Teluguwonders:
పవన్ కళ్యాణ్ తన మనసు మార్చుకుని మూడు సినిమాలు రెండు సంవత్సరాలలో చేయబోతున్నాడు అంటూ ఆ సినిమాల వివరాలను ఒక ప్రముఖ ఛానల్ నిన్న రాత్రి ఒక ప్రత్యేక కథనంలో ప్రసారం చేయడం హాట్ న్యూస్ గా మారింది. ఒక వైపు పవన్ సినిమాలలో నటించను అని పలు సార్లు క్లారిటీ ఇస్తున్న పరిస్థితులలో ఈ కథనంలోని వాస్తవాల గురించి ఇండస్ట్రీ వర్గాలు చాల లోతుగా విశ్లేషిస్తున్నాయి.
ఆ ఛానల్ కథనం ప్రకారం పవన్ ‘జనసేన’ కోసం ప్రతినెల 15 రోజులు జనం మధ్య ఉంటూనే మరో 15 రోజులు తన సినిమాల కోసం కేటాయిస్తాడని ఆ ఛానల్ తన కథనంలో క్లారిటీ ఇచ్చింది. ఈ ఏడాది నవంబర్ నుండి పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ వ్రాసిన కథలో నటించబోయే షూటింగ్ మొదలు కాబోతోందని ఈ మూవీని మైత్రి మూవీస్ సంస్థ నిర్మిస్తుందని క్లారిటీ ఇచ్చింది.
ఇక పవన్ తన రెండవ సినిమాగా దర్శకుడు డాలి దర్శకత్వంలో నటిస్తాడని ఆ మూవీలో ‘లెక్చరర్’ పాత్రలో పవన్ కనిపించబోతున్న విషయాన్ని బయట పెట్టింది. ఇప్పటికే డాలి చెప్పిన కథ పవన్ కు నచ్చడంతో ఈమూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కూడ ప్రారంభం అయ్యాయి అంటూ ఈ మూవీని పవన్ సన్నిహితుడు రామ్ తాళ్ళూరి నిర్మిస్తున్నట్లు ఆ ఛానల్ తన కథనంలో సంచలన విషయాలు బయటపెట్టింది.
పవన్ కళ్యాణ్ నటించబోయే మూడవ సినిమాను ప్రముఖ నిర్మాత ఎ.ఎమ్. రత్నం నిర్మిస్తాడని 2021లో విడుదల కాబోయే ఈ మూవీ పూర్తి పొలిటికల్ టచ్ లో ఉంటుందని అయితే ఈ మూవీకి దర్శకుడు ఇంకా ఫిక్స్ కాలేదు అన్న వార్తలను ఆ ఛానల్ చాల ప్రముఖంగా ప్రసారం చేసింది. దీనితో పవన్ సినిమాల రీ ఎంట్రి వార్తలు నిజమేనా అన్న సందేహాలు అభిమానులకు కలుగుతున్నాయి..
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.