లేడీ కమెడియన్ విద్యుల్లేఖ. రన్ రాజా రన్, రాజు గారి గది, సరైనోడు.. లాంటి సినిమాల్లో ఆమె కామెడీని తెలుగు ప్రేక్షకులు అంత సులువుగా మరిచిపోలేరు. బొద్దయిన ఆమె రూపం.. ఫన్నీగా అనిపించే హావభావాలు.. తమిళ యాసతో సాగే ఆమె డైలాగ్ డెలివరీ.. బాగా కామెడీ జనరేట్ చేస్తుంటాయి. ఐతే ఇప్పుడామె తన అవతారం మార్చేసుకుంది. ఉన్నట్లుండి సన్నబడిపోయింది. గుర్తుపట్టలేని అవతారంలోకి మారిన ఆమె ఫొటో ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఐతే ఈ అవతారంతో విద్యుల్లేఖ కమెడియన్‌గా అవకాశాలు సాధించగలదా అన్నది సందేహం.ఆ మధ్య విద్యుల్లేఖ ఒక హాట్ ఫొటో షూట్ చేస్తే.. ఇంత లావుగా ఉండి ఆ వేషాలేంటి అంటూ కొందరు ఆమెను ట్రోల్ చేశారు.
ఐతే లావుగా ఉంటే గ్లామర్ ఫొటో షూట్లు చేయకూడదా అంటూ ఆమె ప్రశ్నించింది. దీన్నో పెద్ద చర్చగా మార్చింది. మరోవైపు తన క్యారెక్టర్లన్నీ బాడీ షేమింగ్ చుట్టూనే తిరగడం పట్ల ఓ సందర్భంలో విద్యుల్లేఖ అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనిపై ఓ నెటిజన్ ప్రశ్నిస్తే..
తనకు ఇష్టం లేకపోయినా అవే పాత్రలు వస్తుండటంతో చేయక తప్పట్లేదని.. కొందరు దర్శకులు మాత్రం తన రూపంతో సంబంధం లేకుండా క్యారెక్టర్లు డిజైన్ చేసి నవ్వించారని పేర్కొంది. ఈ రెండు ఉదంతాల నేపథ్యంలో ఇప్పుడు విద్యుల్లేఖ తనను ఇంకెవరూ బాడీ షేమింగ్ చేయకూడదనే ఉద్దేశంతోనే బరువు తగ్గినట్లుంది. కానీ విద్యుల్లేఖ కామెడీనే ఆమె బొద్దుతనంతో ముడిపడి సాగిన నేపథ్యంలో మామూలు అమ్మాయిల్లా మారిన ఆమెకు ఫిలిం మేకర్స్ ఏమేరకు అవకాశాలిస్తారో చూడాలి.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.