Teluguwonders:
💥 పవన్ భావోద్వేగ ప్రసంగం :
మా అన్నయ్య చిరంజీవి లేకపోతే నేను మీ ముందు ఇలా ఉండేవాడని కాదు.. ఎప్పుడో చనిపోయి ఉండే వాడినన్నారు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మెగాస్టార్ 64వ పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా భావోద్వేగం ప్రసంగం చేశారు పవన్ కళ్యాణ్.
మెగాస్టార్ 64వ పుట్టినరోజు వేడుకలు నిన్న (ఆగస్టు 21) హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఘనంగా జరగాయి. ఈ వేడుకలకు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరై భావోద్వేగ ప్రసంగం చేశారు.
పవన్ మాట్లాడుతూ.. ‘ఈరోజు ప్రత్యేకించి మీలో ఒకడిగా మెగాస్టార్ అభిమానిగా ఇక్కడికి వచ్చా. అన్నయ్య పుట్టినరోజు సందర్భంగా ఇప్పుడే ట్వీట్ చేశా. నా స్పూర్తి ప్రదాత అన్నయ్య అని.
🔴నాకు ఇష్టమైన వ్యక్తులు ఆ ఇద్దరు:
ఒక స్వాతంత్ర్య సమరయోధుడి పాత్రలో మన ముందుకు రావడం చాలా ఆనందంగా ఉంది.
ఈ సినిమాలో నాకు ఇష్టమైన వ్యక్తులు ఇద్దరు. ఒకరు అన్నయ్య అయితే.. రెండు అమితాబ్. ఆయన్ని కలిసే అవకాశం ఈ సినిమా షూటింగ్‌లో కలిగింది.
🔴అన్నయ్య.. స్పూర్తి ప్రధాత ఎందుకంటే :
నేను అన్నయ్యను ఎందుకు స్పూర్తి ప్రధాత అన్నానంటే.. ఈమధ్య తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యార్ధులు పదుల్లో చనిపోయినప్పుడు చాలా బాధ కలిగింది. నా జీవితంలో మా అన్నయ్య.. మూడుసార్లు దారి తప్పకుండా కాపాడారు. ప్రత్యేకించి…
👉 నేను ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినప్పుడు :
ఆ టైంలో నేను చాలా నిరాశ చెందా.. అన్నయ్య దగ్గర ఉన్న గన్‌తో కాల్చుకుని చచ్చిపోదాం అనుకున్నా. కాని ఆ సందర్భంలో ఆయన నాకు చెప్పిన మాట.. ముందు నువ్ బతకాలిరా.. నీ బతుకు ఇంటర్‌లో లేదు. నీ దారి వేరే ఉందన్నారు. అన్నయ్య లాంటి వ్యక్తి ప్రతి ఇంట్లో ఉంటే ఎవరూ చనిపోరు.
🔴ఆ మాటలే నన్ను మీ ముందు నిలబెట్టాయి :
దేశాన్ని ఎవరైనా ఏమన్నా అంటే కోపంతో ఊగిపోయేవాడిని. అన్నయ్య నన్ను చూసి ఉద్యమకారుడౌతాడేమో అన్నారు. నువ్ భగవంతుడివైపు వెళితే సమాజానికి ఏం ఉపయోగపడవు. నిజంగా నీకు బాధ్యత ఉంటే నువ్ ఇలా ఉండవు అన్నారు. ఆ మాటలే ఈరోజు నన్ను మీ ముందు నిలబెట్టాయి. అందుకే ఆయన నాకు స్పూర్తిప్రదాత’ అన్నారు పవన్ కళ్యాణ్. 👉ఇది చాలా ప్రత్యేకమైన రోజు ఎందుకంటే.. అన్నయ్యను ఒక అభిమానిగా ఎలాంటి సినిమాలో చూడాలనుకున్నానో ఆ సినిమా ‘సైరా’. అన్నారు పవన్ కళ్యాణ్.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.