Latest

    Madame Tussauds:లో.. అతిలోక సుందరి మైనపు బొమ్మ

    Madame Tussauds atiloka sundari sridevi wax statue

    Teluguwonders:

    ప్రమాదవశాత్తు బాత్‌టబ్‌లో పడి చనిపోయి కోట్లాది మందిని శోకసంద్రంలోకి నెట్టారు అతిలోక సుందరి శ్రీదేవి. ఆమె అభిమానుల హృదయాల్లో చిరకాలం నిలిచిపోవాలన్న ఆశతో బోనీ కపూర్ మైనపు విగ్రహాన్ని తయారు చేయించారు.

    💚శ్రీదేవి మైనపు విగ్రహం :

    అలనాటి తార శ్రీదేవి మైనపు విగ్రహం రాబోతోంది. శ్రీదేవి పుట్టినరోజు రాబోతున్న నేపథ్యంలో ఆమె భర్త బోనీ కపూర్ సోషల్ మీడియాలో విగ్రహానికి సంబంధించిన వీడియోను అభిమానులతో పంచుకున్నారు.

    సింగపూర్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం శ్రీదేవి బొమ్మను రూపొందించింది. ఈ నేపథ్యంలో బోనీ ట్విటర్‌లో శ్రీదేవి మైనపు బొమ్మను రూపొందిస్తున్నప్పుడు తీసిన వీడియోను అభిమానులతో పంచుకున్నారు.

    ‘శ్రీదేవి మా హృదయాల్లోనే కాదు కోట్లాది మంది అభిమానుల హృదయాల్లోనూ చిరకాలం నిలిచిపోతారు. సింగపూర్‌లోని మేడమ్ టుస్సాడ్స్‌లో శ్రీదేవి మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. మేమంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాం’ అని పేర్కొంటూ వీడియోను షేర్ చేశారు. వేడుకకు హాజరయ్యేందుకు బోనీ తన ఇద్దరు కుమార్తెలు జాన్వి, ఖుషీతో కలిసి సింగపూర్‌కు బయలుదేరారు.

    💥శ్రీదేవి కోరిక మేరకు అజిత్‌తో :

    శ్రీదేవి కోరిక మేరకు బోనీ కపూర్.. అజిత్‌తో తమిళంలో ‘నేర్కొండ పార్వాయ్’ సినిమాను నిర్మించారు. శ్రీదేవి నటించిన ‘ఇంగ్లిష్ వింగ్లిష్’ సినిమాలో అజిత్ అతిథి పాత్రలో మెరిశారు. ఆయనతో కలిసి సినిమా తీయాలని అప్పుడే శ్రీదేవి నిర్ణయించకున్నారు. కానీ ఆమె లేకుండా అజిత్‌తో కలిసి పనిచేయాల్సి వస్తుందని బోనీ కలలో కూడా ఊహించి ఉండరు.

    🔴‘శ్రీదేవి బంగ్లా’ వివాదం :

    కాగా..‘శ్రీదేవి బంగ్లా’ పేరుతో బాలీవుడ్‌లో ఓ సినిమా రాబోతోంది. మలయాళ భామ ప్రియా ప్రకాశ్ వారియర్ ఇందులో టైటిల్ పాత్రను పోషిస్తున్నారు. అయితే టైటిల్‌‌లో శ్రీదేవి పేరు ఉండటం, సినిమా పోస్టర్‌ను శ్రీదేవి బాత్‌టబ్‌లో పడిపోయి చనిపోవడంలాగే డిజైన్ చేయడంతో సినిమా వివాదంలో చిక్కుకుంది. . .‘శ్రీదేవి బంగ్లా’ సినిమాను నిలిపివేసేలా న్యాయస్థానంలో పిటిషన్‌ను దాఖలు చేయాలని బోనీ నిర్ణయించుకున్నారు.గతం లో ఈ సినిమా టైటిల్ మార్చాలని ,లేకపోతే కోర్టు వరకు వెళ్లాల్సి ఉంటుందని బోనీ కపూర్ సదరు చిత్రవర్గాలకు నోటీసులు జారీ చేశారు.

    👉తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఎన్నో చిత్రాల్లో నటించిన శ్రీదేవి 2018 ఫిబ్రవరి 24న దుబాయ్‌లోని ఓ హోటల్ బాత్‌టబ్‌లో ప్రమాదవశాత్తు పడి మృతిచెందారు. ఆమె మృతిని ఇప్పటికీ కుటుంబీకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆమె చివరిగా ‘మామ్’ చిత్రంలో నటించారు. బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుక్ ఖాన్ నటించిన ‘జీరో’ చిత్రంలో అతిథి పాత్రలో మెరిశారు.


    Discover more from Telugu Wonders

    Subscribe to get the latest posts sent to your email.

    Leave a Reply

    Discover more from Telugu Wonders

    Subscribe now to keep reading and get access to the full archive.

    Continue reading