నాని కి పెరిగిన మార్కెట్ రేంజ్ :మంచి బిజినెస్ చేసిన గ్యాంగ్ లీడర్

Nani's Market Range Increased :Gang Leader

Teluguwonders:

నేచురల్ స్టార్ నానీ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ నానిస్ గ్యాంగ్‌లీడర్. విక్రమ్.కె.కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకులముందుకు రాబోతుంది. నానిస్ గ్యాంగ్‌లీడర్ సినిమాకి టీజర్ అండ్ ట్రైలర్‌తోనే సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ అయ్యింది. అదే ఇంప్రెషన్ ఇప్పుడు ఈ సినిమాపై బిజినెస్‌పై కూడా రిఫ్లెక్ట్ అయ్యింది.
ఇప్పటివరకు నానీ సినిమా అంటే పాతికోట్లవరకు సేఫ్ బెట్. ఎందుకంటే నానీ కెరీర్‌లో చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సినిమా జెర్సీ సినిమా రైట్స్ కేవలం 26 కోట్లకు అమ్మారు. కానీ గ్యాంగ్‌లీడర్ ని ప్రొడ్యూస్ చేసిన మైత్రి మూవీ మేకర్స్ ఆ సినిమాని కాస్త లావిష్ గా తెరకెక్కించింది. దానికి తోడు ఈ సినిమాలో కొన్ని సీన్స్ రీ‌షూట్ చెయ్యాల్సి వచ్చింది. అందుకే అనుకున్నదానికంటే బడ్జెట్ కాస్త ఎక్కువే అయ్యింది. అందుకే ఈ సినిమా వరల్డ్ వైడ్ రైట్స్‌కి కాస్త ఎక్కువ రేట్ కోట్ చేసారు ఈ సినిమా ప్రొడ్యూసర్స్. నానికి ఉన్న మార్కెట్‌తో పాటు ఈ సినిమాకి విక్రమ్.కె.కుమార్ డైరెక్టర్ అవడంతో చెప్పినరేట్లకి తీసుకున్నారు అంతా.

🔴నానీ తో సినిమా అంటే మినిమమ్ గ్యారంటీ:

నానీ సినిమా అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కి ఫస్ట్ అండ్ బెస్ట్ ఛాయస్.అలా అందరికి కనెక్ట్ అయిన నాని నటించిన నానీస్ గ్యాంగ్ లీడర్ సినిమాకి మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.ఈ సినిమాకి అన్ని ఏరియాల్లో కూడా మంచి రేటు దక్కిందనే చెప్పుకోవాలి. పెన్సిల్ పార్ధసారథి పాత్రలో నానీ నటన, అతనిలోని ఆ సెటిల్ కామెడీ టైమింగ్ ఉంటే సినిమా మినిమమ్ గ్యారంటీ. జెర్సీలో అవేమీలేకపోవడం వల్లే మంచి సినిమా అయ్యుండి కూడా అనుకున్న రేంజ్ లో హిట్ కాలేదు. ఈ సినిమాకి ఆ ప్రాబ్లెమ్ లేదు.
అయితే ఇప్పటివరకు ఈ సినిమా సెన్సార్ కాకపోవడంతో ఆ సినిమా టీమ్ కాస్త టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తుంది. విక్రమ్.కె.కుమార్ కి ఈ లాస్ట్ మినిట్ టెన్షన్ అలవాటే అనే టాక్ ఉంది. ఇక ఈ సినిమాలో లక్ష్మి ఒక కీలకపాత్రలో కనిపిస్తుంది. ప్రియాంక అరుల్ మోహన్ ఈ సినిమాతో తెలుగు తెరకు హీరోయున్ గా పరిచయం అవుతుంది.

వరల్డ్‌వైడ్‌గా గ్యాంగ్ లీడర్ ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు :

నైజామ్: 8.10 కోట్లు
ఉత్తరాంధ్ర: 2.55 కోట్లు
ఈస్ట్ : 1.65 కోట్లు
వెస్ట్: 1.25 కోట్లు
కృష్ణ: 1.50 కోట్లు
గుంటూరు: 1.70 కోట్లు
నెల్లూరు: 80 లక్షలు
సీడెడ్: 3.50 కోట్లు
ఎపీ + తెలంగాణా 👉టోటల్: రూ. 21.05 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా: 1.85 కోట్లు
ఓవర్సీస్: 5.40 కోట్లు

🔴వరల్డ్ వైడ్ టోటల్: రూ. 28.30 కోట్లు.

🎟వాల్యూ యాడింగ్ ఫ్యాక్టర్స్ :

💥కార్తికేయ విలనిజం :

RX100 సినిమాతో హీరోగా ఎస్టాబ్లిష్ అయిన కార్తికేయ ఈ సినిమాలో విలన్‌గా నటిస్తుండడం కూడా వాల్యూ యాడింగ్ ఫ్యాక్టర్‌గా మారింది.గ్యాంగ్‌లీడర్ మెయిన్ ప్లాట్ అండ్ సినిమా టైటిల్ కూడా బిజినెస్‌కి ప్లస్ అయ్యాయి. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన అనిరుధ్ మ్యూజిక్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ అంశాలన్నీ కూడా గ్యాంగ్‌లీడర్ బిజినెస్ కి చాల హెల్ప్ అయ్యాయి. ఓవరాల్‌గా అన్ని కలిసొచ్చి 28 కోట్ల 30 లక్షలకు అమ్ముడుపోయిన గ్యాంగ్‌లీడర్ పర్లేదు అనిపించుకున్న కూడా పెట్టిన పెటుబడి సునాయాసంగా రికవర్ చెయ్యగలుగుతుంది.


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading