Teluguwonders:
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా వస్తోన్న చిత్రం ‘వాల్మీకి’. పూజా హెగ్డే హీరోయిన్. హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించారు. మిక్కీ జే మేయర్ సంగీతం సమకూర్చారు. అయానక బోస్ సినిమాటోగ్రఫీ అందించారు. వరుణ్ తేజ్, పూజా హెగ్డే జంటగా నటించిన ‘వాల్మీకి’ విడుదల తేదీ దగ్గరపడుతుండటంతోచిత్ర ప్రచార కార్యక్రమాలపై యూనిట్ దృష్టి పెట్టింది.తమిళంలో సూపర్ హిట్ అయిన ‘జిగర్తాండ’ మూవీకి రీమేక్‌గా వస్తోన్న ఈ చిత్రం సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
⭐‘వాల్మీకి’ పై ఇంట్రెస్ట్ పెంచేస్తున్న విషయాలు :
ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. 👉మాస్ లుక్‌లో వరుణ్ తేజ్‌ను చూసిన ఫ్యాన్స్ అదరహో అన్నారు. 👉వినాయక చవితి సందర్భంగా వచ్చిన క్లాసికల్ లుక్ చూసి వరుణ్ బాబు సూపరబ్బా అన్నారు. మొత్తం మీద రెండు డిఫరెంట్ లుక్స్‌తో వరుణ్ ‘వాల్మీకి’పై అంచనాలను రెట్టింపు చేశారు. దీనికి తోడు ఇటీవల విడుదల చేసిన మాస్ మసాలా సాంగ్ ప్రేక్షకులను ఊపేసింది. కాగా, సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో ప్రచార కార్యక్రమాలను మరింత వేగవంతం చేస్తోంది యూనిట్.సోషల్ మీడియా ద్వారా ప్రచారానికి ఊపుతెచ్చింది.
💥రిలీజ్ డేట్ పోస్టర్ :
దీనిలో భాగంగా వరుణ్ తేజ్ గురువారం రిలీజ్ డేట్ పోస్టర్‌ను ట్వీట్ చేశారు. ఈ పోస్టర్లో వరుణ్ నోట్లో సిగార్ పెట్టుకుని, గన్ను భుజాన వేసుకుని సీరియస్ లుక్‌లో కనిపిస్తున్నారు. ‘నేను వస్తున్నా! సెప్టెంబర్ 20న’ అని ట్వీట్లో వరుణ్ పేర్కొన్నారు. 💥.. నేను చూస్తున్నా.. వరుణ్ తేజ్‌కు నితిన్ ఛాలెంజ్! ; హీరో నితిన్ ఈ ట్వీట్ పై స్పందించారు. ఆయన వరుణ్ ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ.. ‘నేను చూస్తున్నా సెప్టెంబర్ 20న’ అని పేర్కొన్నారు. వెంటనే వరుణ్ కూడా స్పందించారు. నవ్వుతున్న ఎమోజీలు పెట్టారు.
👉ఇదిలా ఉంటే, ‘వాల్మీకి’లో నితిన్ అతిథి పాత్రలో నటించారనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం నితిన్ చేసిన ట్వీట్ కింద కూడా అభిమానులు ఇదే విషయం పై. ‘అన్న మీరు ‘వాల్మీకి’లో కనిపిస్తారా?’ అని అడుగుతున్నారు . 🔴కానీ, నితిన్ మాత్రం ఇంకా స్పందించలేదు. చూద్దాం ఈ వార్తలో ఎంత నిజముందో..! ఒకవేళ అదే నిజమైతే ఫ్యాన్స్ పండగ చేసుకోవడం ఖాయం..
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.