Teluguwonders:
రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కీన చిత్రం ‘మన్మధుడు 2’. ఆగస్టు 9న విడుదలైన ఈచిత్రం డివైడ్ టాక్ సొంతం చేసుకుంది. ఆదివారం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో నాగార్జున మాట్లాడుతూ ఈ చిత్రాన్ని ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయడానికి సమయం పడుతుంది అన్నారు.
💞మన్మధుడు 2 :
మన్మధుడు 2 చిత్రానికి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు. ఫ్రెంచిలో వచ్చిన ఓ సినిమాకు ఇది రీమేక్. నాగార్జున సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. సమంత, కీర్తి సురేష్, అక్షర గౌడ అతిథి పాత్రల్లో నటించారు.
🔴కొత్తగా చేయాలని :
నా కెరియర్ మొత్తం కూడా కొత్తదనం, రీ ఇన్వెంటింగ్ లాంటి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను. ఒకే రకమైన సేమ్ సినిమాలు చేయడం నాకు నచ్చట్లేదు, యూత్‌కు కూడా నచ్చడం లేదు. 👉ఏదైనా కొత్తగా చేయాలని అప్పట్లో తొలిసారి గీతాంజలి కొత్తగా ట్రై చేశాం. అది కల్ట్ క్లాసిక్ మూవీగా నిలిచిపోయిది. ఆ సినిమా రిలీజ్ అయినపుడు వెంటనే ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయలేదు. కొంత టైమ్ తీసుకున్నారని నాగార్జున గుర్తు చేసుకున్నారు.
🔴 అన్నమయ్య సినిమా సమయంలో కూడా అంతే…:
అన్నమయ్య సినిమా సమయంలో ఇలాగే… ‘నిర్ణయం’ అనే సినిమా సమయంలో కూడా ఇదే జరిగింది. ‘అన్నమయ్య’ మూవీ అప్పట్లో 8వ రోజో, 9వ రోజో కంప్లీట్ టెర్మినేషన్‌కు వచ్చేసింది. చాలా చోట్ల షేర్ రాక, థియేటర్ల రెంటు కూడా కట్టలేని పరిస్థితి. అదే సమయంలో ఓ టూర్ వెళితే బావుంటుందని భావించాం. అయితే అది కూడా పెద్దగా పని చేయలేదు. ఊహించని విధంగా 11వ రోజు ఏం జరిగిందో తెలియదు మ్యాట్నీ నుంచి అన్ని చోట్ల హౌస్ ఫుల్ కలెక్షన్స్ వచ్చాయి. ప్రజలు యాక్సెప్ట్ చేశారు. ‘మన్మధుడు 2′ సినిమాను ఆ సినిమాలతో కంపేర్ చేయడానికి ఇదంతా చెప్పడం లేదు. అలా కంపేర్ చేయడం తప్పు. ఆ సమయంలో ఏం జరిగిందో చెప్పే ప్రయత్నం మాత్రమే అని నాగార్జున తెలిపారు.
🔴అలా రాయొద్దు :
మిమ్మల్ని బెగ్ చేస్తున్నాను, అలా రాయొద్దు గతంలో వచ్చిన మన్మధుడు సినిమా కూడా కొత్తరకం మూవీ కావడంతో కొత్తరకం స్క్రీన్ ప్లే, పంచ్ డైలాగులు ప్రేక్షకులకు ఎక్కడానికి సమయం పట్టింది. దీన్ని మరోరకంగా రాయొద్దు. నాగార్జున ఈ చిత్రాన్ని ఒరిజినల్ మన్మధుడుతో కంపేర్ చేస్తున్నాడని దయచేసి భావించవద్దు. ఈ విషయంలో మిమ్మల్ని బెగ్ చేస్తున్నాను.
👉‘మన్మధుడు 2′ తప్పుకండా ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారని నమ్ముతున్నాను అన్నారు. ఫైనల్‌గా ఎవరైనా చూసేది వసూళ్లే. నంబర్స్ బావుంటేనే నేను ఇంకో సినిమా చేయగలను, ముందుకు వెళ్లగను. ప్రొడ్యూసర్ కూడా ఇంకో సినిమా చేయగలడు. ఆ నెంబర్స్ బావున్నాయి. చాలా హ్యాపీగా ఉందని నాగార్జున స్పష్టం చేశారు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.