Latest

    పవన్‌ కళ్యాణ్‌ బర్త్ డే కి అనసూయ .. స్పెషల్ ట్వీట్ ..

    Teluguwonders:

    పవన్ కల్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా ఒకవైపు ఫ్యాన్స్, మరోవైపు సెలెబ్రిటీలు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెబుతుండడం తో ఆయన పుట్టిన రోజు వేడుక నెట్టింట ట్రెండ్ అయ్యింది. 👉పవన్ పేరుతో రూపొందించిన #HappyBirthdayPawanKalyan ట్యాగ్ ఇండియాలో మొదటి స్థానంలో ట్రెండ్ అవుతుండటం విశేషం.

    🌟పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ :

    టాలీవుడ్ హీరోల్లో కెల్లా పవన్ కల్యాణ్‌ అంటే ఎంతో ప్రత్యేకం. పవర్ స్టార్ ఆ పేరులోనే ఉంది అసలైన పవర్! మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ రంగప్రవేశం చేసిన ఆయన ఆనతి కాలంలోనే టాప్ రేంజ్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. తనదైన స్టైల్‌తో భారీ అభిమాన వర్గాన్ని సొంతం చేసుకున్నారు. అలాంటి పవన్.. సెప్టెంబర్ 2 న తన 48వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. దీంతో సోషల్ మీడియా అంతా పవన్ పుట్టిన రోజు శుభాకాంక్షలతో హోరెత్తిపోతోంది. ఈ నేపథ్యంలో యాంకర్ అనసూయ చేసిన ట్వీట్ బాగా ఆకర్షిస్తోంది. ఇంతకీ ఆ ట్వీట్‌లో ఏముంది? వివరాల్లోకి పోతే..

    🔴యాంకర్ గా , యాక్టర్ గా :

    కేవలం బుల్లితెరపైనే కాదు వెండితెరపై కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అనసూయ. బుల్లితెర హోస్ట్‌గా రాణిస్తూనే వెండితెరపై కాలుమోపిన ఈ భామ అక్కడ కూడా భారీ పాపులారిటీ సంపాదించింది. పలు సినిమాల్లో మెప్పించిన ఆమెకు ఇటు యాంకర్ అనసూయగా, అటు రంగమత్తగా ప్రత్యేక ఫాలోయింగ్ ఉంది.

    🔴నెట్టింట ఫుల్ యాక్టివ్..:

    అనసూయ యాక్టివ్‌నెస్ గురించి చెప్పుకుంటే.. బుల్లితెర, వెండితెర మాత్రమే కాదు నెట్టింట కూడా ఆమె హంగామా మామూలుగా ఉండదు. ఎప్పటికప్పుడు నెటిజన్లతో టచ్ లో ఉంటూ తన వ్యక్తిగత విషయాలు, పండుగ శుభాకాంక్షలు, సెలెబ్రిటీల పుట్టినరోజు విషెష్ అన్నీ పంచుకుంటూనే ఉంటుంది. ఇదే కోవలో తాజాగా పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ వండర్‌ఫుల్ పిక్ షేర్ చేసింది అనసూయ.

    💚పవన్ ని చూసి సిగ్గు పడుతూ –

    హ్యాపీ బర్త్ డే పవన్ అంటూ.. తెగ సిగ్గు పడిపోతోంది.ట్విట్టర్ వేదికగా ”విషింగ్ యు వెరీ హ్యాపీ బర్త్ డే పవన్ కళ్యాణ్ గారు” అని పేర్కొన్న అనసూయ.. తన గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న ఓ సందర్భం తాలూకు పిక్ షేర్ చేసింది. ఆమె గురించి పవన్ చెబుతుంటే ఆయన వైపే చూస్తూ తెగ సిగ్గుపడుతున్నట్లుగా ఈ పిక్‌లో కనిపించింది అనసూయ. దీంతో ఈ పిక్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది.

    🔴ఇంతకీ ఈ పిక్ ఎప్పటిదంటే :

    రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా అనసూయ మ్యాజిక్ చేసింది చూడండి అప్పటిదే. ఆ సమయంలో ఓ కార్యక్రమంలో భాగంగా ఇలా పవన్ కళ్యాణ్, అనసూయ (రంగమ్మత్త) గురించి మాట్లాడారు. అనసూయ షేర్ చేసిన ఆ పిక్‌లో డైరెక్టర్ సుకుమార్, రామ్ చరణ్ తేజ్ కూడా ఉన్నారు.


    Discover more from Telugu Wonders

    Subscribe to get the latest posts sent to your email.

    Leave a Reply

    Discover more from Telugu Wonders

    Subscribe now to keep reading and get access to the full archive.

    Continue reading