కెరీర్ మరింత దెబ్బతినేలా వ్యాఖ్యలు చేసిన లావణ్య త్రిపాఠి ..

Lavanya Tripathi comments
Spread the love

Teluguwonders:

తన సినిమాలేవో తాను చేసుకోక అనవసరంగా రాజకీయాల్లో వేలు పెట్టాలనుకున్నారు.
సినీ నటి లావణ్య త్రిపాఠి.. . కులం గురించి ప్రస్తావిస్తూ వివాదాస్పద ట్వీట్ చేశారు. ఆ తర్వాత ఎందుకొచ్చిన గొడవ అని భావించి వెంటనే ట్వీట్‌ను తొలగించారు.ఈ లోపు జరగాల్సిన డామేజ్ జరిగిపోయింది .కులమతాల గురించి ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం ఉంటుంది. వాటి గురించి అందరూ మాట్లాడతారు. కానీ సెలబ్రిటీలు మాత్రం ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఏమాత్రం తేడా వచ్చినా అది వారి కెరీర్‌పై ప్రభావం చూపుతుంది.

ఆవిడ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను ఉద్దేశిస్తూ వివాదాస్పద ట్వీట్ చేసి నాలుక్కర్చుకున్నారు. వివరాల్లోకెళితే..

💥స్పీకర్‌పై లావణ్య త్రిపాఠి వ్యాఖ్యలు..:

రాజస్థాన్‌లోని కోటా ప్రాంతంలో అఖిల బ్రాహ్మణ్ మహా సభను ఏర్పాటుచేశారు. ఈ సభకు ఓం బిర్లా వెళ్లారు. అక్కడ దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆయన ఓ ట్వీట్ చేశారు. ‘సమాజంలో బ్రాహ్మణులకు ఉన్నత స్థానం ఉంది. బ్రాహ్మణుల త్యాగం వల్లే ఈరోజు ఈ సభ ఏర్పాటైంది. అందుకే బ్రాహ్మణ సంఘం అందరికీ మార్గదర్శకంగా నిలుస్తోంది’ అని పేర్కొన్నారు. ఈ ట్వీట్‌పై లావణ్య స్పందిస్తూ.. ‘ఓ బ్రాహ్మణ అమ్మాయిగా ఈ కులం వారికి సమాజంలో ఎందుకింత అధమ స్థానం ఉందో నాకు అర్థం కావడంలేదు. మనం చేసే పనులు మన స్థాయిని తెలియజేస్తాయి కానీ కులం కాదు’ అని పేర్కొన్నారు.

👉ట్వీట్ తొలగింపు :

అయితే అవసరంగా కులం గురించి ప్రస్తావించి వివాదాల పాలవడం ఎందుకని అనుకున్నారో ఏమో ట్వీట్ చేసిన కొద్ది నిమిషాల్లోనే దానిని డిలీట్ చేశారు. అయితే అప్పటికే అది లైవ్‌ అయిపోవడంతో కొందరు నెటిజన్లు స్క్రీన్ షాట్లు తీసి షేర్ చేశారు. దాంతో లావణ్య వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అసలే లావణ్యకు కెరీర్ అంత సజావుగా సాగడంలేదు. ఆమె చేతిలో పెద్దగా హిట్ అయిన సినిమాలూ లేవు. దాదాపు ఏడాదిగా ‘అర్జున్ సురవరం’ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఎప్పుడు సినిమా విడుదల చేద్దామన్నా ఏవో ఒక అవాంతరాలు వస్తున్నాయి. దాంతో నిఖిల్‌కు జోడీగా నటిస్తున్న ‘అర్జున్ సురవరం’ సినిమా విడుదలకు నోచుకోలేకపోతోంది. అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకుంటే ఏం జరుగుతుందో ఈపాటికి సినీ నటి లావణ్య త్రిపాఠికి తెలిసొచ్చి ఉంటుంది. 👉మరి ఈ అందాల రాక్షసి కెరీర్ ఎప్పుడు మారుతుందో..


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading