Latest

    లీసా మూవీ review ; 3D లో భయపెట్టిన అంజలి

    దక్షిణాదిలో హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తూ అందం, అభినయం,సోలో ఫెర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకుడిని థియేటర్‌కు రప్పించే కథానాయికల్లో అంజలి ఒకరు. గీతాంజలి, చిత్రాంగద సినిమాలు ఆమె నటనా ప్రతిభకు అద్దం పట్టాయి. మళ్లీ సోలో హీరోయిన్‌గా లీసా చిత్రంతో అంజలి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిర్మాత సురేష్ కొండేటి రూపొందించిన ఈ చిత్రం హారర్ జోనర్‌తోపాటు 3 డీ టెక్నాలజీతో రావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. లీసా చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా? అంజలి ఫెర్ఫార్మెన్స్ సినిమాకు విజయం చేకూర్చిందా అని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

    🎃కథ ;

    లీసా (అంజలి) అమెరికాలో చదువు కోసం వెళ్లాలన్ని ప్రయత్నిస్తుంటారు. తండ్రి చిన్నతనంలో చనిపోవడంతో తల్లిని ఒంటరిగా వదిలి వెళ్లడానికి ఇష్టపడదు. అయితే మధ్య వయసులో ఉండే తల్లిని పెళ్లి చేసుకోమని వెంటపడి ఒప్పిస్తుంది. పేరేంట్స్‌‌ ఇష్టానికి వ్యతిరేకంగా తన తల్లి పెళ్లి చేసుకోవడంతో వారికి దూరమవుతుంది. వారిని కూడా ఒప్పించి పెళ్లి చేయాలనే ప్లాన్‌తో తన అమ్మమ్మ, తాత వద్దకు వెళ్తుంది. అక్కడికి వెళ్లిన లీసాకు భయంకర నిజాలు తెలుస్తాయి.

    💀ట్విస్టులు ;

    అమ్మమ్మ, తాతను కలిసే ప్రయత్నంలో లీసాకు ఎదురైన సమస్యలు ఎంటీ? తన తల్లికి పెళ్లి చేయడంలో సఫలమైందా? అమ్మమ్మ ఊర్లో లీసాకు తెలిసిన భయంకరమైన విషయాలు ఏమిటి? ఈ కథలో డీజే (మకరంద్ దేశ్ పాండే) రోల్ ఏమిటి? బ్రహ్మనందం, యోగిబాబు పాత్రలు ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే లీసా స్టోరి.

    💀ఫస్టాఫ్‌ :

    తన తల్లికి పెళ్లి చేయడానికి తాత, అమ్మమ్మలను ఒప్పించేందుకు ఓ యువతి ప్రయత్నించడమనే సింగిల్ పాయింట్ ఈ సినిమా కథ. కథ ఫీల్‌గుడ్ నోట్‌లో ప్రారంభమై.. హారర్ జోనర్‌లోకి వెళ్తుంది. అమ్మమ్మ ఊరికి వెళుతూ తన ఫ్రెండ్ (సామ్ జోన్స్)ను వెంట తీసుకెళ్లడం ఎందుకో అర్థం కాదు. కనీసం బాయ్‌ ఫ్రెండ్ అయినా బాగుండేదేమో అనిపిస్తుంది. తొలి భాగంలో కొన్ని ప్రేక్షకుడిని థ్రిల్ చేసే విధంగా సన్నివేశాలు ఉండటంతో సరదాగా సినిమా సాగిపోతుంది. తాను కలిసిన వ్యక్తులు తాత, అమ్మమ్మ కాదని తెలియడం తొలిభాగంలో ట్విస్ట్.

    💀సెకండాఫ్‌ :

    ఇక రెండో భాగంలో తాత, అమ్మమ్మగా భ్రమింప జేసిన ఇద్దరు ఎవరు? తన తాత, అమ్మమ్మలు ఏమయ్యారనే పాయింట్లతో సినిమా కొంత ఆసక్తికరంగా మారుతుంది. క్లైమాక్స్‌లో కొన్ని విషయాలు రివీల్ కావడం సినిమా మరింత ఆసక్తికరంగా మారుతుంది. చివర్లో భావోద్వేగానికి గురిచేసే కంటెంట్‌తో సినిమా మరో లెవెల్‌కు వెళ్లుంది. అత్యంత ఎమోషనల్‌గా ఉండే కథను మరింత బాగా చెప్పడానికి అవకాశం ఉన్నా ఆ ప్రయత్నం చేయలేదని చిన్న అసంతృప్తి కలుగుతుంది. కాకపోతే హారర్ జోనర్‌లో సెంటిమెంట్‌ను జొప్పిచడం, 3డీలో స్పెషల్ ఎఫెక్ట్స్ ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయి.

    💀దర్శకత్వం :

    దర్శకుడు రాజు విశ్వనాథ్ ఎంచుకొన్న పాయింట్ బాగుంది. కాకపోతే మరింత కసరత్తు చేయాల్సి ఉండేదేమో అనే ఫిలింగ్ కలుగుతుంది. సాంకేతిక అంశాలను చూస్తే దర్శకుడి ప్రతిభ అర్ధమైపోతుంది. కథలోని ఫీల్‌గుడ్ ఫ్యాక్టర్లను బలమైన సన్నివేశాలుగా మార్చలేకపోయారనే కొంత ఫీలింగ్ కలుగుతుంది. కానీ తన బడ్జెట్ పరిమితుల్లో చిన్న నటుల నుంచి రాబట్టుకొన్న నటన, టెక్నికల్ అంశాలు సినిమాకు మరింత ప్లస్ అయ్యాయి. సినిమా చూసినంత సేపు ఎక్కడా బోర్ లేకుండా ఏం జరుగుతుందో అనే ఆసక్తిని రేకేత్తించాడని చెప్పవచ్చు.

    🎃అంజలి ఫెర్ఫార్మెన్స్ ;

    అంజలి ఫెర్మార్మెన్స్‌తో మరోసారి ఆకట్టుకొన్నది. లీసాగా పాత్రలో ఒదిగిపోయింది. తొలి భాగంలో అందంతో ఆకట్టుకోగా, రెండో భాగంలో అభినయం, ఎమోషనల్ అంశాలతో అలరించింది. సోలోగా సినిమాను నిలబెట్టే సామర్థ్యం ఉందనే అంశాన్ని మరోసారి అంజలి గుర్తు చేసింది. పాటలకు, గ్లామర్‌ను పండించడానికి పెద్దగా స్కోప్ లేకపోయింది.

    💀మిగితా నటీనటుల్లో ;

    మిగితా పాత్రల్లో మకరంద్ దేశ్ పాండే నటన బాగుంది. సెకండాఫ్‌లో ఎమోషనల్‌గా ఆయన నటన సినిమాకు ప్లస్ అయింది. బ్రహ్మానందం, యోగిబాబు, ఇతర జబర్దస్త్ నటుల కామెడీ ఒకేలా ఉంది. కామెడీ రొటీన్‌గా అనిపించింది. అంజలి తల్లిగా, అమ్మమగా నటించిన ఇద్దరూ ఓకే అనిపించారు. సురేఖా వాణి పెద్దగా ప్రాధాన్యం లేని పాత్రలో కనిపించింది.

    💀సాంకేతిక విభాగం ;

    సాంకేతిక విభాగాల్లో సినిమాటోగ్రఫి, రీరికార్డింగ్ అంశాలు సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. 3డీ ఎఫెక్ట్స్ బాగున్నాయి. సింపుల్‌గా హారర్ ఎఫెక్ట్స్ సూపర్‌గా అనిపిస్తాయి. కథ డిమాండ్ మేరకు 3డీ టెక్నాలజీని చాలా బ్యాలెన్స్‌గా ఉపయోగించారు. హారర్ జోనర్‌లో 3డీ ఎఫెక్ట్స్ కొత్తగా అనిపిస్తాయి. సన్నివేశాలకు తోడుగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరింత ప్లస్ అయింది. ఎడిటింగ్ విభాగం పనితీరు బాగుంది.

    💀ప్రొడక్షన్ వ్యాల్యూస్ :

    లీసా మూవీకి తెలుగులో సురేష్ కొండేటి నిర్మాతగా వ్యవహరించాడు. జర్నీ, షాపింగ్ మాల్, ప్రేమిస్తే లాంటి సినిమాలను బ్లాక్ బస్టర్లుగా మలిచిన ఆయన మరోసారి లీసాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. తమిళ రీమేక్ అనే భావన లేకుండా తెలుగు స్ట్రెయిట్ చిత్రమనే విధంగా జాగ్రత్తలు తీసుకొన్నారు. బీ, సీ సెంటర్లకు ఈ సినిమా చేరువైతే సురేష్ కొండేటి ఖాతాలో మరో విజయం చేరడానికి అవకాశం ఉంటుంది.

    💀ఫైనల్‌గా ;

    హారర్ సినిమాలు అంటే దెయ్యాలు, అనవసరపు సౌండ్ పొల్యూషన్ ఉంటుందనే ప్రేక్షకుల వాదన. కానీ ఈ సినిమా అలాంటి అంశాలకు దూరంగా అత్యంత భావోద్వేగమైన పాయింట్‌తో రూపొందింది. ఫ్యామిలీ ఎలిమెంట్స్‌తోపాటు హారర్ అంశాలను చక్కగా కలగలిపి రూపొందించారు. మల్టీప్లెక్ష్ ఆడియెన్స్ పక్కన పెడితే, దిగువ తరగతి ప్రేక్షకుల ఆదరణపైనే ఈ సక్సెస్ రేంజ్ ఆధారపడి ఉంటుంది.

    💀ప్లస్ పాయింట్స్ ;

    అంజలి

    ఎమోషనల్ స్టోరి

    మేకింగ్

    సెకండాఫ్

    💀మైనస్ పాయింట్స్ ;

    రెగ్యులర్ కామెడీ

    రొమాన్స్ ఎలిమెంట్స్ లేకపోవడం

    💀 : నటీనటులు, సాంకేతికవర్గం

    నటీనటులు: అంజలి, మకరంద్ దేశ్‌పాండే, బ్రహ్మానందం, యోగిబాబు, సామ్ జోన్స్, సురేఖా వాణి తదితరులు

    దర్శకత్వం: రాజు విశ్వనాథ్

    నిర్మాత: సురేష్ కొండేటి

    మ్యూజిక్: సంతోష్ దయానిధి

    సినిమాటోగ్రఫి: పీజీ ముత్తయ్య

    ఎడిటింగ్: ఎస్ఎన్ ఫాజిల్

    బ్యానర్: ఎస్‌కే ఎంటర్‌టైన్‌మెంట్

    2019-05-24

    Rating 2.5/5

    . ఈ సినిమా సాధారణ హార్రర్ అంశాలకు దూరంగా అత్యంత భావోద్వేగమైన పాయింట్‌తో రూపొందిన స్పెషల్ మూవీ..


    Discover more from Telugu Wonders

    Subscribe to get the latest posts sent to your email.

    Leave a Reply

    Discover more from Telugu Wonders

    Subscribe now to keep reading and get access to the full archive.

    Continue reading