Teluguwonders:
నటీనటులు: నాగార్జున, రకుల్‌ప్రీత్‌సింగ్, వెన్నెల కిషోర్, లక్ష్మీ, ఝాన్సీ, రావు రమేష్ తదితరులు
సినిమాటోగ్రపీ: సుకుమార్
మ్యూజిక్: చైతన్ భరద్వాజ్
నిర్మాతలు: నాగార్జున అక్కినేని. పి.కిరణ్
దర్శకత్వం: రాహుల్ రవీంద్రన్
సెన్సార్ రిపోర్ట్: యూ / ఏ
రన్ టైం: 155 నిమిషాలు
రిలీజ్ డేట్: 9 ఆగస్టు, 2019
నాగార్జున, రకుల్‌ప్రీత్‌సింగ్ హీరోహీరోయిన్లుగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందించిన సినిమా మన్మథుడు 2. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి ప్రేక్షకుల్లో.. ఏదో తెలియని ఆతృత నెలకొంది. దానికి తగ్గట్టుగానే.. సినిమా ట్రైలర్లు, పాటలు వచ్చాయి. దీంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.
ఇక ఇందులో ప్రధానంగా.. నాగ్‌తో రకుల్ రొమాన్స్ ఎలా ఉంటుందోనని యూత్ కూడా బాగా ఎదురుచూశారు. ఈ క్రమంలో శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన మన్మథుడు 2 సినిమా ప్రేక్షకుల అంచనాలను ఏమేరకు అందుకుందో TJ సమీక్షలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
కథేమిటంటే.
సామ్( నాగార్జున) ప్రేమలో విఫలం అవుతాడు. ఇక అప్పటి నుంచి ప్లే బాయ్‌లా మారి.. ఆడపిల్లలను ఆటపట్టిస్తూ ఉంటాడు. మరోవైపు కుటుంబ సభ్యులు సామ్ విషయంలో ఆందోళన చెందుతుంటారు. వయసు పెరుగుతుందని, తొందరగా పెళ్లి చేయాలని చూస్తుంటారు. ఎలాగోలా.. ఓ పెళ్లి సంబంధం చూస్తారు. అయితే.. ఈ పెళ్లి చెడగొట్టేందుకు అవంతిక(రకుల్‌ప్రీత్‌సింగ్)ను తన ప్రియురాలిగా నటించమని ఒప్పందం చేసుకుంటాడు. ఇక ఆ తర్వాత.. ఆ పెళ్లిని ఎలా చెడగొడుతారు..? ఆ తర్వాత సామ్, అవంతికల మధ్య ఏం జరుగుతుంది..? ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు..? అన్నది మాత్రం తెరపైనే చూడాలి మరి.
ఎలా ఉందంటే.
టాలీవుడ్‌లో మన్మథుడు సినిమాను ఎప్పడు చూసినా కొత్తగానే అనిపిస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రతీ సన్నివేశం ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. దానికి ఈసీక్వెల్‌గానే మన్మథుడు 2 సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు రాహుల్ రవీంద్రన్. ప్రేక్షకులు కూడా అంతే ఆతృతగా ఈసినిమా కోసం ఎదురుచూశారు. అయితే.. ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా.. దర్శకుడు అన్నిజాగ్రత్తలు తీసుకున్నాడనే చెప్పొచ్చు. ఈ సినిమాలో మొదటి భాగం, రెండో భాగం అనే తేడా ఏమీ కనిపించదు.. కథంతా హాస్యం, భావోద్వేగాల కలయిగా సాగిపోతుంది.
సినిమా చివరలో నాగ్, రకుల్ మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ హైలెట్‌గా నిలుస్తాయి. కాకపోతే.. కొంచెం అక్కడక్కడ బాలెన్సింగ్ తప్పినట్లు అనిపిస్తుంది. హాస్య ప్రేమకులు అయితే.. పండుగచేసుకోవచ్చు. ఓవరాల్‌గా సినిమా అంతా టోటల్‌గా ఎంటర్‌టైన్‌మెంట్ బేస్‌గానే నడుస్తోంది. ఫస్టాఫ్‌లో కామెడీ బాగా ఆకట్టుకున్నా సెకండాఫ్‌లో మాత్రం హీరో, హీరోయిన్ పాత్రలకు బలమైన సన్నివేశాలు లేవు. నాగార్జున క్యారెక్టర్ ఆయన వయస్సుకు తగినట్టుగా ఉండదు. ఓవరాల్‌గా కామెడీ పార్ట్ వరకు మెప్పించినా మిగిలిన అంశాల విషయంలో దర్శకుడు అంత శ్రద్ధ పెట్టలేదనిపిస్తుంది
ప్లస్‌లు (+) :
– నాగ్ మరియు వెన్నెల కిషోర్ మధ్య ఫన్ ట్రాక్
– ఎంటర్‌టైన్‌మెంట్
– సినిమాటోగ్రఫీ
– రకుల్ నటన
మైనస్‌లు (-):
– సెకండాఫ్ లో అక్కడక్కడా తడబాటు
– అంతగా మెప్పించని పాటలు
ఫైనల్ పంచ్ :
మన్మథుడు 2 ఓన్లీ ఫర్ ఎంటర్‌టైన్‌మెంట్
మన్మథుడు 2 TJ రేటింగ్ : 2.75 / 5
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.