Teluguwonders:
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ప్రతిష్టాత్మకమైన 151వ సినిమా సైరా. కర్నూలు జిల్లాకు చెందిన
ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు సైరా నరసింహారెడ్డి చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. కొణిదెల ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై చిరు తనయుడు మెగాపవర్స్టార్ రామ్చరణ్ స్వయంగా రూ.200 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మిస్తోన్న ఈ సినిమాకు సురేందర్రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సినిమా గురించి కీలకమైన అప్డేట్లు లేకపోవడంతో డిజప్పాయింట్లో ఉన్న మెగా అభిమానులు సినిమా మేకర్స్ సడెన్ సర్ఫ్రైజ్ ఇచ్చేశారు. బుధవారం మధ్యాహ్నం సైరా మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. మేకింగ్ వీడియో ఊహలకు మించిపోయి ఉండడంతో మెగా సంబరాలకు అంతే లేకుండా పోయింది.
మేకింగ్ వీడియోలోనే ఈ రేంజ్లో చూపిస్తే. ఇక సినిమా ఇంకెలా ఉంటుందో అని మరింతగా ఊహల్లో తేలిపోతున్నారు. ఈ మేకింగ్ వీడియో అలా రిలీజ్ అయ్యిందో లేదో మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఈ వీడియో రిలీజ్ చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. సైరా అక్టోబర్ 2న రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే.
ఇక 1.47 నిమిషాల పాటు ఉన్న మేకింగ్ వీడియో చూసేందుకు రెండు కళ్లు చాలవన్నట్టుగా ఉంది. మేకింగ్ వీడియో అంతా ఎక్కువుగా యాక్షన్ పార్ట్తో నింపేశారు. సినిమాలో ఉన్న ప్రముఖ నటీనటులతో పాటు సినిమాకు పనిచేసిన ప్రతి కీలక టెక్నీషియన్ను మేకింగ్ వీడియోలో చూపించారు. ఈ వీడియోను వరల్డ్ ఆఫ్ సైరాగా పేర్కొన్నారు. అమితాబ్కు పవర్స్టార్ నమస్కరిస్తున్న విజువల్ కూడా చూపించారు.
ఇక వీడియోలో ప్రతి ఒక్క పాత్ర లుక్ చూపించారు. అమితాబచ్చన్, విజయ్ సేతుపతి, కిచ్చ సుదీప్, నయనతార, తమన్నా, జగపతిబాబు, రవికిషన్, నిహారిక కనిపిస్తారు. అందరికంటే చివరిగా నిర్మాత రామ్చరణ్ స్టైలీష్ లుక్తో పాటు దర్శకుడు సురేందర్రెడ్డి యాక్షన్ చెప్పడం ఉంటుంది. ఇక వీడియో చివర్లో చిరు భీకరమైన యాక్షన్ షాట్లు చూపించారు. చివర్లో సినిమా టీజర్ను కూడా ఈ నెల 20న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.