అసభ్యకర మాటలతో ఇలియానా ని ఇబ్బంది పెట్టిన నెటిజన్ : గట్టిగా సమాధానం ఇచ్చిన నడుం సుందరి

Netizan who embarrassed Ileana with vulgar words
Spread the love

Teluguwonders:

సెలబ్రిటీలు సరదాగా అభిమానులతో చాట్ చేయాలని అనుకుంటుంటే దానిని మిస్యూస్ చేసుకుంటున్నారు కొంతమంది నెటిజెన్స్ .సెలబ్రిటీలు రోజూ అభిమానులతో సమయం గడపడం కుదరని పని. అందుకే వారితో కనీసం సోషల్ మీడియా ద్వారానైనా టచ్‌లో ఉండాలని అనుకుంటారు. సమయం కుదిరినప్పుడల్లా వారి కోసం ఇన్‌స్టాగ్రామ్ ద్వారానైనా, ట్విటర్‌లోనైనా చాట్ సెషన్ ఏర్పాటుచేస్తుంటారు. అయితే ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేస్తూ వారిని ఆగ్రహానికి గురిచేస్తుంటారు కొందరు నెటిజన్లు.

👉గతంలో నటి రకుల్ ప్రీత్ సింగ్‌కు కూడా ఇలాంటి ఘటనే ఎదురైంది. ఆమె ముంబయికి వెళ్లినప్పుడు కాస్త పొట్టి దుస్తులు వేసుకుని ఫొటోలు దిగింది. వీటిపై ఓ నెటిజన్ ట్విటర్‌లో స్పందిస్తూ.. ‘కారులో సెక్స్ కానిచ్చేసి ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయినట్లుంది’ అని కామెంట్ చేశాడు. దాంతో రకుల్‌కి ఒళ్లుమండిపోయింది.

‘కారులో మీ అమ్మ కూడా ఇలాంటి సెక్స్ సెషన్స్ బాగా చేస్తుందేమో. అందుకే ఈ విషయంలో నీకు బాగా అనుభవం ఉన్నట్లుంది. ఆ సెషన్స్‌కు సంబంధించిన వివరాలతో పాటు నీకు కాస్త బుద్ధి కూడా ప్రసాదించమని మీ అమ్మను అడుగు. కేవలం సమానత్వం, రక్షణ గురించి డిబేట్లు పెట్టగానే సరిపోదు. ఇలాంటివారు ఉన్నంత వరకు ఆడవారికి ఎక్కడా రక్షణ ఉండదు’ అని చెప్పి గట్టిగా ఇచ్చింది ఆ భామ .

🔴ఇప్పుడు ఇలియానా వంతు :

తాజాగా గోవా బ్యూటీ ఇలియానాకు ఇదే పరిస్థితి ఎదురైంది. ఇలియానాను ఓ అభిమాని అభ్యంతకర ప్రశ్న అడిగాడు. వెంటనే ఇలియానా సదరు అభిమానికి మూతి పగిలిపోయేలా జవాబిచ్చారు.

🔴వివరాల్లోకి వెళ్తే :

ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ASKME’ పేరిట చిట్ చాట్ సెషన్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభిమానులు అడుగుతున్న ప్రశ్నలకు చకచకా సమాధానాలు చెబూతూ వారిని సంతోషపరిచారు. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్‌కు బుర్రలో వెధవ ఆలోచన తట్టింది. దాంతో ఇలియానాను ఓ అసభ్యకర ప్రశ్న అడిగాడు. ‘ఇలియానా.. నువ్వు ఎప్పుడు కన్యత్వం కోల్పోయావ్’ అని ప్రశ్నించాడు. ఇందుకు ఇలియానా తనదైన శైలిలో సమాధానం ఇచ్చి సదరు నెటిజన్ నోరు మూయించారు. ‘వావ్.. తెలుసుకోవాలని చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్లున్నావ్. దీనికి మీ అమ్మ ఏమంటుంది?’ అని సమాధానం ఇచ్చి నోరుమూయించారు.
ఇలాంటి నెటిజన్ల కారణంగా చాలా మంది సెలబ్రిటీలు సోషల్ మీడియా చిట్ చాట్‌కు దూరంగా ఉంటున్నారు. ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో.. వాటికి సమాధానం ఇస్తే ఎన్ని కామెంట్లు వస్తాయోనని ఆలోచించి చాటింగ్‌కు వెనకడుగు వేస్తున్నారు.


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading