Teluguwonders:
ఎన్టీఆర్ బయోపిక్ నాకో గుణపాఠం అంటున్నారు ఆ సినిమా నిర్మాత
🔴నిర్మాత విష్ణు ఇందూరి :
మంచి కథలను వెండితెరపైకి తీసుకురావడంలో నిర్మాత విష్ణు ఇందూరిది అందెవేసిన చెయ్యి. అయితే విశ్వ విఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు జీవితాధారంగా తెరకెక్కించిన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ సినిమాలు మాత్రం తనకు తీవ్ర నిరాశ మిగిల్చాయని పేర్కొన్నారు. ఈ ఓటమి తనకో గుణపాఠం లాంటిదని విష్ణు అన్నారు.
💥అదే నేను చేసిన తప్పు :
అలనాటి నటులు నందమూరి తారక రామారావు బయోపిక్‌పై అంత ఖర్చు చేయడమే తాను చేసిన తప్పని అంటున్నారు నిర్మాత విష్ణు ఇందూరి. భారీ బడ్జెట్‌తో ఈ సినిమాలు తీశానని కానీ అవి బాక్సాఫీస్ వద్ద బెడిసికొట్టి గుణపాఠం చెప్పాయని పేర్కొన్నారు. ఎన్టీఆర్ లాంటి గొప్ప నటుడి బయోపిక్ తీసినందుకు ఓ పక్క సంతోషంగా ఉన్నా అది ప్రేక్షకుల అంచనాలను అందుకోనందుకు చాలా బాధగా ఉందని అన్నారు.
🔴సినిమా ఆడకపోవడానికి బాలకృష్ణే కారణం :
సినిమా బాగా ఆడకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయని చెప్పారు. సినిమాలో చెప్పాల్సిన చాలా అంశాలు చూపించలేకపోయామని తెలిపారు. ఒకవేళ సినిమాను ఒక పార్ట్‌గానే తీసుకంటే ఫలితాలు మరోలా ఉండేవని పేర్కొన్నారు. ఏదేమైనా సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయిపోయిందని, ఇది తనకో గుణపాఠంలాంటిందని వెల్లడించారు.ఎన్టీఆర్ బయోపిక్‌లో ప్రేక్షకులకు కావాల్సిన అంశాలను చూపించలేకపోయామని విష్ణు అన్నారు. 👉ఎన్టీఆర్ బయోపిక్ ఫ్లాపవడానికి ఓ రకంగా బాలకృష్ణే కారణం అని చెప్పాలి. ఎందుకంటే సినిమాను రెండు భాగాలుగా తీయాలన్న ఆలోచన ఆయనదేనట. ఇక బాలయ్య బాబు చెప్పిన తర్వాత దర్శకుడు కానీ నిర్మాతలు కానీ ఏమీ మాట్లాడలేరు. దాంతో బాలయ్య చెప్పినట్లుగా సినిమా తీసుకుంటూపోయి బాక్సాఫీస్ వద్ద విఫలమయ్యారు. ఇలాంటి పరిస్థితి ఏదో ఎదురవుతుందని ముందే తెలిసే దర్శకుడు క్రిష్ మెల్లగా సినిమా నుంచి జారుకున్నారట.
💥రామ్ గోపాల్ వర్మకుప్రేక్షకుల నాడి తెలుసు :
ఎన్టీఆర్ బయోపిక్‌లు ఫ్లాపవడం దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు కలిసొచ్చింది. ఎందుకంటే ఆయన ప్రేక్షకుల నాడి తెలిసిన వ్యక్తి కాబట్టి ఎన్టీఆర్ బయోపిక్‌లో మిస్సయినవన్నీ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’లో చూపించారు. అందుకే ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టింది.
⭐ ప్రస్తుతం ఆ బయోపిక్ లు :
ఇప్పుడు విష్ణు ఇందూరి దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయ లలిత బయోపిక్‌ను నిర్మిస్తున్నారు. దీంతో పాటు లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ జీవితాధారంగా వస్తున్న ‘83’ బయోపిక్‌కు కూడా ఆయనే నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
👉మరి జయ లలిత బయోపిక్‌లో అన్ని కాంట్రొవర్షియల్ ఎలిమెంట్స్‌ను చూపిస్తారో లేదో చూడాలి.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.