Teluguwonders:
August 9న మహేశ్‌బాబు birth day :
ఈ సందర్భం గా ఆయన తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ ఇంట్రో వీడియోను యూనిట్ విడుదల చేసింది. మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో ఆయన లుక్ అదిరిపోయేలా ఉంది. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు.
💥మహేశ్ 26th ‘సరిలేరు నీకెవ్వరు’ :
శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి హ్యాట్రిక్ విజయాల తర్వాత సూపర్‌స్టార్ మహేశ్‌బాబు నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. మహేశ్ కెరీర్లో 26వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పటాస్, సుప్రీమ్, రాజా దిగ్రేట్, F2.. నాలుగు చిత్రాలు బ్లాక్ బస్టర్‌లు చేసిన అనిల్‌కు మహేశ్‌ను డైరెక్ట్ చేసే గోల్డెన్ ఛాన్స్ దక్కింది‘దాంతో డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సినిమా కి దర్శకత్వం వహిస్తున్నాడు. జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీవెంకటేశ్వరా క్రియేషన్స్, ఏకే ఎంటర్‌టైన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. . ఈ సినిమాలో రష్మిక మందనా, అదితీ రావు హైదరీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు.
💥 సరిలేరు నీకెవ్వరూ..అనే సాంగ్ తో :
ఆర్మీ నేపథ్యంలో తెరకెక్కతున్న ఈ చిత్రంలో మహేశ్ మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో కనిపించనున్నారు. మహేశ్‌బాబు పుట్టినరోజు సందర్భంగా ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్ర యూనిట్ ఇంట్రో వీడియో విడుదల చేసింది. మేజర్ పాత్రలో మహేశ్ అదిరిపోయే లుక్‌లో ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఇంట్రోనే ఇలా ఉంటే సినిమా అదిరిపోతుందని ప్రిన్స్ అభిమానులు అప్పుడే ఉబ్బితబ్బిబైపోతున్నారు. మేజర్ పాత్రలో మహేశ్‌బాబు ఎలా ఉన్నారో మీరూ ఓసారి చూడండి…
ఈ చిత్రాన్ని 2020 సంక్రాంతి కానుకగా తీసుకొచ్చేందుకు యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.